జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు

On
జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు

జగిత్యాల్ అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల్ పెట్టిన పేరు

 
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పెద్దాయన.. ఇక చాలని అనుకుంటున్నారా?

గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):

ఎన్నికలు ఏవైనా తాను సంసిద్ధమంటూ రంగంలోకి దిగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఈసారి మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి ఎందుకు బరిలోకి దిగడం లేదు?
పోటీ చేయడం వద్దనుకున్నారా? జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలు వేసుకోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ఇంకా అలక వీడలేదా?.. లేకపోతే ఈ ఎన్నికకు దూరంగా ఉంటే సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అధిష్టానం నుంచి హామీ లభించిందా? ఇక చాల్లే అనుకుని గౌరవప్రదంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని అనుకుంటున్నారా..? అసలు జీవన్‌రెడ్డి రాజకీయ భవితవ్యయంపై ఇంత చర్చ? ఇన్ని సందేహాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి ?సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి.. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చాక అసలు సిసలు కాంగ్రెస్ వాదిగా ఫోకస్ అయ్యారు జీవన్‌రెడ్డి.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పట్ల అంత కమిట్‌మెంట్‌తో ఉన్న వ్యవహరించిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఇమడలేకపోతున్నట్లు కనిపిస్తున్నారు.

ఇప్పటికిప్పుడు పార్టీ నుంచి తనకు తాను అర్ధాంతరంగా బయటకొస్తే బాగుండదు కాబట్టి కొనసాగుతున్నారంటున్నారు. పార్టీలో సీనియర్‌మోస్ట్ అయిన ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ దానికి తగ్గ ప్రాధాన్యత లభించడం లేదని భావిస్తున్నారంట.
2019, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు.

తర్వాత సంజీవ్‌కుమార్ కూడా కాంగ్రెస్‌లో చేరిపోవడంతో మొదలైన లొల్లితో.. పెద్దాయన జీవన్ రెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయింది తయారైంది. సంజీవ్ చేరిక సమయంలోనే జీవన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే రాష్ట్ర పార్టీ పెద్దలతో పాటు హైకమాండ్ బుజ్జగింపులతో సైలెంట్ అయ్యారు. అయితే ఆయనలో మాత్రం ఆ అసంతృప్తి కొనసాగుతూనే ఉందంట.ఆ క్రమంలో తన ప్రత్యర్ధినే పార్టీలో చేర్చుకోవడంతో నొచ్చుకున్న జీవన్‌రెడ్డి .. రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నారో? , లేకపోతే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా గెలిచన తనకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఏ పదవీ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారో? కాని పొలిటికల్‌గా మనుపటి దూకుడు ప్రదర్శించడం లేదు.

సంజీవ్ ఎపిసోడ్‌తో పార్టీ అధిష్ఠానంతో కూడా గ్యాప్ ఏర్పడినట్లు కనిపిస్తుండటంతో.. మార్చి నెలాఖరుకి తన ఎమ్మెల్సీ పదవీకాలం ముగిశాక ఏకంగా రాజకీయాలకే స్వస్తి పలికే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు అలాంటిదేమీ లేదని.. జీవన్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని అధిష్టానం నుంచి హామీ లభించిదన్న టాక్ కూడా వినిపిస్తుంది.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో తాను ఇంతకాలం నమ్ముకున్న పార్టీలో తనకు సముచిత స్థానం దక్కడం లేదనే బాధ జీవన్ రెడ్డిలో ఉందని ఆయన అనుంగ అనుచరులు అంటున్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత జరిగిన పరిణామాలు.. జగిత్యాల ఎపిసోడ్ ఆయనలో ఆ బాధను పలుమార్లు బయటపెట్టింది. పదేళ్లు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా బీఆర్ఎస్‌పై పోరాటం చేసిన తనకు.. పదేళ్ల తర్వాత అధికారం దక్కాక పెద్దగా సముచిత స్థానం దక్కకపోవడం జీవన్ రెడ్డిని తీవ్రంగా కలిచి వేస్తుందంట.ఈ పరిణామాలే జీవన్ రెడ్డి ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసేందుకు కారణమైనట్టు తెలుస్తోంది. మరోవైపు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక.. ఆయన సుముఖంగా లేకున్నా నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చి ఓటమి మూట గట్టుకున్నారు. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ కూడా తీసుకుని గెలిస్తే ఓకే.. లేదంటే, ఇక తన పనైపోనట్టే అనేది నిరూపించేందుకే ఎమ్మెల్సీ టిక్కెట్ ను ఆఫర్ చేసి ఉంటారని జీవన్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు అనుమాన పడుతున్నారంట.ఇలాంటి సందేహాలు, అనుమానాలతో పాటు.. పార్టీతో పెరిగిన గ్యాప్, తనకు అంతగా ప్రాధాన్యత దక్కకపోవడం వంటివన్నీ జీవన్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టిక్కెట్ నిరాకరించేందుకు కారణమయ్యాయంట.

అయితే, ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, మంత్రులు జీవన్ రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. దాంతో ఆయన్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమిస్తారన్న ప్రచారం మొదలైంది. మరి పెద్దాయన పొలిటికల్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags
Join WhatsApp

More News...

Local News 

మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు – దావ వసంత సురేష్

మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు – దావ వసంత సురేష్ జగిత్యాల, మార్చ్ 18 (ప్రజా మంటలు): పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.ఈ సందర్భంగా ప్రత్యేక...
Read More...
State News 

వెలుగుమట్ల బాధితులకు అండగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ – తొలి రోజే సమస్యల పరిష్కారానికి చర్యలు

వెలుగుమట్ల బాధితులకు అండగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ – తొలి రోజే సమస్యల పరిష్కారానికి చర్యలు వెలుగుమట్ల, ఖమ్మం (మార్చ్ 18 – ప్రజా మంటలు): ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వారికి కొండంత అండగా మారింది. తొలి రోజే బాధితుల సమస్యలు పరిష్కారమయ్యేలా కమిటీ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్‌లో...
Read More...
Local News 

విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి

విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి    జగిత్యాల మార్చి 18 (ప్రజా మంటలు)  విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్. ఇట్టి కార్యక్రమములో సంఘ సభ్యులు చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు బొల్లరపు గిరిధర్ స్వప్న, దయాల...
Read More...
State News 

జగిత్యాలలో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రం.. సంజయ్ కుమార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు

జగిత్యాలలో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రం.. సంజయ్ కుమార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు కాంగ్రెస్ వీడే పరిస్థితి ఎందుకు వచ్చింది? జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్జగిత్యాల రాజకీయాలు హీట్.. ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఆగ్రహంకాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిందెవరు? జీవన్ రెడ్డి బహిరంగ విమర్శలుజగిత్యాల మార్చ్ 27 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి...
Read More...
Local News 

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక.

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక. జగిత్యాల 16 మార్చి (ప్రజా మంటలు) :  ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణి  ఎంపిక కావడము జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ,...
Read More...
Local News 

ఇక కాంగ్రెస్ కు రామ్ రామ్  కారు ఎక్కనున్న  మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఇక కాంగ్రెస్ కు రామ్ రామ్  కారు ఎక్కనున్న  మాజీ మంత్రి జీవన్ రెడ్డి   ?జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పనున్నట్లు ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎన్నో ఉత్తాన పతనాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి...
Read More...
Local News 

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తక ఆవిష్కరణ

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తక ఆవిష్కరణ జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని  9వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ వానరాశి తిరుమలయ్య సహకారంతో జరిగిన ముందస్తు ఉగాది వేడుకల కార్యక్రమంలో భాగంగా సామాజిక సమరసత వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో" సంచార జాతులు-సమగ్ర సర్వే"పుస్తకావిష్కరణ చేయటం జరిగింది. సామాజిక సమరసత కార్యకర్తలు తెలంగాణ అన్ని ప్రాంతాల్లోని దాదాపు...
Read More...
Comment  State News 

జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి

జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌/ బీజేపీ లోకి వెళితే పరిస్థితి? రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు): జగిత్యాల రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయన ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ,...
Read More...
Local News 

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జగిత్యాల పట్టణంలోని వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో  వినతి పత్రం...
Read More...
Crime  State News 

కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి దాడి – రెండో రోజు మరో ఆవు బలి, భయాందోళనలో గ్రామస్తులు

కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి దాడి – రెండో రోజు మరో ఆవు బలి, భయాందోళనలో గ్రామస్తులు కొడిమ్యాల, మార్చి 16 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండాలో మళ్లీ పెద్దపులి దాడి జరగడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుసగా రెండో రోజు పులి దాడి చేసి మరో ఆవును చంపింది.గ్రామానికి చెందిన రైతు తేజావాద్ మోతీలాల్‌కు చెందిన ఆవుపై సోమవారం పెద్దపులి దాడి చేసి చంపింది....
Read More...
Local News 

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక జగిత్యాల మార్చి 16(ప్రజా మంటలు)ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని  మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణిఎంపిక కావడము జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల *ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ, సిస్టర్స్ రెజిన,లిల్లీ,రాణి, వ్యాయామ...
Read More...
State News 

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కవిత ఆగ్రహం – డిఫమేషన్ కేసు వేస్తా, మూసీ ప్రక్షాళనపై తీవ్ర విమర్శలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కవిత ఆగ్రహం – డిఫమేషన్ కేసు వేస్తా, మూసీ ప్రక్షాళనపై తీవ్ర విమర్శలు .“హైడ్రాపై కవిత తీవ్ర ఆరోపణలు: పేదల ఇళ్లు కూల్చి పెద్దలను కాపాడుతున్నారా?”“మూసీ ప్రక్షాళనలో 1400 కోట్లు ఎలా పెరిగాయి? ప్రభుత్వం సమాధానం చెప్పాలి: కవిత”“హైడ్రా వీడియోలు వెంటనే తొలగించాలి.. లేదంటే కోర్టు!” – రంగనాథ్‌కు కవిత హెచ్చరిక“మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజాధనం దోపిడీ జరుగుతోంది: కవిత సంచలన వ్యాఖ్యలు” వెలుగుమట్ల...
Read More...