#Draft: Add Your Title
ధర్మపురిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
(రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494)
ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి లోని శ్రీక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో, శుక్ర వారం వైకుంఠ (ముక్కోటి ఏకాదశి) వేడుకలు కన్నుల పండువగా, పైభవోపేతంగా జరిగాయి. ఉదయాత్ పూర్వం వేద మంత్రోచ్ఛారణల మధ్య, అర్చకులు పవిత్ర జలాలను కొనితెచ్చి లక్ష్మీ సమేత శ్రీ యోగానంద,శ్రీ ఉగ్ర నారసింహ, శ్రీ వేంకటేశ్వర స్వాముల మూల విరాట్టులను సాంప్రదాయ విధి విధాన రీతిలో, మహాక్షీరా భిషేకాది ప్రత్యేక పర్వదిన పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్థానిక ఇలవేల్పులను దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీపికలలో, వివిధ పుష్ప మాలికలతో, శోభాయమానంగా తీర్చి దిద్దిన రంగవల్లులతో, ఆకర్షణీయంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై అసీసుల గావించారు.
ధనుర్మాస ప్రత్యేకతలో సప్త హారతులు, షోడశోపచార పూజలు, వేద, శాస్త్ర పురాణ, సంగీత, నృత్య, వాద్యాది అవధారయాలతో ఆర్చనలు, భక్తుల గోత్ర నామాదులతో పూజలు నిర్వహించగా, భక్తజనులు భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచి తరిం చారు. అనంతరం జయ జయ ధ్వనాల మధ్య ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సమక్షంలో, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసా చార్య వైకుంఠ (ఉత్తర) ద్వారానికి పూజ చేసి, నారికేళములను సమర్పించి, వైకుంఠ ద్వారం తెరవగా, ద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు పరమానంద భరితులై తనివి తీరా దర్శనం చేసుకున్నారు.
దేవస్థానం ఈ ఓ శ్రీనివాస్ పర్య వేక్షణలో, దేవస్థాన అర్చకుల బృందం ఆధ్వర్యంలో, సిబ్బంది సహకారంతో, బొజ్జా సంపత్ కుమార్, రాజ గోపాల్, పాలేపు ప్రవీణ్ శర్మ , క్షేత్ర పండితుల మార్గదర్శకత్వంలో ఘనంగా కార్య క్రమాలను నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ మధుసూదన్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ రామయ్య, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ నర్సింలు
తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. అలాగే బచ్చు రాము గుప్తా సహకారంతో
నూతర సంవత్సర క్యాలండర్ ను విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితరులు దైవ దర్శనాలు చేసుకున్నారు.
భారీ ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక శ్రద్ధతో, శ్రమ కోర్చి ఈ ఏడు భారీ ఏర్పాట్లు గావించారు. ప్రధాన రహదారి నుండి దేవస్థానం లోపలి వరకూ క్యూలైన్లు ఏర్పరిచారు. దేవస్థాన ప్రాంగణంలో విద్యుద్దీమాలతో, రంగవల్లులతో, పెద్దఎత్తున పందిళ్ళను, ప్రత్యేక పుష్ప వేదికను ఏర్పాటు చేశారు. దేవస్థానం బయట రోడుపై వివిధ ఆకృతులలో రంగులద్దారు. స్వాములను ఆసీనుల గావించిన ప్రదేశాన శాశ్వత ఇనుప షెడ్లను అందంగా తీర్చి దిద్దారు. ధర్మపురి సిఐ రాం నర్సింహా రెడ్డి రూప కల్పన మేరకు డివిజన్ లోని పలువురు ఎస్ఐలు, ఎఎస్ఐలు/హెడ్ కానిస్టే బుల్స్, సివిల్ కానిస్టేబుల్స్, హోంగార్డులు, మహిళా హోంగార్డులు, డిస్ట్రిక్ట్ గార్డులు, ప్రైవేటు సెక్యూటిరీ గార్డులు దేవస్థానంలో కట్టుదిట్టమైన బందోబస్తుని ర్వహించారు. ఎస్.ఆర్.ఆర్. కేబుల్ నెట్ వర్క్ ద్వారా గావించిన ప్రత్యక్ష ప్రసారం స్థానికంగా వీక్షించారు. బాచంపెల్లి సంతోష్ కుమార్
వ్యాఖ్యానాలు ఆకట్టుకున్నాయి.
గుండి జగదీశ్వర్, బృందం భక్తి సంగీత విభావరి అలరించింది. కోలాట బృందం నృత్యాలు, విన్యాసాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వైకుంఠ ద్వార దర్శనంలో జాప్యం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఉత్సవాలలో ప్రధానమైన ఉత్తర ద్వార దర్శన కార్యక్రమ నిర్వహణ విషయంలో, పెరిగిన రద్దీ కారణంగా, దైవ సేవలు ద్వారం గుండా వేంచేపు చేయడంలో కాలా యాపన జరిగింది. వాస్తవానికి కారణాలేవైనా, ప్రత్యేక వేదిక వద్ద పూజలు 5గంటల తర్వాత ప్రారంభం చేశారు. 
ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి ప్రభాత సమయంలో, వైకుంఠంలో శ్రీమహావిష్ణువును దర్శించి తరించిన నేపథ్యంలో, ఇంద్రాది దేవతలు జరుపు కుంటున్న ఈ ఉత్సవ వేడుకలలో ప్రాతః కాలంలో బ్రాహ్మీముహూర్తంలో పూ జలొనర్చి, సూర్యోదయానికి ముందే వైకుంఠ (ఉత్తర) ద్వారం తెరవబడి, ఆ ద్వారం గుండా వేంచేసే స్వాముల దర్శనాలు చేసుకోవడం ప్రధానం మరియు క్షేత్రంలో అనుసరణీయమైన సాంప్రదాయం కాగా, భక్తుల రద్దీ అధికమై, దర్శనాలకై బారులు తీరిన సందర్భంలో, ఉదయాత్పూ ర్వమే ఉత్తర ద్వారం తెరిచినా, స్వాముల సేవల వేంచేపు చాలా ఆలస్యమై ఉదయం
8.30గంటల వరకు దైవ సేవలు పట్టణంలోకి వెళ్ళడం నిర్వహించారు. స్వాముల ఉత్సవ మూర్తుల సేవలను పట్టణ వీధుల గుండా ఊరేగించి, ఇసుక స్థంభం వద్ద పూజలు నిర్వహించాక, దేవస్థానానికి తిరిగి వచ్చారు.
ముక్కోటి వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, వైకుంఠ ద్వారం నుండి భక్తుల దర్శనాలను కొనసాగించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-XII విజయవంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా లో 37 మoది బాల కార్మికులకు విముక్తి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 1 ప్రజా (మంటలు)బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం... 44 వ వార్డులో బిజెపి అభ్యర్థికి మద్దతుగా డా. భోగ శ్రావణీ ప్రచారం
జగిత్యాల ఫిబ్రవరి 1 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికలలో భాగంగ జగిత్యాల పట్టణంలోని 44వ వార్డ్ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆర్మూర్ పద్మ-శ్రీకాంత్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా .బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, బీజేవైఎం... కంటోన్మెంట్ బోర్డు విలీన పోరాటానికి JAC సన్నాహక సమావేశం
సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):
కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌తో ఆదివారం బాలంరాయిలోని లీ ప్యాలెస్‌లో జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నియోజకవర్గంలోని కాలనీ అసోసియేషన్ సభ్యులు, బస్తీల... స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ లో పాల కావడి ఉత్సవాలు l ll
సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని శ్రీ స్కందగిరి సుబ్రమణ్య స్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం నుంచి పాల కావడి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాదిమంది భక్తులు పాలకావడిని భుజాన ధరించి ఆలయం చుట్టూ గిరి ప్రదర్శన చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం... బ్రాహ్మణ సమగ్ర సర్వే దరఖాస్తు పత్రంలు బాధ్యులకు అందజేత
జగిత్యాల ఫిబ్రవరి 1 (ప్రజా మంటలు) ఉమ్మడి కరీంనగర్ జిల్లా (బాస్ )బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ జనగామ నాగరాజు జగిత్యాల జిల్లా కేంద్రానికి ఆదివారం చేరుకొని అఖిల బ్రాహ్మణ అర్చక సేవా సంఘము అధ్యక్షులు సిరిసిల్ల పార్థసారథి శర్మను జిల్లా కేంద్రంలోని శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయం లో కలిసి బ్రాహ్మణ... ఎప్స్టీన్ ఫైల్ వివాదం: నిజాల కంటే రాజకీయ ఆయుధంగా మారుతున్న వైనం
— రాజకీయ విశ్లేషణ
ఎప్స్టీన్ ఫైల్‌లలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావన రావడం దేశ రాజకీయాల్లో మరో కొత్త వివాదానికి తెరలేపింది. న్యాయపరంగా ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ, ఈ అంశం ఇప్పుడు ప్రతిపక్షాల చేతుల్లో ఒక రాజకీయ ఆయుధంగా మారుతున్న తీరే అసలు చర్చకు కేంద్రబిందువుగా మారింది.
ఈ వ్యవహారంలో అసలు ప్రశ్న... 2026-27 బడ్జెట్ : స్టాక్ మార్కెట్ ప్రతిస్పందన
న్యూఢిల్లీ ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):
నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్ 2026-27 ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 75 నిమిషాల తన ప్రసంగం, సామాన్యులను, స్టాక్ మార్కెట్లను ఆకట్టుకోలేక పోయింది. దేశ ఆర్థిక వృద్ధి, మౌలిక వసతులు, ఉద్యోగాలు, పన్ను సంస్కరణలపై ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారించింది.
Union Budget 2026-27... పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజు తిరుగు ప్రయాణం
లక్షలాది భక్తులతో మహాజాతర విజయవంతం
ఎల్కతుర్తి జనవరి 31 (ప్రజా మంటలు):
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని దామేర బీమదేవరపల్లి మండలంలో ముల్కనూర్ ప్రాంతం మరోసారి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. జనవరి 28. 29. 30. ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి కూడా లక్షలాది భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. గ్రామాల నలుమూలల నుంచి మాత్రమే... పొలంలో నాటు వేస్తూ బీహార్ వలస కార్మికుడు మృతి
ఎల్కతుర్తి జనవరి 31 (ప్రజా మంటలు)
ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ శివారులో విషాదం చోటుచేసుకుంది. పొలంలో నాటు వేస్తూ బీహార్ కు చెందిన ఓ వలస కార్మికుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఉపాధి కోసం తెలంగాణకు వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సదరు వ్యక్తి, శనివారం పనిలో ఉండగానే ప్రాణాలు విడిచినట్లు గ్రామస్తులు తెలిపారు.... గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి
ములుగు, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):
గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్యకు మంత్రి సీతక్క నివాళులు అర్పిస్తూ, ఆమె కుటుంబ... ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికలు: 15 వార్డుల అభ్యర్థుల పేర్ల ప్రకటన
ధర్మపురి, జనవరి 31 (ప్రజా మంటలు):ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 15 వార్డులకు సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డుకు ప్రత్యేకంగా ఇంచార్జీలను కూడా నియమించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ... రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శాంతియుత నిరసనలు: కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, జనవరి 31 (ప్రజా మంటలు):
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ, రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
ఈ నిరసనలలో భాగంగా రాష్ట్రంలోని 12 వేలకుపైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించనున్నారు. అలాగే... 