కదిలెల్లిన సార్లు - విద్యార్థుల అడ్మిషన్ల కోసం అధ్యాపక బృందం ఊరూరా ప్రచారంకు శ్రీకారం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9964349493/9348422113).
జగిత్యాల జనవరి 7 (ప్రజా మంటలు) :
ఈ 2025-26 విద్యా సంవత్సరంలో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికిగాను కళాశాల ప్రిన్సిపాల్ డా. అరిగెల అశోక్ ఆధ్వర్యంలో, వైస్ ప్రిన్సిపాల్ డా.ఆడెపు శ్రీనివాస్, అధ్యాపక బృందం పట్టణ మరియు సమీప గ్రామాలలో గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాలవారిని కలిసి వారి వారి పిల్లలను జిల్లాకేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో చేర్పించాలని కోరుతూ, ప్రత్యేకంగా ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇందులో భాగంగా, మంగళవారం ఉదయం 11-30 గంటల ప్రాంతంలో కళాశాలనుండి ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా వారు కళాశాలలో ఉన్న వసతులు, మంచి విద్యను అందించేందుకు అధ్యాపకబృందం, లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, క్రీడా సౌకర్యాలు తదితర అంశాలను వివరించారు.
పట్టణ మరియు సమీప గ్రామాలలో గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాదిలాంటిది జిల్లాకేంద్రంలోని శ్రీ కాసుగంటి నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల అని పేర్కొన్నారు.
తమ అధ్యాపక బృందమైన ncc కో ఆర్డినేటర్, జువాలజీ విభాగం పి. రాజు, అకాడమిక్ కో ఆర్డినేటర్ డా. GVR సాయిమధుకర్, పి.జి కో ఆర్డినేటర్, కామర్స్ విభాగం అంకం గోవర్ధన్, లైబ్రరియన్ కే. సురేందర్ తో పాటు పలువురు పట్టణ మరియు సమీప గ్రామాలలో పర్యటించి, అన్ని హంగులున్న sknr ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ల కోసం అవగాహన చేపడతారని వివరించారు.
ఇంకా, కళాశాలకు 32 ఎకరాల భూదాత శ్రీ కాసుగంటి నారాయణరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కాసుగంటి ట్రస్ట్ పేరిట, రాష్ట్ర బార్ కౌన్సిలర్ సభ్యులు కాసుగంటి లక్ష్మన్ కుమార్ నేత్రుత్వంలో ప్రతీ సంవత్సరం నాలుగు విభాగాలలో ప్రథమ స్థానం పొందిన నలుగురు విద్యార్థులకు సుమారు 2 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుందడం హర్షనీయమని కళాశాల పూర్వ విద్యార్ధి, అలుమ్ని సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ అన్నారు.
గ్రామీణ పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇది ఎంతగానో ప్రోత్సామునిస్తుందన్నారు.
కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.అరిగెల అశోక్, వైస్ ప్రిన్సిపాల్ డా. ఆడెపు శ్రీనివాస్ లతోపాటు అధ్యాపాక బృందం మరియు కళాశాల పూర్వ విద్యార్ధి, అలుమ్ని సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, సిబ్బంది కందుకూరి శ్రీనివాస్, వేణు, గణపతి, ప్రమోద్, దివ్యరాణి, స్వరూప, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రూ.303 కోట్లను తేవడంలో కిషన్ రెడ్డి, ఈటల కృషి ఉంది

సీఎం కృషి తోనే కంటోన్మెంట్ బోర్డుకు రూ 303 కోట్ల మంజూరు

మేడిపల్లి నూతన ఎస్ఐగా మాడ శ్రీధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఘనంగా శ్రీసాయి నరసింహాస్వామి సేవ - నేడు గురుపౌర్ణమి -ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి

గాంధీ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితుడి మృతి - మరో ఇద్దరిని నిమ్స్ కు తరలింపు.

ఆషాడ మాస వనభోజనాలతో ఉల్లాసం – ముత్తారం గ్రామ ఆడపడుచుల సాంప్రదాయ భేటీ

బోనాల జాతర చెక్కుల గోల్ మాల్ పై ఎండోమెంట్ అధికారుల విచారణ

ఎరువులకు కూడా కరువు, రైతు గోస పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం. - జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.

పద్మారావునగర్ లో శ్రీసాయి ధన్వంతరీ సేవ

బల్కంపేట అమ్మవార్ల ఆలయ హుండీ లెక్కింపు - ఆదాయం రూ . 87 లక్షలు

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని మంత్రి శ్రీధర్ బాబుకు ఆహ్వానం

బీసీ బిల్లు మోదించకపోతే రైలు చక్రాలను ముందుకు కలదలనిచ్చేదే లేదు - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
