డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
డిసెంబర్ 27...జనగణమన మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభలో పాడిన దినం
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
భారత జాతీయ గీతమైన జనగణమన 1911లోరవీంద్రనాధ్ ఠాగూర్ రచించిన, మొదటిసారి పాడిన గీతాన్ని 1911 డిసెంబర్ 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు. జనగణ మన భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. భారత జాతీయ గీతం సంస్కృత పద భూయిష్టమైన బెంగాలీ భాషలో ఉంది. 1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది. 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ముందుగా ఠాగూర్ సృష్టించారు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడ ప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.
భారతదేశ జాతీయగీతం 'జనగణమన' గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నిజానికి 1911లోనే రాశారు. అదే ఏడాది డిసెంబర్ 27న కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావే శాలలో దానిని ఆలపించారు. ఆ తర్వాత కూడా జాతీయోద్యమం నేపథ్యంలో ఆ గీతాన్ని అనేక సార్లు, అనేక వేదికల మీద ఆలపించారు. అయితే ఇప్పుడు మనం వినే ట్యూన్‌లో కాకుండా, నిర్ధిష్టమైన స్వర కల్పన లేకుండా, ఎవరికి నచ్చిన రాగంలో వాళ్లు పాడుకునే వారు. జనగణ మనకు ఆ స్వరాన్ని కట్టింది ఒక ఐరిష్ జాతీయు రాలైతే... దానికి వేదికైంది చిత్తూరు జిల్లా మదనపల్లె అనే విషయం చాలా మందికి తెలియని తెలియదు. భారత స్వాతంత్రో ద్యమాన్ని బలపరిచిన డాక్టర్ అనీబిసెంట్ మదన పల్లెలో థియోసాఫికల్ కాలేజీని స్థాపిం చారు. ఐరిష్ జాతీయుడైన ప్రముఖ విద్యావేత్త జేమ్స్ హెన్రీ కజిన్స్ దాని ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. లండన్ మ్యూజిక్ కాలేజిలో చదువుకున్న ఆయన భార్య మార్గరెట్ కజిన్స్ అక్కడ సంగీతాన్ని నేర్పించేవారు.
1919లో దక్షిణ భారతదేశ పర్యటనలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకరోజు బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఉన్నపుడే ఆయనకు మదనపల్లె వాతా వరణం, జేమ్స్ కజిన్స్ కవిత్వం అంటే చాలా ఇష్టమైన ఠాగూర్, కజిన్స్ అక్కడే ఉన్న విషయం తెలుసుకుని, ఆయన విశ్రాంతి కోసం మదనపల్లెలోని థియోసా ఫికల్ కాలేజీ చేరు కున్నారు. ఠాగూర్‌కు ప్రశాంత వాతావరణం కలిగిన థియో సాఫికల్ కాలేజీలో ప్రతి బుధవారం భోజనాల తర్వాత విద్యార్థులంతా కలిసి పాటలు పాడేవాళ్లు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఠాగూర్, ఒక కార్యక్రమంలో పాల్గొని, ఆ సందర్భంగా ఆయన స్వయంగా తన గొంతుకతో జనగణ మన ఆలపించారు. ఠాగూర్ కంఠస్వరం నుంచి వెలువడిన ఆ పాటకు విద్యార్థులంతా గొంతు కలిపారు. మార్గరేట్ కజిన్స్ కూడా ఆ సమయంలో అక్కడే ఉండి, పాటలోని దేశభక్తిని, జాతీయ భావాన్ని గమనించారు. కానీ అప్పటికి జనగణమనను ఎవరికి వారే తోచిన రీతిలో పాడుకునే వారు. ఎవరూ రాగయుక్తంగా పాడ లేదు. కనుక దానిని తానే స్వర బద్ధం చేయాలని నిర్ణయించు కున్నారు. తెల్లవారి ఆమె ఠాగూర్ ను కలిసి జనగణమనను స్వర బద్ధం చేయాలన్న తన కోరికను వెలి బుచ్చారు. దీనికి అంగీక రించిన ఠాగూర్, ఆమెకు ఆ పాట అర్థాన్ని వివరించారు. దానికి స్వరం ఎలా ఉంటే బాగుంటుందో సూచిం చారు. తర్వాత మార్గరేట్ కజిన్స్ తన విద్యార్థినుల సహాయంతో ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ దానికి. బాణీ సమకూర్చారు. తర్వాత ఠాగూర్‌కు తాను కట్టిన స్వరాన్ని వినిపించారు. కొన్ని చిన్న చిన్న సంగీత పరికరాలతో విద్యా ర్థులు రాగయుక్తంగా పాడిన జనగణమన గీతాన్ని విన్న ఠాగూర్ ఆమెను ఎంతగానో అభినందిం చారు. బెంగాల్‌లో పుట్టిన జనగణ మన గీతం మదనపల్లెలో స్వరాన్ని సమకూర్చు కున్నది. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలో ఉన్న సమయంలోనే ఒక ఉదయాన థియోసాఫికల్ కాలేజీ ప్రాంగణం లోని చెట్టుకింద కూర్చుని జనగణమనను ఆంగ్లం లోనికి అనువదించారు కూడా.
ఆ తర్వాత దానిని తన అందమైన చేతిరాతతో రాయడమే కాకుండా, కింది భాగంలో దాని పేరు 'మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' అని రాశారు. దాని కింద ఫిబ్రవరి 28, 1919 అని రాసి, సంతకం చేసి, మార్గరేట్ కజిన్స్‌కు బహుమానంగా ఇచ్చారు. మదనపల్లె కాలేజీ వదలివెళ్లే ముందు ఠాగూర్ దానిని 'దక్షిణ భారతదేశపు శాంతినికేతన్' అని కీర్తించారు.
నిజానికి జనగణమన దేశభక్తి గేయం. ‘జన గణ మన’ ఇక నుంచీ మన కొత్త గణతంత్ర రాజ్యానికి జాతీయ గీతమనీ, దీన్ని అంతా గౌరవించి ఆదరించాలనీ 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రకటన చేశారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో మహో న్నత పాత్ర పోషించిన ‘వందేమా తరం’ గీతాన్ని కూడా జన గణ మనతో సమానంగా గౌరవించి ఆదరించాలి’’ అని ఆ రోజున రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 51ఏలో ఈ గీతాన్ని గౌరవించా లంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రస్తావన కనిపిస్తుంది. ‘‘ప్రతి పౌరుడూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి రాజ్యాంగ ఆదర్శాలు, లక్ష్యాలు, సంస్థలను గౌరవించాలి’’ అని ఈ చట్టం పేర్కొంటున్నది. ప్రార్థనగా, కృతజ్ఞతగా పఠించే 52 సెకన్ల ఈ చిన్న గీతానికి ఉన్నంత గుర్తింపు , భారత దేశంలో, ప్రపంచంలో కూడా మరే గీతానికీ లేదు. మన జాతీయ గీతం దేశ సమైక్యతకు సరైన ప్రతీకగా నిలిచింది.
జాతీయ గీతం, జాతీయ పతాకం పట్ల గౌరవం, ప్రేమాభిమానాలు ప్రదర్శించడ మంటే మాతృభూమిని గౌరవించు కోవడమే అవుతుంది. ఇది ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, జాతీయ భావాన్ని నింపడానికి ఉపకరిస్తుంది.
జనగణమన పాడినప్పుడు దాని అర్ధాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకోవాలి. దాని నేపథ్యాన్ని, అర్థాన్ని, ప్రాధాన్యతను గుర్తించి, తర్వాత తరం వారికి చేర్చాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.
ఠాగూర్ వ్రాసిన ఈ గీతం లో అయిదు చరణాలు ఉండగా కొన్ని రాజకీయ కారణాల వలన కేవలం ఒకే చరణాన్ని మాత్రమే జాతీయ గీతం లో చేర్చడం జరిగింది.
పూర్తి గీతం ఇలా ఉంది...
జనగణమన అధినాయక జయ హే! భారత భాగ్య విధాతా
పంజాబ్, సింధు, గుజరాత, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా
వింధ్య హిమాచల యమునా గంగా, ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభనామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
2వ చరణం... అహరహ తవ ఆహ్‍బాన్ ప్రచారిత, శుని తవ ఉదార వాని(ణి), హిందు, బౌద్ధ్, శిఖ్, జైన్, పారశిక్, ముసల్మాన్, క్రిస్తాని,పూరబ్ పశ్చిమ ఆశే, తవ సింఘాసన పాశే,
ప్రేమ్ హార్ హొయె గాథా
జనగణ ఐక్య విధాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
3వ చరణం... పతన అభ్యుద్దయ్ బన్ధుర్ పంథా, యుగ్ యుగ్ ధావిత యాత్రి, హే చిరొ సారొథి, తవ రథ్ చక్రే, ముఖరిత పథ్ దిన్ రాత్రి
దారుణ విప్లవ మాఝే, తవ శంఖధ్వని బాజే
సంకట దుఃఖ త్రాతా
జనగణ పథ్ పరిచాయక జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
4వ చరణం... ఘోర తిమిర్ ఘన నిబీడ నిశీథే, పీడిత మూర్చిత దేశే
జాగృత ఛిల తవ అవిచల మంగళ, నత నయనే అనిమేషే
దుస్స్వప్నే ఆటంకే, రక్షా కరిలే అంకే, స్నేహమయి తుమి మాథా
జనగణ దుఃఖ త్రయకా జయ హే! భారత భాగ్య విధాతా
జయ హే! జయ హే! జయ హే! జయ జయ జయ, జయ హే!
జయ హే!
5వచరణం... రాత్రి ప్రభాతిలా ఉదిల రవిఛావి, పూర్వ ఉదయగిరి భాలే, గాహే విహంగమ్ పుణ్య సమిరన్, నవ జీవన రస్ ఢాలే
తవ కరుణారుణ రాగే, నిద్రిత భారత జాగే,
తవ చరణె నత మాథా
జయ జయ జయ హే! జయ రాజెశ్వర్, భారత భాగ్య విధాతా
జయహే! జయహే! జయహే! జయ జయ జయ జయహే!
More News...
<%- node_title %>
<%- node_title %>
కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్‌లో కాల్పులతో దోపిడీ – 5 మంది నిందితుల కోసం 12 బృందాల గాలింపు
కరీంనగర్ మే 03 (ప్రజా మంటలు):
కరీంనగర్ జ్యోతినగర్‌లోని PMJ జ్యువెలరీ షాప్‌లో పట్టపగలే సంచలన దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు తుపాకులతో షాప్‌లోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి, భారీగా బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి... కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక
హైదరాబాద్, మే 03 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్లో బీఆర్‌ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్‌ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.కవిత గారిపై కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను... డీసీపీవో హరీష్‌పై కఠిన చర్య – సేవల నుంచి తొలగింపు
జగిత్యాల, మే 02 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా డీసీపీవో ఎం. హరీష్‌ను సేవల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగం, మహిళా ఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు వంటి ఆరోపణలు ఆయనపై నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ అంశాలపై గతంలోనే హరీష్‌కు... సురభి గోశాల, తాటిపల్లిలో భక్తిశ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు
జగిత్యాల మే1(ప్రజా మంటలు)సురభి గోశాలలో నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం విజయవంతంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ముగిసింది. 11 మంది దంపతులు కలసి, ఒకే సంకల్పంతో, ఒకే భక్తితో వ్రతం నిర్వహించడం చూడటం నిజంగా హృదయానికి హత్తుకునే అనుభూతనీ నిర్వాహకులు అన్నారు.
మొదట గోమాతకు పూజలు చేసి, అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముని... సర్వోదయ తెలంగాణ” – ఉచిత విద్య, వైద్యం, 4 లక్షల ఉద్యోగాల హామీ!
హైదరాబాద్ మే 02 (ప్రజా మంటలు):
తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా “తెలంగాణ రక్షణ సేన”ను ప్రారంభించిన కల్వకుంట్ల కవిత, సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై పోరాటం చేస్తామని మీట్ ది ప్రెస్ లో
తెలిపారు.
“సర్వోదయ తెలంగాణ కోసం పాంచజన్యం మార్గంలో... ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవగ్రహ పూజా అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో... కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం
కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్... సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.రఘురాం జగిత్యాలకు చెందిన బండి... ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత... ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)
పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థలు మరోసారి తమ ప్రతిభను చాటుకుంటూ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించాయి.
ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి లో 591, 590 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా... పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి ఏప్రిల్ 28 (ప్రజా మంటలు)
రానున్న 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై టెంపుల్ మాస్టర్... 