పి సి సి అధ్యక్షులుగా మహేష్ కుమార్

On
 పి సి సి అధ్యక్షులుగా మహేష్ కుమార్

తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా. మహేష్ కుమార్ గౌడ్

హైదారాబాద్ సెప్టెంబర్.06: తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది.

గత 8 నెలలుగా కొత్త పీసీసీ అధ్యక్షుని నియామకం కొరకు జరిగిన చర్చల్లో చివరికి మహేష్ కుమార్ గౌడ్ వైపే ఏఐసీసీ మొగ్గింది. 

 ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌కు కొత్త పీసీసీ అధ్య‌క్షుడిని నియ‌మించేందుకు కాంగ్రెస్ పార్టీకి 9 నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది.

మ‌హేశ్ కుమార్ గౌడ్ రాజ‌కీయ నేప‌థ్యం..

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్‌ జిల్లాలోని భీంగల్ మండలం, రహత్‌ నగర్‌లో జ‌న్మించారు. గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశాడు.

మహేష్ కుమార్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసి ఓట‌మి చ‌విచూశారు. ఆ తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియమితుల‌య్యారు.

2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితుల‌య్యారు. మహేష్ కుమార్ గౌడ్ 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ ఏడాది జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు మహేశ్ కుమార్ గౌడ్

గతంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గా పనిచేసిన మధు యాష్కీ. ఈ పదవి కొరకు చివరి వరకు పోటీలో అన్నారు. కానీ ఆయన గత శాసన సభ ఎన్నికల్లో ఎల్ బి నగర్ నియోజక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారని, ఓడిన వారికి పదవి ఇస్తే, ఇంకా చాల మంది ఇతర పదవులకు పోటీపడతారని, అందుకే పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది, మధు యాష్కీ కి ఇతర చోట స్థానం కల్పించి అవకాశం ఉందని చెప్పుకొంటున్నారు.

Tags
Join WhatsApp

More News...

రాయికల్ మున్సిపల్  బి ఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన దావా వసంత

రాయికల్ మున్సిపల్  బి ఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన దావా వసంత రాయికల్ ఫిబ్రవరి 3 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్  నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  మరియు జగిత్యాల రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ఆదేశానుసారం రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు బిఆర్ఎస్ పార్టీ బీ ఫాములు...
Read More...
Local News  State News 

పంతం నెగ్గించుకొన్న MLA సంజయ్: 35 సీట్లతో పై చేయి.

పంతం నెగ్గించుకొన్న MLA సంజయ్: 35 సీట్లతో పై చేయి. జీవన్ రెడ్డి వర్గంలో తీవ్ర అసంతృప్తి – కార్యకర్తల ఆగ్రహం జీవన్ రెడ్డి నిర్ణయం కొరకు ఎదిరి చూపు? జగిత్యాల ఫిబ్రవరి 03 (ప్రజా మంటలు): జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు తీవ్ర వివాదానికి దారితీసింది. టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందంటూ సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తిని...
Read More...
Today's Cartoon 

Today's Cartoon

Today's Cartoon Today's Cartoon 
Read More...

రావి నారాయణ రెడ్డికి తెలంగాణలో సముచిత స్థానం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

రావి నారాయణ రెడ్డికి తెలంగాణలో సముచిత స్థానం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి భూమి–భుక్తి–వెట్టిచాకిరి విముక్తి పోరాట వీరుడికి ప్రభుత్వ గౌరవం హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచితమైన స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రావి నారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశాల్లో...
Read More...
Local News 

హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం

హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు): ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్...
Read More...
Local News 

లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం

లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం గొల్లపల్లి, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో సోమవారం లయన్స్ క్లబ్ గొల్లపల్లి, లీడ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోటివేటివ్ స్పీకర్ కెప్టెన్ డా. లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డి విద్యార్థుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపారు....
Read More...
Local News  Spiritual  

అంగరంగ వైభవంగా బుగ్గారం పోచమ్మల జాతర – రథోత్సవం

అంగరంగ వైభవంగా బుగ్గారం పోచమ్మల జాతర – రథోత్సవం బుగ్గారం / గొల్లపల్లి ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం శ్రీ ముత్యాల పోచమ్మ – నల్ల పోచమ్మల జాతర, రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ జిల్లాలతో పాటు అంతర్‌రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తజనం తండోప తండాలుగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్...
Read More...

మొదటిరోజు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం 

మొదటిరోజు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం     జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)జిల్లాలో  సోమవారం 17 (జనరల్ మరియు ఒకేషనల్) పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో భాగంగా ఈరోజు జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు జరిగిన ప్రాక్టికల్ పరీక్షలలో ఉదయం 1409 మంది విద్యార్థులకు గాను 1312 మంది విద్యార్థులు హాజరైనారు. జనరల్ విభాగంలో...
Read More...

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం   ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 7గురు  అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్...
Read More...
State News 

పెట్టుబడుల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

పెట్టుబడుల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది పెట్టుబడులపై Fact Check (వివరాలు కింది టేబుల్ లో) కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం ఫోన్ ట్యాపింగ్ కేసు – పారదర్శక విచారణ జరగాలి హైదరాబాద్, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న వేల కోట్ల పెట్టుబడులు కట్టుకథలేనని తెలంగాణ జాగృతి...
Read More...
Local News  State News 

అభ్యర్థి మంచోడా చెడ్డోడా కాదు – ప్రజలకు ఉపయోగపడేవాడే ముఖ్యం : కవిత

అభ్యర్థి మంచోడా చెడ్డోడా కాదు – ప్రజలకు ఉపయోగపడేవాడే ముఖ్యం : కవిత మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు): మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి మంచోడైనా చెడ్డోడైనా కేసీఆర్ ను చూసి ఓటు వేయాలని కేటీఆర్ కోరుతున్నారని కవిత విమర్శించారు.ఇది బీఆర్ఎస్‌లోని రాజరిక, నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. ఈరోజు జాగృతి ఆఫీస్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ, కులం, మతం,...
Read More...

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-XII విజయవంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-XII విజయవంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జిల్లా లో 37 మoది బాల కార్మికులకు విముక్తి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 1 ప్రజా (మంటలు)బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి  సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా  ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం...
Read More...