కామన్ స్కూల్ విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలుపరచాలి. - టి.పి.టి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు) :
ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ లో ఓటు హక్కు కల్పించాలి.
టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై అశోక్ కుమార్ డిమాండ్
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్)3వ జనరల్ కౌన్సిల్ సమావేశం స్థానిక డి సి ఈ బి కార్యాలయంలో, జగిత్యాల జిల్లా టీపీటీఎఫ్ అధ్యక్షులు బోగ రమేష్ అధ్యక్షతన నిర్వహించడమైనది.
ఇట్టి సమావేశానికి టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై.అశోక్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ...
గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని,ప్రస్తుత ప్రభుత్వం బదిలీలు,పదోన్నతులు-ఉపాధ్యాయుల నూతన నియామకం మినహాయిస్తే, మిగిలిన అన్ని విషయాల్లో గత ప్రభుత్వము మాదిరిగానే వ్యవహరిస్తోందని,5 డి.ఏ.లు పెండింగ్ లో ఉండగా ఒక్క డి.ఏ.మాత్రమే మంజూరు చేసిన తీరు ఉద్యోగ-ఉపాధ్యాయులను తీవ్ర నిరాశ-నిస్పృహలకు గురిచేసిందని,ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగానే ఉద్యోగ-ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని,సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఒకే విధమైన విద్య కావాలని,అది కామన్ స్కూల్ విద్యా విధానం ద్వారానే సాధ్యమవుతుందని,ప్రాథమిక తరగతులలో మాతృభాషలో విద్య ఉండాలని, ప్రాథమిక తరగతుల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి,మౌలిక వసతులు కల్పించాలని, ప్రాథమిక తరగతుల్లో కూడా ఆటల కొరకు పి ఈ టి టీచర్ ను నియమించాలని తద్వారా సమసమాజ నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించాలని, దానికి కావాల్సిన చట్ట సవరణ కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇట్టి జనరల్ కౌన్సిల్ సమావేశంలో టి పి టి ఎఫ్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టి పి టి ఎఫ్ జగిత్యాల జిల్లా కార్యవర్గం అధ్యక్షులుగా కొక్కుల రామచంద్రం, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల గోవర్ధన్, ఉపాధ్యక్షులుగా సిహెచ్ వి సత్య ప్రకాష్, సిహెచ్ సత్యం, గండి రాజయ్య, ఎలిగేటి సంజీవరాణి,కూరగాయల చంద్రశేఖర్,చింత మోహన్ ప్రసాద్ ,రాచమల్ల మహేష్, పాక కుమారస్వామి,జిల్లా కార్యదర్శులుగా పి రాజనర్సయ్య,వేముల సుధాకర్, పొన్నం శ్రీనివాస్, పిన్నంశెట్టి శివరంజని, గుడిసె రమేష్, కాచర్ల నాగరాజు, ఎక్కలదేవి రవి, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా బి సత్యస్వామి, సభ్యులుగా ఆర్మూర్ భీమరాజు,ఏ.రాజ మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులుగా లావుడ్య రాజయ్య ,ఎండి ఫక్రుద్దీన్,ఎల్ మంజుల, రాష్ట్ర కౌన్సిలర్లుగా కొలుగూరి కిషన్ రావు,బోగ రమేష్,గొడుగు రఘుపతి యాదవ్,పి కల్పన తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇట్టి ఎన్నికలకు అధికారిగా రాష్ట్ర కార్యదర్శి గుంటి ఎల్లయ్య,పరిశీలకులుగా లక్ష్మయ్య యాదవ్ లు వ్యవహరించారు.
ఇట్టి కార్యక్రమంలో సీనియర్ ఫెడరేషన్ నాయకులు సూద రాజేందర్,నాగేంద్రం,రవీందర్ వివిధ మండలాల బాధ్యులు చిర్నేని రాజిరెడ్డి,కొత్త రాంకుమార్,గొడుగు మధుసూదన్,కడారి ప్రకాష్ ,ఆసం శ్రీనివాస్,గజ్జల లచ్చయ్య, ఐల రఘుపతి,గొల్లపల్లి సత్యనారాయణ, సంతోష్ కుమార్, శ్రీనివాస్, తిరుపతి కందుకూరి శ్రీనివాస్, వెంకటరమణారెడ్డి, వహీద్, సలాముద్దీన్, సిరికొండ వేణు, జి చంద్రమౌళి,గంగారాం,రాజేశం మహిళా ఉపాధ్యాయులు వనిత,, మంజుల, సునీత ,సంజీవరాణి, శివరంజని ,పప్పీరాణి,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అల్లిపూర్ నూతన సర్పంచ్, ఉపసర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపిన తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల (రూరల్),డిసెంబర్ 27 ప్ర(జా మంటలు):జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎంబరీ గౌతమి, ఉపసర్పంచ్ వినయ్లతో పాటు వార్డు సభ్యులుగా ఎన్నికైన మహిళలు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ వారిని శాలువాలతో సత్కరించి... అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల అర్బన్ మండలంలోని అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భక్తి పాటను, అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ ఛానల్ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది.
భక్తి పాట రూపకల్పనలో కీలకంగా పనిచేసిన... సారంగాపూర్లో మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ వేడుకలలో ఎమ్మెల్యే డా సంజయ్
సారంగాపూర్, డిసెంబర్ 27 – ప్రజా మంటలు:
సారంగాపూర్ మండలం రంగంపేట గ్రామ మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండలోజు వేణుగోపాల్ – శోభ దంపతులను శాలువాతో సత్కరించి, పదవీ విరమణ... ఆరుసార్లు గెలిచి! మళ్ళీ రాజీనామా చేసి, గెలుస్తా దానం ప్రకటన
హైదరాబాద్, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు కేసులు, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేస్తూ, అవసరమైతే రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.
శుక్రవారం... జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి
జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా వైద్యాధికారి (DMHO) డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వైద్య వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రజారోగ్య సేవల్లో అంకితభావంతో పనిచేసిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్, విధి నిర్వహణలో నిబద్ధత, మానవీయత... ఎన్.సి.సి. (NCC) ఆర్.డి (Republic Day) పరేడ్ కు ANO గా మన జగిత్యాల వాసి చేని.మంగ
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113.
జగిత్యాల/ హైదరాబాద్ డిసెంబర్ 27 (ప్రజా మంటలు) :
జనవరి 26న ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో లో తెలంగాణ నుండి NCC క్యాడేట్స్ తో పాటు జగిత్యాలకు మౌంట్ కార్మెల్ స్కూల్ కు చెందిన అసోసియేట్ NCC ఆఫీసర్ పాఠశాల పి.ఈ.టి (వ్యాయామ ఉపాధ్యాయురాలు)... అధికారిక–వృత్తి సంఘం (GOPA) స్వర్ణోత్సవ వేడుకలు
హైదరాబాద్, డిసెంబర్ 26 (ప్రజా మంటలు):
గౌడ్ అధికారిక మరియు వృత్తి సంఘం (GOPA) 50వ వార్షికోత్సవ వేడుకలు కాచిగూడ, హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ స్వర్ణోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు హాజరై సంఘానికి అభినందనలు తెలిపారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ నెర్రెల్ల... జగిత్యాల జిల్లా: కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా – నలుగురికి గాయాలు
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డుపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. గోదావరిఖని నుంచి అంజన్న స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తుల ఆటో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న సైడ్వాల్ను ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు భక్తులు గాయపడ్డారు. ప్రమాద... ధర్మపురి అభివృద్ధే లక్ష్యం, మూడుేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా - కరీంనగర్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కరీంనగర్ డిసెంబర్ 26, (ప్రజా మంటలు):
కరీంనగర్ ఆర్ అండ్ బి అతిథిగృహంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన నియోజకవర్గం పూర్తిగా రైతులపై ఆధారపడిన... తక్కలపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సత్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి
జగిత్యాల డిసెంబర్ 26(ప్రజా మంటలు)రూరల్ మండల్ తక్కళ్లపెళ్లి గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కచ్చు ముని రాజు , వార్డ్ సభ్యులు నరపాక రాజేష్ ,నాయకులు వడ్లూరి హరీష్, విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణిప్రవీణ్ ని స్వగృహంలో మర్యాదపూర్వక కలువగా వారిని శాలువతో... 