తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులకు "రిటర్న్ గిఫ్ట్" సీనియర్ సిటిజన్ యాక్ట్*
భీమదేవరపల్లి నవంబర్ 4 (ప్రజామంటలు) :
తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోని కొడుకులకు సీనియర్ సిటిజన్ యాక్ట్ రిటర్న్ గిఫ్టు లాంటిది. ఆధునిక సమాజంలో నేటి యువత మానవ సంబంధాలు మంటగలుపుతున్న నేపథ్యంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు సీనియర్ సిటిజెన్ యాక్ట్ ఒక వరం. వివరాల్లోకి వెళితే భీమదేవరపల్లి మండలంలోని ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజ కొమురయ్య తన ఒక్కగానొక్క కొడుకు రవికి 4.12 ఎకరాల భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. కొంతకాలం తర్వాత తండ్రి బాగోగులు చూడడం మానేసి, మానసికంగా వేధించడం, చేయి చేసుకోవడంతో రాజ కొమురయ్య కలత చెంది ఓ రైస్ మిల్లులో వాచ్మెన్ గా పనిచేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. సీనియర్ సిటిజన్ ఆక్ట్ ద్వారా స్థానిక తాసిల్దార్ కు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా భీమదేవరపల్లి తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, విచారణ అనంతరం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ రద్దుచేసి సంబంధిత ధ్రువపత్రాలను తండ్రి రాజకొమురయ్యకు అప్పగించినట్లు తెలిపారు. తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు ఎవరైనా సీనియర్ సిటిజన్ యాక్ట్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్

ఘనంగా కొనసాగుతున్న అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు. ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
