జర్నలిస్టుల ఐక్యతపై డబ్ల్యూజేఐ దృష్టి –కరీంనగర్ జిల్లా కొత్త కార్యవర్గం ఎన్నిక
కరీంనగర్, నవంబర్ 16 (ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కరీంనగర్ సప్తగిరి కాలనీలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్లో డబ్ల్యూజేఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —
జర్నలిస్టుల సమస్యల సాధన, వారి సంక్షేమం కోసం క్షేత్రస్థాయిలో సక్రమ కార్యాచరణతో సంస్థ ముందుకు సాగుతున్నదన్నారు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలలో డబ్ల్యూజేఐ చురుకుగా పనిచేస్తోందని, తెలంగాణలో ఇది బలమైన శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు.
కొన్ని యాజమాన్యాలు జర్నలిస్టులకు వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో, ఆ విషయాన్ని లేబర్ కమిషన్‌కి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. యూనియన్ నిర్మాణం చేయడంతో పాటు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం డబ్ల్యూజేఐ చేస్తున్న పోరాటమే తమ బలం అని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరు కరుణాకర్, అనిల్ దేశాయ్, కార్యదర్శి శివనాధుని ప్రమోద్ కుమార్, కార్యవర్గ సభ్యుడు టి. సత్యనారాయణ పాల్గొన్నారు.
కరీంనగర్ డబ్ల్యూజేఐ జిల్లా కొత్త కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
తదుపరి సమావేశంలో బీఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ కరీంనగర్ జిల్లా శాఖ కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సప్తగిరి కాలనీలోని ఎస్‌ఆర్‌ఆర్ బ్యాంకెట్ హాల్లో జరిగిన సమావేశంలో క్రింది నాయకులు కొత్త బాధ్యతలు స్వీకరించారు.
కొత్తగా ఎన్నికైన కార్యవర్గం
అధ్యక్షుడు:
- దారం జగన్నాథరెడ్డి (భారత శక్తి)
ఉపాధ్యక్షులు:
- మొగురం రమేష్ (తెలంగాణ తేజ ఎడిటర్)
- నర్సరీ కేదారి (ప్రజాస్థానం)
ప్రధాన కార్యదర్శి:
- గుడాల శ్రీనివాస్ (దిశ)
మహిళ కార్యదర్శులు:
- వేముల సుమ (బతుకమ్మ టీవీ)
- లావణ్య
ఆర్గనైజింగ్ కార్యదర్శులు:
- రవీందర్ (ప్రజాసాక్షి)
- జి. రమేష్ (బీఆర్‌కె న్యూస్)
సంయుక్త కార్యదర్శులు:
- కీసర సదానంద్ (మన తెలంగాణ)
- డి.ఎస్. ప్రసాద్ (ఎడిటర్ తెలంగాణ న్యూస్)
- బూర్ల వెంకటేష్ (ప్రజాసాక్షి)
కోశాధికారి:
- చిటుమల్ల మహేందర్
కార్యవర్గ సభ్యులు:
- కృష్ణ హరి (తెలుగు ప్రభ)
- అనుగు శ్రీనివాసరెడ్డి
- జి. రామకృష్ణ (విజయక్రాంతి)
- కంది శ్రీనివాసరెడ్డి (వార్త)
- పి. సంతోష్ గౌడ్ (ఆంధ్రప్రభ)
- జాలి నరేష్
- కస్తూరి ప్రభాకర్ (డెస్క్)
- ఆకుల సంజీవరావు
- గంగం రాజు (ఉదయం)
- కే. రవీంద్ర చారి (జనత)
- ఎండి. రహీముద్దీన్ (స్కైలైన్)
- సి.హెచ్. వెంకటేష్ (నవజ్యోతి)
- కె. కుమార్ (జనం న్యూస్)
డబ్ల్యూజేఐ నాయకత్వం జర్నలిస్టులపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు, వారి హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా మరింత బలంగా పనిచేయాలని నిర్ణయం తీసుకుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాజకీయ నాయకురాలిగా ఎదిగిన గాయని మైథిలి ఠాకూర్
తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీకి ఎన్నికైన మైథిలీ ఠాకూర్
పాట్నా నవంబర్ 16:
మైథిలీ ఠాకూర్ , సుప్రసిద్ధ ఫోక్-శాస్త్రీయ గాయికగా పిలువబడే యువ ప్రతిభ. 2000 జూలై 25న బిహార్ మధుబాని జిల్లా బెనిపట్టీలో జన్మించింది. ఆమె సంగీత ప్రస్థానం చిన్న వయసులో ప్రారంభమైంది — తండ్రి రమేష్ ఠాకూర్ వలన ఆమె బాల్యానికి సంగీత... రాజ్‌కోట్‌లో భారత్-A బౌలర్లు నిప్పులు: SA-A 132 రన్‌లకే ఆలౌట్
రాజ్‌కోట్, నవంబర్ 16:
రాజ్‌కోట్‌లోని నిరంజన్ స్టేడియంలో జరిగిన India A vs South Africa A రెండవ అనధికార ODIలో భారత A జట్టు బౌలర్లు బిజీగా ఉన్నారు. టాస్ గెలిచిన SA-A జట్టు బ్యాటింగ్ తీసుకున్నప్పటికే వ్యాప్తి వచ్చింది — భారత బౌలర్లు ధాటికి SA-A 30.3 ఓవర్లు వేసినప్పుడు కేవలం ... నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయ–ఆర్థిక ఏటీఎంగా మారింది: జీవన్ రెడ్డి
నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయంగా, ఆర్థికంగా ఏటీఎంగా మారిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారుల ఓటు చోరీ కుట్రపై చర్యలు చేపట్టాలని డిమాండ్. జర్నలిస్టుల ఐక్యతపై డబ్ల్యూజేఐ దృష్టి –కరీంనగర్ జిల్లా కొత్త కార్యవర్గం ఎన్నిక
కరీంనగర్, నవంబర్ 16 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కరీంనగర్ సప్తగిరి కాలనీలోని ఎస్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్లో డబ్ల్యూజేఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన... 2026 హార్లీ-డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ 883 జనవరిలో లాంచ్ – కొత్త ఫీచర్లతో అదిరిపోయే క్రూజర్
న్యూయార్క్ నవంబర్ 16:
ప్రపంచవ్యాప్తంగా బైక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 Harley-Davidson Sportster 883 చివరకు జనవరి 2026లో అధికారికంగా లాంచ్ కానుంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, రైడింగ్ కంఫర్ట్—మొత్తంగా హార్లీ బ్రాండ్‌కి తగ్గట్టే ఈ మోడల్ అందరినీ ఆకట్టుకోనుంది.
హార్లీ-డేవిడ్సన్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో స్పోర్ట్‌స్టర్ 883 ఒకటి. తాజా... కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగం పట్ల స్పష్టమైన చర్యలు తీసుకోలేదు:: కల్వకుంట్ల కవిత
టీజేటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం“తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” అంశంపై నిపుణుల చర్చ, కవిత వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజా మంటలు);
తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో “తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, సామాజికవేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొని పలు... శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఘనంగా జయంతి ఉత్సవాలు ప్రారంభం
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయముజగిత్యాల లో ఘనంగా ప్రారంభమైన శ్రీ ధన్వంతరి జయంతోత్సవము మరియు శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవము
మొదటి రోజునవంబర్ 16 ఆదివారం (భానువాసరే కార్తీక మాసం శుక్ల పక్షం ద్వాదశి ఉ.గం. 5.15 ని.ల... సన్మార్గంలో నడిపించే శక్తి.. సంగీత, సాహిత్యాల సొంతం తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి సంగీతం సాహిత్యాల సొంతమని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పుల్లూరి నారాయణ దాసు ఆశ్రమం ఆవరణలో సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ కలం స్నేహం అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో... స్పెషల్ లోక్–అదాలత్‌లో 1861 కేసుల్లో రాజీ :జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)స్పెషల్ లోక్–అదాలత్ ద్వారా సైబర్ మోసాల్లో కోల్పోయిన రూ.20 లక్షల మొత్తం బాధితులకు రీఫండ్
ఈనెల 15 వరకు స్పెషల్ లోక్-అదాలత్ లో భాగంగా, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న
జిల్లాలో... యూపీలో రాతి క్వారీ కూలిన ఘటన ఒకరి మృతి, మరికొందరు శిథిలాల కింది
సోన్‌భద్రా (ఉత్తరప్రదేశ్), నవంబర్ 16:
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రా జిల్లా బిల్లీ–మార్కుండి ప్రాంతంలోని కృష్ణ మైనింగ్ వర్క్స్ స్టోన్ క్వారీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల క్రింద చిక్కుకున్నారు. ఇప్పటివరకు ఒక కార్మికుడి మృతదేహాన్ని బయటకు తీసినట్లు అధికారులు నిర్ధారించారు.
ఘటన ఎలా జరిగింది?
సాక్షులు... బీజేపీకి షాక్: మాజీ మంత్రి ఆర్.కే సింగ్ రాజీనామా – పార్టీ వెంటనే సస్పెండ్
న్యూ ఢిల్లీ నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
మాజీ మంత్రి ఆర్.కే సింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ కార్యకలాపాలలోనూ, నిర్ణయాలలోనూ తాను విభేదిస్తున్నానని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అధికారికంగా సమర్పించారు.
రాజీనామా ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీజేపీ... బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి NDA భారీ ఏర్పాట్లు — నవంబర్ 19 లేదా 20న కార్యక్రమం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA 202 సీట్లు గెలుచుకున్న తర్వాత, నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వేడుకను నవంబర్ 19 లేదా 20న ఘనంగా నిర్వహించేందుకు NDA సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి మోదీ హాజరుకానున్నారు. 