ఉపాధ్యాయులంత చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు వస్తుంది
జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల మే 16 (ప్రజా మంటలు)
పిల్లల జీవితాలను బాగు చేసే సువర్ణ అవకాశం మనకు లభించింది కావున ఉపాధ్యాయులంత
చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు వస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు.
జగిత్యాల పట్టణంలోని ఓల్డ్
హైస్కూల్ జడ్పీహెచ్ఎస్ బాలురు, జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన వేసవి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు వచ్చే విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.
శుక్రవారం జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్ జడ్పీహెచ్ఎస్ బాలురు, జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన వేసవి శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ, విద్యా శాఖలో ఒకే రోజు మార్పు సాధ్యం కాదని, నిర్విరామంగా ప్రయత్నం జరుగుతూ ఉండాలని అన్నారు.
టీచర్ వృత్తి లో మనం కొనసాగడానికి ఒకే కారణం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలు మాత్రమేనని, నిరుపేద రైతులు, కూలీలు, బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల జీవితాలను బాగు చేసే అవకాశం మనకు లభించిందని అన్నారు.
భారత దేశంలో యువతకు మంచి విద్య నైపుణ్యం అందించగలిగితే సూపర్ పవర్ గా ఎదుగుతామని అన్నారు. చదువుకునేందుకు సామర్థ్యం లేని పిల్లలు మన దగ్గర ఎవరూ లేరని, సమాజంలో మంచి పునాది ఉండాలంటే ఉపాధ్యాయులు కీలకమని అన్నారు.
జిల్లాలోని ఉపాధ్యాయులకు మే 13 నుంచి మే 31 వరకు కంటెంట్ ఎన్ రిచ్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైఫ్ స్కిల్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ వంటి అంశాల పై గణిత , సోషల్ మండల రిసోర్స్ పర్సన్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఐఆర్పీ లకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయులంతా చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు వస్తుందని, వేసవి శిక్షణలో నేర్చుకున్న అంశాలను బోధనలో ఉపాధ్యాయులు అమలు చేయాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవగ్రహ పూజా అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో... కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం
కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్... సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.రఘురాం జగిత్యాలకు చెందిన బండి... ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత... ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)
పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థలు మరోసారి తమ ప్రతిభను చాటుకుంటూ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించాయి.
ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి లో 591, 590 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా... పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి ఏప్రిల్ 28 (ప్రజా మంటలు)
రానున్న 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై టెంపుల్ మాస్టర్... రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం... - ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 26 (ప్రజా మంటలు)
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం లో ఆర్య వైశ్య సంఘం ఆద్వర్యం లో జయంతి వేడుకల్లో పాల్గొని పోచమ్మ ఆలయం నుండి వాసవి మాత ఆలయానికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతని పల్లకిలో తీసుకొచ్చే కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోసి ప్రత్యేక... ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు) జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు.*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత మాట్లాడుతూ* వాసవీ మాత
ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు
బుగ్గారం ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు) సర్పంచ్ లు గ్రామాలలో టామ్ - టామ్ చేయించాలి
బుగ్గారం ఎస్సై జి.సతీష్
వేసవి కాలం కదా అని ఈత సరదాతో బావుల్లోకి, చెరువుళ్ళోకి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై జి.సతీష్ అన్నారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక... పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి
గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):
పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో... ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు
.
జగిత్యాల ఏప్రిల్ 26( ప్రజా మంటలు)వాల్మీకి ఆవాసం సేవాభారతి అధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆదివారం ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించారు.
జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులో గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి... 