సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక
* డీఎంఈ డా.నరేంద్ర కుమార్ వార్నింగ్
* గాంధీ ఆసుపత్రి తనిఖీ
సికింద్రాబాద్ మార్చి 17 (ప్రజామంటలు) :
గాంధీ ఆసుపత్రి,మెడికల్ కాలేజీలో ప్రతి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు, హెచ్ఓడీ లందరూ ఓపీ, ఐపీ టైమింగ్స్ పాటించాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్( డీఎంఈ) డా.నరేంద్రకుమార్ వార్నింగ్ ఇచ్చారు.
సోమవారం ఆయన గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు ప్రతిరోజు రెగ్యులర్ గా వార్డుల్లో రౌండ్స్ వేయాలని, ఓపీ, ఐపీ సేవల సిబ్బంది అటెండెన్స్ ను పరిశీలించాలని ఆదేశించారు. ఈసందర్బంగా ఆసుపత్రి లోని వార్డులు, ఓపీ, ఆసుపత్రి ఆవరణ అంతా స్థానిక వైద్యాధికారులతో కలసి కలియతిరిగారు. శానిటేషన్ పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకూదన్నారు. వేసవి తీవ్రత పెరిగినందున ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం నిరంతరాయంగా ఉంచాలని, ఆవరణ శుభ్రంగా ఉండాలన్నారు. ఆసుపత్రి, మెడికల్ కాలేజీల్లో సిబ్బంది ఎవరు కూడ ముందస్తు అనుమతి లేకుండా లీవులు తీసుకోవద్దన్నారు. ఈసందర్బంగా ఫ్యాకల్టీ మెంబర్స్, నర్సింగ్, శానిటేషన్ స్టాఫ్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారిని అడిగి, ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీల్లో రెగ్యులర్ తనిఖీలు:
రాష్ర్టంలోని 47 ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో తాను తరచుగా సందర్శిస్తూ, అక్కడి సౌకర్యాల మెరుగు కోసం ప్రయత్నిస్తానని డీఎంఈ డా.నరేంద్రకుమార్ అన్నారు. గాంధీ ఆసుప్రతి,మెడికల్ కాలేజీల తనిఖీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల హెల్త్ మినిస్టర్ గాంధీ సందర్శించిన తర్వాత తాను కూడ గాంధీని విజిట్ చేశానని, కొన్ని లోటుపాట్లను సవరించామన్నారు. ఆసుపత్రి లోని డ్రైనేజీ వ్యవస్థ, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్,పారిశుద్ద్యం వ్యవస్థ ప్రక్షాళన పనులు కొనసాగుతున్నాయని, దాంతో పేషంట్లు, వారి సహాయకులకు కొంత అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఓపీ విభాగంలోని అన్ని డిపార్ట్ మెంట్ గదులకు నెంబర్లు వేయాలని, బోర్డులు సృష్టంగా ఏర్పాటు చేయాలని, కారిడర్, గదుల్లో లైటింగ్ ను ప్రకాశవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పాలన యంత్రాగాన్ని ఆదేశించారు. పత్రికలు,ఛానళ్ళల్లో వస్తున్న గాంధీ వార్తలను పరిగణలోనికి తీసుకొని, చర్యలు చేపడతామని తెలిపారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ఆర్ఎంవో డా.కళ్యాణచక్రవర్తి, ఎంపీహెచ్ఈవో వేణుగోపాల్ గౌడ్, టీజీఎంఎస్ఐడీసీ అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
