గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు

On
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 వ తేదీ వరకు
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.   
 హైదరాబాద్ అక్టోబర్ 17:

 ఈనెల 21 వ తేదీ నుండి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో నేడు సచివాలయం నుండి వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించి సమీక్షించారు.

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయం నుండి కమీషన్ చైర్మన్ డా. మహేందర్ రెడ్డి, సభ్యులు పాల్గొనగా, సచివాలయం నుండి డీజీపీ జితేందర్, కమీషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, SPDCL MD ముష్రాఫ్ అలీ, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్ తదితర అధికారులు హాజరయ్యారు. 


    ఈ సందర్బంగా    సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ,  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు.  దీనికోసం 46 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశామని వివరించారు.

ఈ పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు,అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని,సంబంధిత పోలీస్ కమీషనర్లు కూడా తగు బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఏవిధమైన స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా ఈ పరీక్షల నిర్వహణా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. 


 TGPSC చైర్మన్ డా. ఎం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, 2011 సంవత్సరం అనంతరం గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని, కొన్ని సంవత్సరాల అనంతరం జరిగే ఈ పరీక్షల నిర్వహణలో ప్రతీ అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ఆక్టివ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని, ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని మహేందర్ రెడ్డి అన్నారు.

గ్రూప్ -1  జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తు తోపాటు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు చేపట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు. 
 

TGPSC కార్యదర్శి నవీన్ నికోలస్ మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలో 8 , రంగారెడ్డి జిల్లాలో 11 , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27  మొత్తం 46 కేంద్రాలలో  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీ లను ఏర్పాటు చేసి, TGPSC కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ప్రతి స్టెప్ లోనూ కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలు అందచేశామని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు, మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

ఇప్పటికే, 85 శాతం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను  డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంటను అదనంగా కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఎవరికైతే పరీక్ష రాయడానికి సహాయకులు (స్క్రైబ్ ) అవసరమో, ఆ అభ్యర్థుల హాల్ టికెట్లపై ప్రత్యేకంగా పేర్కొనడం జరిగిందని, స్క్రైబ్ ల సహాయంతో పరీక్షలు వ్రాసే వారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి వెల్లడించారు.

అన్నిపరీక్షా కేంద్రాల 46 వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కర్ణన్ తెలిపారు. నిరంతరం విధ్యుత్ సరఫరా అందించేవిధంగా చర్యలు చేపట్టినట్టు, ఇందుకుగాను ముగ్గురు సి.ఈ లు పర్యవేక్షిస్తారని SPDCL ఎండీ ముషారఫ్ అలీ అన్నారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 
--

Tags
Join WhatsApp

More News...

Local News 

కొండగట్టు అంజన్న భక్తులకు ఎం ఎస్ ఆర్ డి ఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

కొండగట్టు అంజన్న భక్తులకు ఎం ఎస్ ఆర్ డి ఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కొండగట్టు మే 12 ( ప్రజా మంటలు)హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తుల సౌకర్యార్థం మ స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్* ( ఎం ఎస్ ఆర్ డి ఎఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ సేవా కార్యక్రమం నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు అరటి...
Read More...
State News  Spiritual  

కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొండగట్టు, మే 11 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్న మంత్రి, అంజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి...
Read More...
Local News 

ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డి ఎస్పీ పురుషోత్తం రెడ్డి 

ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డి ఎస్పీ పురుషోత్తం రెడ్డి  జగిత్యాల మే 10 (ప్రజా మంటలు) రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో, ఆపి ప్రైవేంటివ్ హెల్త్ క్లినిక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్ ను అందజేసే కార్యక్రమం జరిగింది.    జిల్లా కేంద్రంలోని పావని కంటి హాస్పిటల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జగిత్యాల పూర్వ అధ్యక్షుడు,  శాసన...
Read More...
Local News 

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు కొండగట్టు మే 10 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. విశేష సంఖ్యలో భక్తుల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.   హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వైదిక...
Read More...
Local News 

విద్యార్థులకు  బాల్యం నుండే సంస్కారాన్ని అందించాలి. ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ

విద్యార్థులకు  బాల్యం నుండే సంస్కారాన్ని అందించాలి.  ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ    జగిత్యాల మే 10 (ప్రజా మంటలు  ) విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని కూడా బాల్యం నుండే అలవాటు చేయాలని ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ అన్నారు. సేవా భారతి, గీతా విద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు నిర్వహించిన సంస్కార సాధన వర్గ ముగింపు సమావేశం ఆదివారం గీతా...
Read More...
Local News 

ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి జీవన్ రెడ్డి

ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి జీవన్ రెడ్డి    సారంగపూర్ మీ 10 ( ప్రజా మంటలు)మండలం లచ్చక్క పేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ప్రాణ ప్రతిష్టా మరియు పట్నాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  ఎల్లమ్మ తల్లి ఆశీర్వచనాలు దీవెనలు అందరి పైన పైన ఉండాలనీ అన్నింటి కన్న ప్రమాదకరమైన వృత్తి...
Read More...
Local News 

ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    సారంగాపూర్ మే 10(ప్రజా మంటలు)  మండలము  లచ్చక్క పేట గ్రామంలో ఎల్లమ్మ తల్లీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  రేణుక ఎల్లమ్మ దయతో పాడి పంటలు ,ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. హిందూ ధర్మ రక్షణకు అందరూ పాటుపడాలన్నారు. ఇతర...
Read More...
State News 

తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు కవిత మద్దతు జూన్ 2 వరకు కాంగ్రెస్‌కు గడువు

తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు కవిత మద్దతు జూన్ 2 వరకు కాంగ్రెస్‌కు గడువు హైదరాబాద్ మే 10 (ప్రజా మంటలు): ఉద్యమకారుల డిమాండ్లకు మద్దతుగా, హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి జూన్ 2 వరకు గడువుఅమలు లేకపోతే ఉద్యమకారులతో కలిసి ఆందోళనకు హెచ్చరిక చేస్తూ,  టి ఆర్ఎస్ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సంఘాల...
Read More...
Local News 

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి   ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి   రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్    జగిత్యాల మే 8(ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బీట్ బజార్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.      సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనుగోలు...
Read More...
Local News 

ఈవీఎం గోదాము  తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఈవీఎం గోదాము  తనిఖీ  భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల మే 8( ప్రజా మంటలు)రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల  ఈవీఎం లను భద్రపరిచిన గోదామును  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.   జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రతినెల...
Read More...
Local News 

కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్‌లో కాల్పులతో దోపిడీ – 5 మంది నిందితుల కోసం 12 బృందాల గాలింపు

కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్‌లో కాల్పులతో దోపిడీ – 5 మంది నిందితుల కోసం 12 బృందాల గాలింపు కరీంనగర్ మే 03 (ప్రజా మంటలు): కరీంనగర్ జ్యోతినగర్‌లోని PMJ జ్యువెలరీ షాప్‌లో పట్టపగలే సంచలన దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు తుపాకులతో షాప్‌లోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి, భారీగా బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి...
Read More...
Local News 

కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక

కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక హైదరాబాద్, మే 03 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.కవిత గారిపై కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను...
Read More...