నూలు పోగుల బతుకు చిత్రం "కామ్ గార్ "

On
నూలు పోగుల బతుకు చిత్రం

నూలు పోగుల బతుకు చిత్రం "కామ్ గార్ ".   

  - అల్లే రమేష్, జర్నలిస్టు, సిరిసిల్ల

           కష్టాలను కలబోసుకుని నూలు పోగుల బతుకు చిత్రాల ఒకచోట పోగేసుకుని లక్ష్మణ్ కలబోసుకుంటున్న దృశ్యాలు అతని కవిత్వంలో ఆవిష్కృతం అవుతుంటాయి." రాత్ ఫైల్ దివాస్ పైల్ "కవిత సంకలనంలో సిరిసిల్ల నేత బతుకుల ముఖచిత్రాలను ఆవిష్కరించిన సిరిసిల్ల కార్మిక కవి ఆడెపు లక్ష్మణ్. కవిత్వం కొనసాగింపు క్రమంలోంచి వచ్చిందే "కామ్ గార్" కవిత్వ సంకలనం. 2007 నుంచి 2023 వరకు తాను సిరిసిల్ల నేత బతుకుల తండ్లాటను అక్షరాల్లో సవరించిన సందర్భాలను సిరిసిల్ల మానేరు రచయితల సంఘం పుస్తక రూపంలో తీసుకొచ్చింది.

        

        స్వతహా మరమగ్గాల కార్మికుడైన లక్ష్మణ్ తన జీవితంలో ఎదురైన అనుభవా లను తన చుట్టూ ఉన్న కార్మికుల జీవితాల్లో కల్లోలాన్ని ప్రత్యక్ష చూసినవాడు. తన అనుభవాల నుంచి కార్మికుల జీవితాల్లోని అనేక కోణాలను దుఃఖ భరిత జీవితాలను కవిత్వంగా మలిచి అందించిన కవిత్వమే" కామ్ గార్". కవిత్వం నిండా పరుచుకున్న కార్మికుల జీవితాలు నిటారుగా నిలబడి కవిత్వమై సమాజాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నట్లే కనిపిస్తుంది. అవసరం తీరకుండానే అలా వచ్చి పోయే "పగరా" చిన్నచిన్న సంతోషాలను కూడా వాయిదా వేస్తూ సమస్యలు తీరకుండానే ...సంక్షోభాల ఊబిలో మర మగ్గాల కార్మికుల జీవితాల అస్తిత్వంపై దెబ్బ కొట్టి పోతే కన్నీటిని దాచుకున్న కండ్ల వెనుక భవిష్యత్ తరాలకు ఇచ్చి పోతున్న బాకీల చిట్టాలు జీవితాలు కవిత్వం నిండా మనతో కలబోసుకుంటాయి. వదిలోచ్చిన వలసల అనుభవాల  మరోసారి లక్ష్మణ్ యాది చేస్తాడు. మాటల్లో చెప్పలేం దుఃఖం , కనిపిస్తున్న సంక్షోభాల వెనుక కరిగిపోయిన కార్మికుల జీవితాల తాలుకు ప్రశ్నలను మన ముందు ఉంచుతున్న కవిత్వం. కాలక్షేపం కోసం కాకుండా కార్మికుల జీవితాలను పట్టిచూపి కవిత్వం అందరూ ఓసారి తడిమి చూడాల్సిందే.. కవిత్వానికి ముందుమాట రాసిన మచ్చ ప్రభాకర్, 5 తరగతి వరకు చదువుకున్న తన సాహితి నేపథ్యం గురించి లక్ష్మణ్ చెప్పుకున్న మాట ప్రత్యేకంగా కందుకూరి రమేష్ బాబు అందరికోసం చెప్పిన మాట కవిత్వం వెనుక ఉన్న గుండె తడిని గుర్తు చేస్తాయి...

   సంకలనంలోని ఒక కవిత. 
 

    భీవండీకి పోయి రావాలె 

      భీవండికి మళ్లీ 
      ఒకసారి పోయి రావాలె

      కడుపునిండా తిండి పెట్టి 
     కుటుంబాన్ని సాకిన దేశం పోయి రావాలె 

  ఏ రాత్రో అపరాత్రో పోయిన 
 పొట్టకు పెట్టిన అమ్మ చల్లని చేయని 
  ఒకసారి తడిమి రావాలె
  ......
.  ఎంతమంది బతికున్నారో
   ఎంతమంది చీకటి పోగులు కలిసిపోయారో
    మల్లొక్కసారి సంచాల కార్ఖానాలోకి పోవాలె
  ......

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

గోర్ బంజారా రెండు వందల ఏళ్ల చరిత్రను నవలరూపంలో ఆవిష్కరించిన ‘పోర్యతార’ – జూపల్లి కృష్ణారావు

గోర్ బంజారా రెండు వందల ఏళ్ల చరిత్రను నవలరూపంలో ఆవిష్కరించిన ‘పోర్యతార’ – జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు): గోర్ బంజారా సమాజానికి చెందిన రెండు వందల ఏళ్ల జనజీవన సంఘర్షణ, చరిత్రను తొలిసారిగా నవలరూపంలో తీసుకురావడం శుభపరిణామమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రచయిత ఆమ్ గోత్ వెంకట్ పవార్ రచించిన తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక...
Read More...
Local News  State News 

పట్టణ సంస్థల బలోపేతం, ఎమ్మెల్యేల ఆరోగ్య పథకంపై కీలక చర్చలు : సచివాలయంలో రాజేశం గౌడ్ భేటీలు

పట్టణ సంస్థల బలోపేతం, ఎమ్మెల్యేల ఆరోగ్య పథకంపై కీలక చర్చలు : సచివాలయంలో రాజేశం గౌడ్ భేటీలు హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు): మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ సచివాలయంలో వరుసగా కీలక భేటీలు నిర్వహించారు. పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం, శాసనసభ్యుల ఆరోగ్య పథకం అమలు అంశాలపై ఆయన ఉన్నతాధికారులు, మంత్రులతో సవివరంగా చర్చించారు. మొదటిగా పురపాలక పరిపాలనా శాఖ...
Read More...

ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం సాగుపై సమీక్ష పాల్గొన్న జిల్లా కలెక్టర్

ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం సాగుపై సమీక్ష పాల్గొన్న జిల్లా కలెక్టర్ జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు)    జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖ, లోహియ ఆయిల్ పామ్ కంపనీ, మైక్రో ఇరిగేషన్ సిబ్బందికి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణము పెరుగుదల కొరకు సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఫిబ్రవరి  మాసం వరకు వారికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశాలు జారీచేయడం ఈ...
Read More...

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారకపోతే  తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలి   మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారకపోతే  తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలి   మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్          జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు) దావ వసంత సురేష్ శనివారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  బిఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు దావ వసంత సురేష్  మాట్లాడుతూ....మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజెంగి నందయ్య...
Read More...

ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత

ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు): బోయిన్‌పల్లి మనోవికాస్ నగర్‌లోని ఎన్ఐఈపీఐడీలో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లితండ్రులతో తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లితండ్రులకు పెన్షన్‌తో పాటు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం కల్పించాలని...
Read More...
Local News 

పార్టీ మారలేదంటే కేసీఆర్ సమావేశానికి రావాలి: దావ వసంత సురేష్

పార్టీ మారలేదంటే కేసీఆర్ సమావేశానికి రావాలి: దావ వసంత సురేష్ జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు): జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పార్టీ మారలేదని చెబుతున్నట్లయితే, రేపు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే బీఆర్ఎస్ సమావేశానికి హాజరుకావాలని జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సవాల్ విసిరారు. మంత్రి అడ్డూరి లక్ష్మణ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్యలు...
Read More...

నలబైఎళ్లుగా ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి కట్టబెడుతున్న గ్రామస్తులు

నలబైఎళ్లుగా ఒకే కుటుంబానికి సర్పంచ్ పదవి కట్టబెడుతున్న గ్రామస్తులు మక్తల్ డిసెంబర్ 20 (ప్రజా మంటలు): నలభై సంవత్సరాలుగా గ్రామస్తుల విశ్వాసాన్ని సొంతం చేసుకున్న వనజమ్మ కుటుంబానికే ఆ గ్రామ సర్పంచ్ పదవిని కట్టబెట్టడం విశేషం. గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి వరకు ఈ కుటుంబ సభ్యులే బాధ్యతలు చేపట్టుతూ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఐక్యతతో ముందుకు...
Read More...

Today's cartoon

Today's cartoon Today's Cartoon
Read More...
Local News 

పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి.              -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.      

పెన్షనర్లకు ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి.              -టీ.పీ.సి.ఏ.రాష్ర్ట కార్యదర్శి హరి అశోక్ కుమార్.       జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం టీ.పి.సి.ఏ.ఆధ్వర్యంలో జాతీయ పెన్షనర్ల వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా అసోసియేషన్ కార్యాలయంలో పెన్షన్ నిబంధనలు-ప్రయోజనాలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం 2024...
Read More...

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News 

హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్ 

హర్షవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన రాజేశం గౌడ్  కోరుట్ల డిసెంబర్ 19|(ప్రజా మంటలు): కోరుట్లకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ క్యాన్సర్‌తో మృతి చెందడంపై తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మేడిపల్లి మాజీ జెడ్పీటీసీ అడ్డగట్ల లలితలతో కలిసి...
Read More...

అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు  విజయవంతం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

అధికారుల సమన్వయం తో గ్రామపంచాయతీ ఎన్నికలు  విజయవంతం  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 19 (ప్రజా మంటలు)మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్   ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను మరియు సిబ్బందిని అభినందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన...
Read More...