పిల్లల భద్రతే  మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ 

On

20250120_160416

జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు   )
పిల్లల భద్రతే మాకు ముఖ్యం రోడ్డు ప్రమాద నివారణ లో అందరూ భాగస్వాములు కావాలి 
స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై  కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ  అశోక్ అన్నారు. విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్  ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి చే జారిచేయబడిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్  ఉండాలని ఎస్పీ అన్నారు.
  
రోడ్డు భద్రతా మాసోత్సవాల లో బాగంగా  జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ వాహనాల ఫిట్‌నెస్,స్కూల్ బస్సులకు ఎలాంటి ప్రమాదాలకు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ పై  అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్ పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ... జిల్లా లో  రోడ్డు ప్రమాదల నివారనే లక్ష్యంగా స్కూల్స్ బస్ డ్రైవర్స్ కి  ట్రాఫిక్ మరియు రోడ్ సేఫ్టీ పై  అవగాహన ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నరు. చాలా వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలలో అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. స్కూల్ బస్సుల్లో ప్రయాణించే వారిలో చిన్న పిల్లలే ఉంటారు కాబట్టి వారి పట్ల చాలా జాగ్రత్త వహించాలని  సూచించారు. స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తాం అన్నారు. పిల్లలని స్కూల్ కి తీసుకొని వచ్చేటప్పుడు, ఇంటికి తీసుకొని వెళ్లే క్రమంలో బస్సు హెల్పర్ వెనుక ముందు చూసుకొన్నాకనే వారిని దించాలి, పిల్లలు రోడ్డు దాటవలసివస్తే హెల్పర్ తప్పక దాటించాలని సూచించారు.  బస్ కి సంబంధించి అన్ని వాహన పత్రాలు  కల్గివుండాలని, బస్సు సరైన కండిషన్ లో ఉందో లేదో ముందే జాగ్రత్తపడాలని, బస్సు బ్రేక్, లైట్స్, ఇండికేటర్స్, పార్కింగ్ లైట్స్ మరియు వైపర్స్ పనిచేస్తున్నాయో లేదో చెక్ చూసుకోవాలని సూచించారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవ్ చేయకూడదని సూచించారు. ఎన్నో కుటుంబాలు బస్సు డ్రైవర్ల మీద చాలా నమ్మకంతో తమతమ పిల్లలని స్కూల్స్ కి బస్సుల్లో పంపిస్తున్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ఈ సంధర్బంగా తెలియజేశారు. ఎవరైనా ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించక పోతే వారిపై చట్టపరమైన చర్యలు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా లో  నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై పోలీస్ , ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు.  

ఈ సందర్భంగా ఎస్పీ  పలు స్కూల్ వాహనాల యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ప్రమాణాలు పాటిస్తున్నారు లేదా అని  స్వయంగా పరిశీలించి పాటించని వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 
  
ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రఘు చంధర్, DTO  శ్రీనివాస్, RI  వేణు, ఎస్సైలు సుధాకర్, మల్లేశం, గీత, రవాణా శాఖ అధికారులు, స్కూల్ వ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ రావు,పోలీస్ సిబ్బంది , స్కూల్ బస్సు డ్రైవర్లు  పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  Spiritual  

స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ లో పాల కావడి ఉత్సవాలు l ll

స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ లో పాల కావడి ఉత్సవాలు l ll సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని శ్రీ స్కందగిరి సుబ్రమణ్య స్వామి దేవాలయంలో ఆదివారం  ఉదయం నుంచి పాల కావడి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాదిమంది భక్తులు పాలకావడిని భుజాన ధరించి ఆలయం చుట్టూ గిరి ప్రదర్శన చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం...
Read More...

బ్రాహ్మణ సమగ్ర సర్వే దరఖాస్తు పత్రంలు బాధ్యులకు అందజేత 

బ్రాహ్మణ సమగ్ర సర్వే దరఖాస్తు పత్రంలు బాధ్యులకు అందజేత  జగిత్యాల ఫిబ్రవరి 1 (ప్రజా మంటలు) ఉమ్మడి కరీంనగర్ జిల్లా (బాస్ )బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ జనగామ నాగరాజు జగిత్యాల జిల్లా కేంద్రానికి ఆదివారం చేరుకొని అఖిల బ్రాహ్మణ  అర్చక సేవా సంఘము అధ్యక్షులు సిరిసిల్ల పార్థసారథి శర్మను జిల్లా కేంద్రంలోని శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయం లో కలిసి బ్రాహ్మణ...
Read More...
National  Comment  International  

ఎప్స్టీన్ ఫైల్ వివాదం: నిజాల కంటే రాజకీయ ఆయుధంగా మారుతున్న వైనం

ఎప్స్టీన్ ఫైల్ వివాదం: నిజాల కంటే రాజకీయ ఆయుధంగా మారుతున్న వైనం — రాజకీయ విశ్లేషణ ఎప్స్టీన్ ఫైల్‌లలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావన రావడం దేశ రాజకీయాల్లో మరో కొత్త వివాదానికి తెరలేపింది. న్యాయపరంగా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, ఈ అంశం ఇప్పుడు ప్రతిపక్షాల చేతుల్లో ఒక రాజకీయ ఆయుధంగా మారుతున్న తీరే అసలు చర్చకు కేంద్రబిందువుగా మారింది. ఈ వ్యవహారంలో అసలు ప్రశ్న...
Read More...
National 

2026-27 బడ్జెట్ : స్టాక్ మార్కెట్ ప్రతిస్పందన

2026-27 బడ్జెట్ : స్టాక్ మార్కెట్ ప్రతిస్పందన న్యూఢిల్లీ ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు): నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్ 2026-27 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 75 నిమిషాల తన ప్రసంగం, సామాన్యులను, స్టాక్ మార్కెట్లను ఆకట్టుకోలేక పోయింది. దేశ ఆర్థిక వృద్ధి, మౌలిక వసతులు, ఉద్యోగాలు, పన్ను సంస్కరణలపై ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించింది. Union Budget 2026-27...
Read More...
Local News  Spiritual  

పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు తిరుగు ప్రయాణం

పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు తిరుగు ప్రయాణం లక్షలాది భక్తులతో మహాజాతర విజయవంతం ఎల్కతుర్తి జనవరి 31 (ప్రజా మంటలు): ఎల్కతుర్తి మండల కేంద్రంలోని దామేర  బీమదేవరపల్లి  మండలంలో   ముల్కనూర్ ప్రాంతం మరోసారి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. జనవరి 28. 29. 30. ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి కూడా లక్షలాది భక్తులు   తండోప  తండాలుగా  తరలివచ్చారు. గ్రామాల  నలుమూలల నుంచి   మాత్రమే...
Read More...
Local News  Crime 

పొలంలో నాటు వేస్తూ బీహార్ వలస కార్మికుడు మృతి

పొలంలో నాటు వేస్తూ బీహార్ వలస కార్మికుడు మృతి ఎల్కతుర్తి జనవరి 31 (ప్రజా మంటలు) ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ శివారులో విషాదం చోటుచేసుకుంది. పొలంలో నాటు వేస్తూ బీహార్ కు చెందిన ఓ వలస కార్మికుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఉపాధి కోసం తెలంగాణకు వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సదరు వ్యక్తి, శనివారం పనిలో ఉండగానే ప్రాణాలు విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు....
Read More...

గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి

గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ములుగు, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు): గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్యకు మంత్రి సీతక్క నివాళులు అర్పిస్తూ, ఆమె కుటుంబ...
Read More...

ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు: 15 వార్డుల అభ్యర్థుల పేర్ల ప్రకటన

ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు: 15 వార్డుల అభ్యర్థుల పేర్ల ప్రకటన       ధర్మపురి, జనవరి 31 (ప్రజా మంటలు):ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 15 వార్డులకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డుకు ప్రత్యేకంగా ఇంచార్జీలను కూడా నియమించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ...
Read More...

రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శాంతియుత నిరసనలు: కేటీఆర్ పిలుపు

రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శాంతియుత నిరసనలు: కేటీఆర్ పిలుపు హైదరాబాద్, జనవరి 31 (ప్రజా మంటలు): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ, రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ నిరసనలలో భాగంగా రాష్ట్రంలోని 12 వేలకుపైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించనున్నారు. అలాగే...
Read More...
Local News 

PRTU–TS ఆధ్వర్యంలో టెట్ రద్దు కోసం చలో ఢిల్లీ -  పోస్టర్ ఆవిష్కరణ  

PRTU–TS ఆధ్వర్యంలో టెట్ రద్దు కోసం చలో ఢిల్లీ -  పోస్టర్ ఆవిష్కరణ   జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు): ఎఐజాక్ట్ పిలుపు మేరకు, పీఆర్‌టీయూ–టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో టెట్ రద్దు మరియు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్‌తో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న “చలో ఢిల్లీ” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షుడు బోయినిపెల్లి...
Read More...
Local News 

పౌరహక్కుల దినోత్సవానికి పూర్తి స్థాయి అధికారులు గైర్హాజరు

పౌరహక్కుల దినోత్సవానికి పూర్తి స్థాయి అధికారులు గైర్హాజరు గొల్లపల్లి, జనవరి 31 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట్ గ్రామంలో శనివారం నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవం కార్యక్రమానికి మండల స్థాయి పూర్తి అధికారుల హాజరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు–బాధ్యతలపై అవగాహన కల్పించాల్సిన కీలక అధికారులు హాజరు కాకపోవడంపై గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పౌరహక్కుల దినోత్సవం వంటి...
Read More...
Local News 

కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు నిరసనగా ఆందోళనలకు పిలుపు

కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు నిరసనగా ఆందోళనలకు పిలుపు జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు): మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారిని సిట్ విచారణకు పిలవడం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజకీయ కక్షసాధింపు చర్యేనని జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ...
Read More...