గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ
పలు అభివృద్ది పనుల పరిశీలన
సికింద్రాబాద్, జూన్ 11 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి,గాంధీ మెడికల్ కాలేజీ లో బుధవారం డీఎంఈ డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్ పర్యటించారు. శనివారం గాంధీ ఆసుపత్రిలో నీటి పంపింగ్ నిలిచిపోవడం వల్ల రోగులకు కలిగిన ఇబ్బందులను తెలుసుకుని, దాని పరిష్కారం కోసం చేపట్టిన అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. కేబుల్ ఏర్పాటు పని పూర్తి అయ్యిందని, నీటి పంపింగ్ ఇప్పుడు సజావుగా జరుగుతున్నదని సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ఆయనకు వివరించారు. అనంతరం ఓపి బ్లాక్ లో ఆయుష్మాన్ భారత్ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్ విధానాన్ని, రేడియాలజీ విభాగంలో స్కానింగ్, ఎక్స్ రే ల పనితీరును తెలుసుకున్నారు. జీరియాట్రిక్ వార్డులను ఆయన సందర్శించారు. గాంధీ వైద్య కళాశాల లైబ్రరీ, పీజీ హాస్టల్ ను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులు ఏవైనా ఉంటే సత్వరమే పూర్తి చేయాలని ఆమె కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె ఇందిరకు సూచించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గాంధీ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ అజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పీజీ విద్యార్థుల స్టైఫండ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డీఎమ్ఈ ని కోరారు.ఆయన వెంట ఆసుపత్రి ఆర్ఎంవోలు, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.
