మాదకద్రవ్యాల వినియోగం ద్వారా హింస ,అనారోగ్యం, నైతిక విలువల పతనం
జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 24(ప్రజా మంటలు)
మాదకద్రవ్యాల వినియోగం సమాజాన్ని హింస, అనారోగ్యం, నైతిక విలువల పతనం వంటి అనేక దుష్ప్రభావాల వైపు నడిపిస్తోందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమం లో బాగంగా గురువారం పొలాస వ్యవసాయ కళాశాలలో జిల్లా పోలీసు శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... సమాజం నుంచి యువత మంచిని మాత్రమే నేర్చుకోవాలని చెడు వ్యసనాలు, అలవాట్లపై, ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోకూడదని విద్యార్థి దశ నుండే మన ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉండాలని అలాంటి ఆలోచన వల్లే మనం జీవితంలో అనుకున్నా స్థాయిలో రాణించగలుగుతామని అన్నారు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో యువత పోటీ తత్వంతో ఉండాలని నేటి యువత పైన దేశ అభివృద్ధి ఆధారపడి వుంటుందని అన్నారు. యువత విద్యార్థులు మాదకద్రవ్యాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉండాలని వాటికి బానిస కావడం ద్వారా అనుకోకుండా క్రైమ్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఏదైనా క్రైం చేసినట్లయితే ఎలాంటి ఉద్యోగం కూడా రాదని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి గురించి న సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గాని, డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణ నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందిని డ్రగ్స్, గంజాయి రహిత జిల్లాలుగా మార్చడం జరుగుతుందని అన్నారు.
అనంతరం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో ముద్రించిన ప్రచారం పోస్టర్లను ఆవిష్కరించారు.
అవగాహన సమావేశం అనంతరం, డ్రగ్స్, మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్న యువతను జాగృతం చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను ఎస్పి విద్యార్థులతో కలిసి తిలకించారు.
కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ సైదా నాయక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కార్యక్రమ కో ఆర్డినేటర్, కళాశాల ఎన్ సి సి లెఫ్టినెంట్ అధికారి, డీ-అడిక్ట్ ట్రైనర్ పర్లపల్లి రాజు, సి సి ఎస్ సి.ఐ శ్రీనివాస్, రూరల్ సి.ఐ కృష్ణారెడ్డి, రూరల్ ఎస్ ఐ సదాకర్, కళాశాల ఎన్ఎస్ ఎస్ అధికారి ఎల్లాగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇరాన్ అధికారులపై సౌదీ అరేబియా కఠిన నిర్ణయం – 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని నిష్క్రమణ ఉత్తర్వులు
రియాద్ మార్చ్ 22:
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. ఈ పరిణామాల్లో భాగంగా, సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అధికారులు ఒక ఇరాన్ సైనిక అధికారిని, అలాగే రాయబార కార్యాలయానికి చెందిన నలుగురు సిబ్బందిని “అనవసర వ్యక్తులు” (persona... రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల మార్చి 21 (ప్రజా మంటలు)ఈద్గా ల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని శాంతి, సామరస్య వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలు ఈద్గాల వద్ద ఏర్పాటు... ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత
జగిత్యాల మార్చి 21 (ప్రజా మంటలు)పట్టణం లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా మంచినీళ్ల బావి ఈద్గా మరియు కిల్ల జగిత్యాల జమ మసీద్ దగ్గర బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా... జనాకర్షక పథకాల కి తప్ప విద్యారంగానికి కేటాయింపులు లేవు_ )ఎస్ టి యు
జగిత్యాల మార్చి 20(ప్రజా మంటలు)జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత విద్యా వ్యవస్థను బాగు చేసే విధంగా విద్యారంగానికి కేటాయింపులు లేవని స్టేట్ టీచర్స్ యూనియన్ జగిత్యాల జిల్లా శాఖ అభిప్రాయపడింది. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఎస్టీయూ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు బైరం హరికిరణ్,... అన్నాడీఎంకే కూటమిలో సీట్ల పంపకం ఎప్పుడు? ఏమిటి సమస్య? ఎవరికెంత?
చెన్నై మార్చ్ 19:
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో సీట్ల పంపకం చర్చలు తుది దశకు చేరుకున్నాయని సమాచారం.. ఇప్పటి వరకు లభ్యమైన వివరాల ప్రకారం:భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి – 27 స్థానాలుపట్టాళి మక్కల్ కచ్చి (పామక)కు... తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు.. ప్రజా బడ్జెట్ విడుదల
హైదరాబాద్, మార్చ్ 19 (ప్రజా మంటలు):శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెతో పాటు అనిల్ దంపతులు, జాగృతి ముఖ్య నాయకులు హాజరయ్యారు.
రూ.2,15,200... ఆరెకటిక సంఘం భవననిధులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు వినతి
జగిత్యాల మార్చి 19 ప్రజా మంటలుజగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో కలిసిన జగిత్యాల ఆరెకటిక సంఘం సభ్యులు.జగిత్యాల కటికవాడలో ఆరెకటిక సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు.సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు – దావ వసంత సురేష్
జగిత్యాల, మార్చ్ 18 (ప్రజా మంటలు):
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.ఈ సందర్భంగా ప్రత్యేక... వెలుగుమట్ల బాధితులకు అండగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ – తొలి రోజే సమస్యల పరిష్కారానికి చర్యలు
వెలుగుమట్ల, ఖమ్మం (మార్చ్ 18 – ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వారికి కొండంత అండగా మారింది. తొలి రోజే బాధితుల సమస్యలు పరిష్కారమయ్యేలా కమిటీ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్‌లో... విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి
జగిత్యాల మార్చి 18 (ప్రజా మంటలు) విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్.
ఇట్టి కార్యక్రమములో సంఘ సభ్యులు చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు బొల్లరపు గిరిధర్ స్వప్న, దయాల... జగిత్యాలలో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రం.. సంజయ్ కుమార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ వీడే పరిస్థితి ఎందుకు వచ్చింది? జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్జగిత్యాల రాజకీయాలు హీట్.. ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఆగ్రహంకాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిందెవరు? జీవన్ రెడ్డి బహిరంగ విమర్శలుజగిత్యాల మార్చ్ 27 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి... రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక.
జగిత్యాల 16 మార్చి (ప్రజా మంటలు) :
ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణి ఎంపిక కావడము జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ,... 