రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు - అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత
రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టు
- అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఎమ్మెల్సీ కవిత
వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష గారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
మలేషియా వేదికగా జరిగిన U19WorldCup ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించి ఇండియా విశ్వ విజేతగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన త్రిష ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచారు. దూకుడుగా ఆడి చివరి వరకు నిలబడి సత్తా చాటారు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. 1.jpg)
గొంగడి త్రిష లాంటి క్రీడాకారులు Telangana రాష్ట్రానికి గర్వ కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మరింతగా రాణించి భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన క్రీడా నైపుణ్యమున్న యువతీ యువకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్సీ కవిత అభినందనలు
T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుని దానిని నిలబెట్టుకున్నందుకు అండర్-19 మహిళా క్రికెట్ జట్టుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు.u-(1).jpg)
ఈరోజు తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను గెలుచుకున్నందుకు తెలంగాణకు చెందిన త్రిష గొంగడికి ప్రత్యేక ప్రశంసలు. భారతదేశం మరియు తెలంగాణకు గర్వకారణమైన క్షణం మని, ఛాంపియన్స్, మరోసారి ఇంటికి తీసుకువచ్చినందుకు ఇండియా టీం కు ఎమ్మెల్సి కవిత అభినందనలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రావి నారాయణ రెడ్డికి తెలంగాణలో సముచిత స్థానం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
భూమి–భుక్తి–వెట్టిచాకిరి విముక్తి పోరాట వీరుడికి ప్రభుత్వ గౌరవం
హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచితమైన స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రావి నారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశాల్లో... హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం
హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):
ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్... లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం
గొల్లపల్లి, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో సోమవారం లయన్స్ క్లబ్ గొల్లపల్లి, లీడ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోటివేటివ్ స్పీకర్ కెప్టెన్ డా. లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డి విద్యార్థుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపారు.... అంగరంగ వైభవంగా బుగ్గారం పోచమ్మల జాతర – రథోత్సవం
బుగ్గారం / గొల్లపల్లి ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం శ్రీ ముత్యాల పోచమ్మ – నల్ల పోచమ్మల జాతర, రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ జిల్లాలతో పాటు అంతర్‌రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తజనం తండోప తండాలుగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఆలయ కమిటీ చైర్మన్... మొదటిరోజు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం
జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)జిల్లాలో సోమవారం 17 (జనరల్ మరియు ఒకేషనల్) పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో భాగంగా ఈరోజు జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు జరిగిన ప్రాక్టికల్ పరీక్షలలో ఉదయం 1409 మంది విద్యార్థులకు గాను 1312 మంది విద్యార్థులు హాజరైనారు.
జనరల్ విభాగంలో... గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 7గురు అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్... పెట్టుబడుల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది
పెట్టుబడులపై Fact Check
(వివరాలు కింది టేబుల్ లో)
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం
ఫోన్ ట్యాపింగ్ కేసు – పారదర్శక విచారణ జరగాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న వేల కోట్ల పెట్టుబడులు కట్టుకథలేనని తెలంగాణ జాగృతి... అభ్యర్థి మంచోడా చెడ్డోడా కాదు – ప్రజలకు ఉపయోగపడేవాడే ముఖ్యం : కవిత
మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది
హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి మంచోడైనా చెడ్డోడైనా కేసీఆర్ ను చూసి ఓటు వేయాలని కేటీఆర్ కోరుతున్నారని కవిత విమర్శించారు.ఇది బీఆర్ఎస్‌లోని రాజరిక, నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు.
ఈరోజు జాగృతి ఆఫీస్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ, కులం, మతం,... అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-XII విజయవంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా లో 37 మoది బాల కార్మికులకు విముక్తి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 1 ప్రజా (మంటలు)బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం... 44 వ వార్డులో బిజెపి అభ్యర్థికి మద్దతుగా డా. భోగ శ్రావణీ ప్రచారం
జగిత్యాల ఫిబ్రవరి 1 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికలలో భాగంగ జగిత్యాల పట్టణంలోని 44వ వార్డ్ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆర్మూర్ పద్మ-శ్రీకాంత్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా .బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, బీజేవైఎం... కంటోన్మెంట్ బోర్డు విలీన పోరాటానికి JAC సన్నాహక సమావేశం
సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):
కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌తో ఆదివారం బాలంరాయిలోని లీ ప్యాలెస్‌లో జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నియోజకవర్గంలోని కాలనీ అసోసియేషన్ సభ్యులు, బస్తీల... స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ లో పాల కావడి ఉత్సవాలు l ll
సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని శ్రీ స్కందగిరి సుబ్రమణ్య స్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం నుంచి పాల కావడి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాదిమంది భక్తులు పాలకావడిని భుజాన ధరించి ఆలయం చుట్టూ గిరి ప్రదర్శన చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం... 