పరమ భాగవతోత్తముడు అంబరీషుడు
ఆధ్యాత్మిక ప్రాసంగికులు డాక్టర్ సంగన భట్ల
పరమ భాగవతోత్తముడు అంబరీషుడు
ఆధ్యాత్మిక ప్రాసంగికులు డాక్టర్ సంగన భట్ల
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి నవంబర్ 09:
భక్తి, శ్రద్ధ, విధేయతతో పరమ భాగవతోత్తముడు అంబరీషుడు శాప విముక్తుడై మరణాన్ని జయించిన ఘట్టం
భగవంతుడి భక్తిని ఎలా ఆచరించాలి అన్న సందేశాన్ని అందిస్తుందని
ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, నటులు, చారిత్రక పరిశోధకులు, నాటక దర్శకులు, విశ్రాంత ప్రాచార్యులు, ఆధ్యాత్మిక ప్రాసంగికులు, విశేషించి పురాణ ప్రవాచకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ సంగన భట్ల నర్సయ్య ఉద్ఘాటించారు.
ధర్మపురి క్షేత్రంలో కాకర్ల గోపాల్ శర్మ దంపతుల ఆధ్వర్యంలో, పూర్వజులు కాశమ్మ, రాజ్య లక్ష్మమ్మల స్మృత్యర్థం కాకర్ల కృష్ణ, సనత్ శర్మ దంపతుల సహకారంతో,
నిర్వహించిన కార్యక్రమంలో స్కాంద పురాణ అంతర్గత కార్తిక మాస మహాత్మ్యం పురాణ ప్రవచనం గావించారు.
ఈ సందర్భంగా శనివారం స్కాంద పురాణం అంతర్గత కార్తిక మహాత్మ్యం పురాణ
ప్రవచనం ముగింపుగా అంబరీష ఉపాఖ్యాన అంశాలను వివరించారు.
అంబరీష మహారాజు కథ స్కంద పురాణంలోని కార్తీక మాసం సంబందిత కథలలో ముఖ్యమైనదన్నారు. అంబరీష మహారాజు ఎంతో భక్తిశ్రద్ధలతో వైష్ణవ భక్తుడిగా, శ్రీమహావిష్ణువు పట్ల పరమ భక్తిని కలిగి ఉండేవాడని, తన భార్యతో సహా ద్వాదశి రోజున కృష్ణ పక్షంలో ఏకాదశి వ్రతం ఆచరించాడన్నారు. ఈ వ్రతాన్ని ఎంతో నియమం, నియతంగా పాటించాడని, అంతేకాక, ద్వాదశి రోజు పరమ సంతోషంగా ప్రసాదం స్వీకరించేందుకు సిద్ధమయ్యాడని, ఆ సమయంలో ఆయన ఇంటికి దుర్వాస మహర్షి విచ్చేసిన సందర్భాన్ని వివరించారు.
అంబరీషుడు దుర్వాస మహర్షిని గౌరవంతో ఆహ్వానించి, ఆయనకు ఆహారం ఏర్పాటు చేయగా, దుర్వాసుడు తపస్కార్యాలకు వెళ్లి తిరిగి రాకముందే ద్వాదశి సమయం అయిపోతుందనే భయంతో అంబరీషుడు స్వల్పమాత్రలో జలమును స్వీకరించి వ్రతాన్ని ముగించాడన్నారు
దుర్వాసుడు తిరిగి వచ్చి జరిగింది తెలుసుకుని, కోపంతో అంబరీష మహారాజును శపించాడన్నారు. అంబరీషుడు తన సహనంతో భగవంతుని ఆశ్రయంతో శాపాన్ని సహించాడుని, శాపం ఎలాంటి విపత్తు కలిగించ కూడదని మహావిష్ణువు ఆగ్రహంతో దుర్వాసుని కోసం సుదర్శన చక్రాన్ని పంపి రక్షించిన నేపథ్యాన్ని సోదాహరణంగా వివరించారు.
కృష్ణ పూజతో ప్రారంభించి, వేద విదులు పెండ్యాల రాజేశ్ శర్మ ద్వారా శివార్చన గావించి, పౌరాణికులు డాక్టర్ సంగన భట్ల నరసయ్యను సాంప్రదాయ రీతిలో
నిర్వాహకులు, భక్తులు, బంధువులు ఘనంగా సన్మానించి ముగింపు పలికారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ
