స్వచ్ఛ దివాలి శుభ్ దివాలి పర్యావరణానికి మేలు చేసేలా పండుగలు
On
స్వచ్ఛ దివాలి శుభ్ దివాలి
పర్యావరణానికి మేలు చేసేలా పండుగలు
కోరుట్ల అక్టోబర్ 29:
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ఆదేశాల ప్రకారం ఈ రోజు కోరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ దివాలి- శుభ్ దివాలి కార్యక్రమం నిర్వహించారు.
దీనిలో బాగంగా శివ దుర్గ సమాఖ్య లోనీ సభ్యులు తయారు చేసిన మట్టి పాత్రలతో స్టాల్ ఏర్పాటు చెయ్యటం జరిగింది. మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ దీపావళి రోజు ప్రకృతికి హాని కలగకుండా ఉండే విధంగా మట్టి పాత్రలోనే దీపాలు వెలిగించాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, మెప్మా సి ఓ లు సంధ్య, గంగరాణి మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Tags