డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం.
భారత దేశంలో 1986లో వినియోగ దారుల ప్రయోజనార్థం, వారి హక్కుల పరిరక్షణ కోసం వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించారు. భారత రాష్ట్రపతి ఆమోదంతో 1986 డిసెంబర్ 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ చట్టం ప్రకారం వినియోగ దారులకు ఆరు హక్కులు ప్రకటించింది. వినియోగ దారుల రక్షణ మానవ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాద కారక వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు... అవసరాలు తీర్చడమే కాకుండా, దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవలను పొందాలి. సమాచారం పొందే హక్కు...అవాంఛిత వ్యాపార కార్యకలాపాల నుంచి వినియోగ దారులకు రక్షణ కల్పించేందుకు వస్తు నాణ్యత, బరువు, స్వచ్ఛత, పుష్టి, ప్రమాణం గురించి తెలియ జేయాలి. నాణ్యమైన సేవలు పొందే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది. వస్తువులను, సేవలను ఎంపిక చేసుకునే హక్కు...వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి మధ్య రేటు తెలుసు కోవడం మంచిది. సముచిత రేటులో నాణ్యత, సేవలు పొందడం. ప్రాతినిధ్యం వహించే హక్కు...వినియోగ దారుల ఆసక్తిని, వారి అవసరాలను సరైన వేదికలు, ఫోరంలలో వినిపించడం. వినియోగ దారుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన వివిధ వేదికలలో ప్రాతినిధ్యం వహించడం. వినియోగ దారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవాలోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు... వినియోగ దారులు మోసానికి గురయినప్పుడు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొందడం. వినియోగ దారుల విద్య హక్కు... వినియోగ దారులు నిరంతరం తమ హక్కులను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని పెంచు కోవడం, నైపుణ్యాలను పెంపొందించు కోవడం ఎంతో అవసరం. గ్రామీణ ప్రాంతాలలో వినియోగ దారులు హక్కుల పట్ల అవగాహన లేక ఎంతో మోస పోతున్నారు.
నూతన వ్యాపారాభివృద్ధి సంస్కరణల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో, ఈ-కామర్స్, టెలిషాపింగ్ విధానంలో వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రజలను మోసగించే సైబర్ నేరాలు దీని వల్ల చోటుచేసు కుంటున్నాయి. వినియోగ దారులను తప్పుడు ప్రకటనలు, సందేశాలతో మోసగించడం పెరిగి పోతున్నది. దీంతో వినియోగ దారుల హక్కుల రక్షణ కోసం కొత్త చట్టాల ఆవశ్యకత ఏర్పడింది. 1986నాటి చట్టం స్థానంలో 2019లో మరో చట్టాన్ని రూపొందించారు. అది ఈ 2020 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. వాణిజ్య వ్యాపారాల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో, సేవా సంస్థల్లో పనిచేసే వారు నిర్లక్ష్యంగా, మోస పూరితంగా వ్యవహరించి నప్పుడు కఠిన చర్యలు తీసుకు నేందుకు ప్రపంచం లోని చట్టాలన్నింటి కన్నా మెరుగ్గా భారత దేశంలో తొలిసారి 1986లో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించారు. తక్కువ సమయంలో, అతి తక్కువ రుసుముతో, దళారుల ప్రమేయం లేకుండా జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాల్ని, కమిషన్లను ఆశ్రయించి వ్యక్తిగతంగా సత్వర న్యాయం పొందే సౌలభ్యం దీని ద్వారా లభించింది. ఇప్పుడు సైబర్ నేరాల కారణంగా దాని స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ నూతన చట్టాన్ని 2020 జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా అమలు పరుస్తున్నారు.
వినియోగ దారులకు తక్కువ ఖర్చులో, ఇబ్బందులకు తావు లేని రీతిలో, శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశ వ్యాప్తంగా వేరు వేరు స్థాయిలలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్ మూడు అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. (ఎ) కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం. ఈ కోర్టునే జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు. (బి). కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం. ఈ కోర్టునే రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు. (సి). రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక. ఈ కోర్టునే డిస్ట్రిక్ట్ ఫోరమ్ గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం, అధికారాల పరంగా క్వాసీ- జ్యుడీషియల్ యంత్రాంగంగా పని చేస్తాయి.
జాతీయస్థాయిలో సెంట్రల్ కన్స్యూమర్ అథారిటీ అనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించి తగిన విచారణాధికారాలు, విచక్షణాధికారాలు కల్పించారు. ఇందులో డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారితో కూడిన కమిటీ ఉంటుంది. నేరాలకు పాల్పడినట్లు నిరూపితమైన వ్యక్థులపై, సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటారు. నూతన చట్టం ప్రకారం.. అరెస్టులు చేయించే అధికారం, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షను, పది లక్షల రూపాయల వరకూ జరిమానాను విధించే అధికారం సెంట్రల్ అథారిటీకి ఉంటుంది. జిల్లా కమిషన్లు ఇచ్చిన తీర్పులపై ఉన్నత రాష్ట్రస్థాయి కమిషన్‌ను ఆశ్రయించేందుకు వ్యతిరేక పార్టీ కనీసం యాభైశాతం లేదా రూ.25 వేలు రాష్ట్ర కమిషన్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 30 రోజులకు బదులుగా 45 రోజులుగా కాలవ్యవధిని నిర్ణయించారు. రాష్ట్ర కమిషన్‌లో ప్రెసిడెంట్‌తో పాటు విధిగా నలుగురు సభ్యులుండాలి. రెండు బెంచీలు నిర్వహించి వినియోగ దారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషిచేయాలి. ఈ మేరకు రాష్ర్టాలను కేంద్రం ఆదేశించింది. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో అధ్యక్షులు, సభ్యుల నియామకం కాలాన్ని ఐదేండ్లకు బదులు నాలుగేండ్లకు కుదించారు. గరిష్ఠ వయస్సు 65 ఏండ్లుగా నిర్ణయించారు.
రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ గురించి
విస్తృతంగా ప్రచారం చేయాలి. నూతన వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో, కళాశాల, విశ్వ విద్యాలయాల్లో పాఠ్య పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో వినియోగ దారుల విద్య, చట్టం ప్రాధాన్యం, అమలుపై గురించి తెలియ జేయాలి.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇండియా vs సౌత్ ఆఫ్రికా — ఎడెన్ గార్డెన్స్‌లో, సౌత్ ఆఫ్రికా ఉత్కంఠ భరిత విజయం
ఇండియా vs సౌతాఫ్రికా ఎడెన్ గార్డెన్స్ టెస్ట్ 2025లో సౌతాఫ్రికా 30 రన్లతో గెలిచింది. బుమ్రా ఫైవర్, హ్యార్మర్ 8 వికెట్లు, బవుమా కీలక ఇన్నింగ్స్, ఇండియా 93కి ఆలౌట్ – పూర్తి మ్యాచ్ విశ్లేషణ ఇక్కడ చదవండి. రామోజీరావు ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రకటన
రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్–2025 ఈ సంవత్సరం మరోసారి సేవ, ప్రతిభ, కృషికి ఇచ్చే గౌరవం ఎంత గొప్పదో నిరూపించాయి. సమాజానికి నిజమైన సేవచేసే వ్యక్తులకు ఇది మరొక ప్రమేయం, మరొక ప్రోత్సాహం. మా నిధుల మూలం ‘గురు దక్షిణ’ : RSS చీఫ్.మోహన్ భగవత్
స్వయంసేవకులు తమ అవసరాలను తగ్గించుకుని, స్వచ్ఛందంగా సంస్థకు సహకరిస్తారు : మోహన్ భగవత్
జైపూర్ రాజస్తాన్, నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్వసంఘచాలకుడు మోహన్ భగవత్ జైపూర్‌లో జరిగిన, వంద సంవత్సరాల RSS సభలో, ఆర్ఎస్ఎస్ ప్రయాణం, సేవా కార్యకర్తల త్యాగం, సంస్థ నిధుల వ్యవస్థపై విశదీకరించారు. సంఘం... తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి రెండు కీలక ఫిర్యాదులు; విచారణకు ఆదేశాలు
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ (TGHRC) చైర్మన్ గౌరవనీయ న్యాయమూర్తి డా. జస్టిస్ షమీమ్ అక్థర్ ఆధ్వర్యంలో రెండు వేర్వేరు మానవ హక్కుల ఉల్లంఘన కేసులను స్వయంగా నమోదు చేసి సంబంధిత అధికారులకు విచారణకు సంబంధించి కీలక దిశానిర్దేశాలు జారీ చేసింది.
మంథనిలో పోలీసులు కొట్టడంతో యువకుడు మృతి... రాజకీయ నాయకురాలిగా ఎదిగిన గాయని మైథిలి ఠాకూర్
తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీకి ఎన్నికైన మైథిలీ ఠాకూర్
పాట్నా నవంబర్ 16:
మైథిలీ ఠాకూర్ , సుప్రసిద్ధ ఫోక్-శాస్త్రీయ గాయికగా పిలువబడే యువ ప్రతిభ. 2000 జూలై 25న బిహార్ మధుబాని జిల్లా బెనిపట్టీలో జన్మించింది. ఆమె సంగీత ప్రస్థానం చిన్న వయసులో ప్రారంభమైంది — తండ్రి రమేష్ ఠాకూర్ వలన ఆమె బాల్యానికి సంగీత... రాజ్‌కోట్‌లో భారత్-A బౌలర్లు నిప్పులు: SA-A 132 రన్లకే ఆలౌట్
రాజ్‌కోట్, నవంబర్ 16:
రాజ్‌కోట్‌లోని నిరంజన్ స్టేడియంలో జరిగిన India A vs South Africa A రెండవ అనధికార ODIలో భారత A జట్టు బౌలర్లు బిజీగా ఉన్నారు. టాస్ గెలిచిన SA-A జట్టు బ్యాటింగ్ తీసుకున్నప్పటికే వ్యాప్తి వచ్చింది — భారత బౌలర్లు ధాటికి SA-A 30.3 ఓవర్లు వేసినప్పుడు కేవలం ... నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయ–ఆర్థిక ఏటీఎంగా మారింది: జీవన్ రెడ్డి
నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయంగా, ఆర్థికంగా ఏటీఎంగా మారిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారుల ఓటు చోరీ కుట్రపై చర్యలు చేపట్టాలని డిమాండ్. జర్నలిస్టుల ఐక్యతపై డబ్ల్యూజేఐ దృష్టి –కరీంనగర్ జిల్లా కొత్త కార్యవర్గం ఎన్నిక
కరీంనగర్, నవంబర్ 16 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కరీంనగర్ సప్తగిరి కాలనీలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో డబ్ల్యూజేఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన... 2026 హార్లీ-డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ 883 జనవరిలో లాంచ్ – కొత్త ఫీచర్లతో అదిరిపోయే క్రూజర్
న్యూయార్క్ నవంబర్ 16:
ప్రపంచవ్యాప్తంగా బైక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 Harley-Davidson Sportster 883 చివరకు జనవరి 2026లో అధికారికంగా లాంచ్ కానుంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, రైడింగ్ కంఫర్ట్—మొత్తంగా హార్లీ బ్రాండ్‌కి తగ్గట్టే ఈ మోడల్ అందరినీ ఆకట్టుకోనుంది.
హార్లీ-డేవిడ్సన్లో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో స్పోర్ట్‌స్టర్ 883 ఒకటి. తాజా... కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగం పట్ల స్పష్టమైన చర్యలు తీసుకోలేదు:: కల్వకుంట్ల కవిత
టీజేటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం“తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” అంశంపై నిపుణుల చర్చ, కవిత వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజా మంటలు);
తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో “తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, సామాజికవేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొని పలు... శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఘనంగా జయంతి ఉత్సవాలు ప్రారంభం
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయముజగిత్యాల లో ఘనంగా ప్రారంభమైన శ్రీ ధన్వంతరి జయంతోత్సవము మరియు శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవము
మొదటి రోజునవంబర్ 16 ఆదివారం (భానువాసరే కార్తీక మాసం శుక్ల పక్షం ద్వాదశి ఉ.గం. 5.15 ని.ల... సన్మార్గంలో నడిపించే శక్తి.. సంగీత, సాహిత్యాల సొంతం తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి సంగీతం సాహిత్యాల సొంతమని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పుల్లూరి నారాయణ దాసు ఆశ్రమం ఆవరణలో సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ కలం స్నేహం అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో... 