ద్వి చక్ర వాహనాల  దొంగల ముఠా అరెస్ట్ 5 ద్వి చక్ర వాహనాలు   మరియు 1 కారు స్వాదీనం

On
ద్వి చక్ర వాహనాల  దొంగల ముఠా అరెస్ట్ 5 ద్వి చక్ర వాహనాలు   మరియు 1 కారు స్వాదీనం

జగిత్యాల ఫిబ్రవరి 9(   ప్రజా మంటలు     )     

ఈ సంవత్సరం జనవరి నెలలో తిప్పన్నపేట గ్రామంలో తన ఇంటి ముందు పార్కు చేసిన టూ వీలర్ బైక్ ని ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించినారు అని పిర్యాదిదారుడు భారతపు పెద్ది రాజం s/o రాజం, r/o తిప్పన్నపేట గ్రామం అనునతడి ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ SI సదాకర్   కేసు నమోదు చేసుకొని, జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీం లో ఏర్పాటు చేయగా, జగిత్యాల రూరల్ ఎస్సై సదాకర్ టీం ఆదివారం 09-02-2025  ఉదయం 05:30 గంటలకు తిప్పన్నపేట గ్రామ శివారులోని హుందాయి క్రేటా కారులో వస్తున్న ఐదుగురు అనుమానిత వ్యక్తులను గుర్తించి వారిని విచారించగా,
వారు,
1. జక్కుల గోపాల్ తండ్రి పేరు రాజన్న, వయస్సు 36 సంవత్సరాలు, కులము యాదవ,వృత్తి:డ్రైవర్
2.సింగం రాజు తండ్రి పేరు నారాయణ 37 సంవత్సరాలు కులము:గౌడ్, వృత్తి:డ్రైవర్
3.నేరెళ్ల నరేష్ తండ్రి పేరు వెంకటి గౌడ్ వయస్సు 35 సంవత్సరాలు కులము గౌడ, వృత్తి:డ్రైవర్
4.సంపతి కుమారస్వామి తండ్రి పేరు పోచయ్య, 27 సంవత్సరాలు, కులము యాదవ, వృత్తి:వ్యవసాయం  r/o కలమడుగు గ్రామం, జన్నారం మండలం, జిల్లా మంచిర్యాల మరియు 
5.బుర్ర రాజేందర్ తండ్రి పేరు సత్తయ్య గౌడ్, 27 సంవత్సరాలు, వృత్తి:డ్రైవర్ r/o తిర్యాని గ్రామం మరియు మండలం, కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా 
అనువారలను విచారించగా, వారంతా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళలో కలమడుగు నుంచి కారులో బయలుదేరి వివిధ గ్రామాలలో ఇంటి ముందు పార్కు చేసిన బైకులను దొంగలిస్తున్నామని, అట్టి దొంగిలించిన బైక్లను వారి స్వగృహంలో దాచి పెట్టినామని నేరం ఒప్పుకున్నారు. ఈ విధంగా వారు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో డిసెంబర్ నెలలో ఒక బైక్ ని దొంగిలించామని, అంతకు ముందు దండేపల్లి లోని వెలగనూర్  గ్రామం లో ఒక బైక్ ని, జనవరి నెలలో చిన్న బెల్లాల్ గ్రామం లోని ఇంటి ముందు పార్క్ చేసిన ఒక బైక్ ని, జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామంలోని ఒక బైక్ ని మరియు దండేపల్లి లోని ద్వారక గ్రామంలో ఇంటి ముందు పార్కు చేసిన బైక్ లను దొంగతనం చేశామని నేరం ఒప్పుకున్నారు. వాటిని దాచిన అట్టి ప్రదేశాన్ని చూపెట్టినారు. 
నిందుతుల నుండి స్వాదినం చేసుకున్న వాటి వివరాలు
1. రికవరీ చేసిన బైక్లు-5
2. క్రేటా కార్-1
3.మొబైల్ ఫోన్-5
ఈ రోజు వారిని జ్యూడిషల్ రిమాండ్ గురించి మేజిస్ట్రేట్ వద్దకు పంపుతున్నామన్నారు. 


ఇట్టి నిందితులను చాకచక్యంగా పట్టుకొని టు వీలర్ బైక్లను రికవరీ చేసిన జగిత్యాల రూరల్ CI కృష్ణా రెడ్డి, ఎస్సై సధాకర్ మరియు  పార్టీ కానిస్టేబుల్ శ్రీనివాస్,గంగాధర్,రాహుల్, ఉమర్, మోహన్ లను జగిత్యాల ఎస్పి అశోక్ కుమార్ అభినందించారు.
డిఎస్పి,జగిత్యాల

Tags

More News...

Local News 

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు      

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు           -సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో జాతీయ వైద్య దినోత్సవం వేడుకలు           జగిత్యాల జులై 01 (ప్రజా మంటలు): వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదేనని,ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలంధిస్తున్నామని మాతా శిశు కేంద్ర జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుమన్ మోహన్ రావు  అన్నారు. మంగళవారం  జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్ర సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో...
Read More...
State News 

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో  పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో  పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత పటాన్చెరువు జూలై 01 (ప్రజా మంటలు): సిగాచి పరిశ్రమలో గాయపడి పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. బాధితుల తో, అక్కడి డాక్టర్లతో ఆమె మాట్లాడరు. ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. పరిశ్రమలలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలను...
Read More...
Local News 

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్ 

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్  సికింద్రాబాద్  జూలై01 (ప్రజామంటలు): :  మోకాలి శస్త్ర చికిత్స చేయించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ పార్లమెంటు సభ్యులు  రఘునందన్ రావు ను బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు పరామర్శించారు. మంగళవారం సాయంత్రం  ఆయన పలువురు బీజేపీ నాయకులతో కలిసి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి వెళ్ల  ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.  ఆయన...
Read More...
Local News 

కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు సికింద్రాబాద్ జూలై 01 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ఆషాడ బోనాల వేడుకలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం ఉదయం అమ్మవారి ఆలయం నుంచి మేళా తాళాలు, పోతరాజుల విన్యాసాలతో అమ్మవారి ఘటము కళాసిగూడ ప్రాంతానికి తీసుకువెళ్ళారు. అక్కడ స్థానిక మహిళలు అమ్మవారికి ఓడిబియ్యం, కుంకుమ,పసుపులు...
Read More...
Local News  State News 

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్ సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు) : పాశమైలారం ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ - సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం చిదంబరం షణ్ముఖానాథన్, గుంతక ధనలక్ష్మి, అమిత్ రాజ్ సిన్హా, సర్వేశ్వర్ రెడ్డి, వివేక్ కుమార్, ఓరుగంటి సుబ్బిరామి రెడ్డి, రవీంద్ర ప్రసాద్ సిన్హా, బిందు వినోదాన్...
Read More...
Local News 

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్.. సికింద్రాబాద్, జూలై 01 ( ప్రజామంటలు) : డాక్టర్స్ డే సందర్భంగా భారత రత్న డాక్టర్ బీ.సీ రాయ్ ని  స్మరిస్తూ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి,ఇతర వైద్యులు ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ... వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, వైద్యులు గా ఉండడం అత్యంత అదృష్టం గా...
Read More...
State News 

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్ సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు)::పవర్ గ్రిడ్ సదరన్ రీజన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. దోమన్ యాదవ్ పాట్నా యూనివర్శిటీ నుంచి ఎలక్ర్టానిక్ ఆండ్ కమ్యూనికేషన్స్ గ్రాడ్యుయేట్, ఎండీఐ గుర్గావ్ నుంచి బిజినెస్ మేనేజ్ మెంట్ లో పీజీ డిప్లోమా పొందారు....
Read More...
Local News 

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో  ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, జూలై 01 (ప్రజామంటలు) : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంగళవారం సికింద్రాబాద్ లోని చుట్టాల బస్తీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని,ఆపదలో ఉన్న వారి...
Read More...
Local News 

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత జగిత్యాల జులై 1( ప్రజా మంటలు) శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత అన్నారు   జగిత్యాల పట్టణంలో మంగళవారం జరిగిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో నాయకులతో కలిసి పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
Read More...
Local News 

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం    హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం    హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు  సికింద్రాబాద్, జూలై01 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణోత్సవం ఈ ఏడాది ఘనంగా నిర్వహించామని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ తెలిపారు. అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరుపున...
Read More...
Local News 

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...! మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు గొల్లపల్లి (రాయికల్) జులై 01 (ప్రజా మంటలు): తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారని మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు అన్నారు.మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శశికాంత్ రెడ్డి,డాక్టర్ సురేందర్,డాక్టర్...
Read More...
Local News 

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా ర్ జగిత్యాల జూలై 1 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలో ఇస్కాన్ మెట్పల్లి వారి ఆద్వర్యం లో జగన్నాధ రథ యాత్ర ప్రారంభం సందర్భంగా జగిత్యాల రోటరీ క్లబ్ వద్ద  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    మాట్లాడుతూ సామాజిక సమగ్రతను పెంపొందించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఈ...
Read More...