జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.
జగిత్యాల జులై 14 ( ప్రజా మంటలు)
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కార్య వర్గం కృషి చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 9న నిర్వహించిన టి యు డబ్ల్యూ జే, ఐ జేయు జిల్లా శాఖ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యుల పరిచయ కార్యక్రమం సోమవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు.
యూనియన్ జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె. సురేంద్ర కుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎండి ఇమ్రాన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపాల చారి, రాష్ట్ర మీడియా సెల్ సభ్యులు టీవీ సూర్యం, దాడుల వ్యతిరేక కమిటీ సభ్యులు ఆదిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా నూతన కార్యవర్గ సభ్యులు పని చేయాలని సూచించారు.
జర్నలిస్టుల వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురవడమే కాకుండా కొంతమంది జర్నలిస్టులు మృతి చెందిన సంఘటనలు కూడా ఇటీవల చోటు చేసుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబాల కోసం కోసం ఆరోగ్య భీమా, జీవిత బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి ఆ దిశగా నూతన కార్యవర్గం కృషి చేయాలని సూచించారు. జిల్లా కార్యవర్గ సమావేశాలను క్రమం తప్పకుండా ప్రతి నెల ఏదో ఒక మండల కేంద్రంలో నిర్వహిస్తూ స్థానిక జర్నలిస్టుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు.
జిల్లా అధ్యక్షుడు చీటీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల వరకే విభేదాలు ఉంటాయని, ఎన్నికల అనంతరం అందరం కలిసికట్టుగా ఉండి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జర్నలిస్టులకు యూనియన్ నుండి గుర్తింపు కార్డులతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ ఆలీ ఆల్లె రాము, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, సహ కార్యదర్శులు చంద్రశేఖర్, చింతల నరేష్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం

నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తేనే ప్రజల్లో మంచి పేరు వస్తుంది.. డిఈ దురిశెట్టి మనోహర్ అంకితభావంతో పని చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారు.. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో భక్తులు

మా కామాఖ్య హాస్పిటల్ వారిచే ప్రెస్ క్లబ్ గణపతి వద్ద అన్నప్రసాద వితరణ

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల దంపతులు

గాంధీ ఆసుపత్రిని 3 వేల పడకలకు అప్ గ్రేట్ చేయాలి

క్రమశిక్షణ, కఠోర శ్రమ తోనే ఉన్నత శిఖరాలకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
