డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్
డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్,చైర్ పర్సన్
జగిత్యాల సెప్టెంబర్ 06 (ప్రజా మంటలు) :
పట్టణ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని,న్యాక్ సెంటర్,
టీ అర్ నగర్ లోని బాలసదన్ ,వృద్ధాశ్రమం, మరియు జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ లోని వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు కరెంటు నీళ్ల వసతి ఏర్పాటు కోసం కలెక్టర్ తో కలిసి పరిశీలించడం జరిగిందని
గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సైతం సరైన వసతులు లేవని వారికి కూడా మౌలిక వసతులు మరియు చెట్ల పొదలు తొలగించే విధంగా కలెక్టర్ కమిషనర్ ని ఆదేశించారని అన్నారు.
అమృత్ కార్యక్రమంలో భాగంగా డబల్ బెడ్ రూం ఇండ్ల కు తాగునీటి సౌకర్యం కల్పించాలని,ఇప్పటికే నివాసముంటున్న లబ్ధిదారులకు నీటి సమస్య ఉందని, ఆపరేటర్ ను నియమించాలని కలెక్టర్ ను కోరడం జరిగింది అన్నారు.
520 ఇండ్లు పూర్తికాగా కరెంటు మీటర్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని,మిగిలిన 4 వేల ఇండ్లకు 2 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఇండ్లకు ప్యానెల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
పేదింటి సొంతింటి కల డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం అని, అతిత్వరలోనే మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తవుతాయని,భారీ వర్షాల కారణంగా కొంత పనులు ఆలస్యం అయ్యాయని అన్నారు .
న్యాక్ సెంటర్ సిబ్బంది గతంలో కలవగా రహదారి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు . ముఖ్యమంత్రి రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి న్యాక్ అనుబంధంగా కొనసాగించే విధంగా ఆలోచన చేశారని మరియు జగిత్యాల కు 5కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మంజూరు అయిందని న్యాక్ కేంద్రానికి 700 మీటర్ల దూరంలో ఐదు ఎకరాల స్థలాన్ని సైతం ఆర్డిఓ గుర్తించారని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
పేద మధ్యతరగతి ప్రజల పిల్లలకు వృత్తి నైపుణ్య కోర్సులకు ఉపయోగ పడుతుంది అని అన్నారు.
టి ఆర్ నగర్ లోని బాలసదన్ వయోవృద్ధుల భవనాన్ని పరిశీలించామని 75 లక్షలు మంజూరు అయ్యాయని పనులు పూర్తి చేస్తామని అన్నారు.
బీట్ బజార్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించామని దాదాపు 10వార్డుల ప్రజలకు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు, 30 వేల జనాభాకు మార్కెట్ ఉపయోగపడుతుందని మార్కెట్ నిర్మించామని అన్నారు.
జాతీయ రహదారి అధికారులు రహాదారిపై కూరగాయలు ఇతర ఆహారం అమ్మడం వల్ల ట్రాఫిక్ సమస్య రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని జాతీయ రహదారి అధికారులు గతంలోనే పలుమార్లు నోటీసులు జారీ చేశారని గుర్తు చేశారు.
బీట్ బజార్ మార్కెట్ రైతులు వ్యాపారులు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజాప్రతినిధులు అధికారులు కృషి తో మార్కెట్ విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో అర్ డి వో మధుసూదన్,మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య,ఈ ఈ లు శేఖర్ రెడ్డి,రహమాన్,కౌన్సిలర్ లు పిట్ట ధర్మరాజు, కుసరి అనిల్, శ్రీలత రామ్మోహన్ రావు, గుర్రం రాము, నరసమ్మ పవన్, మేక పద్మావతి పవన్, కోరే గంగమల్లు , డిఈ లు మిలీంద్,జలంధర్ రెడ్డి,రాజేశ్వర్,నాయకులు అహమ్మద్,గుమ్ముల అంజయ్య,శంకర్,అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బాలపెల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి

బీసీ బంద్ శాంతియుతంగా జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన

ఛత్తీస్‌ఘడ్‌లో 210 మంది నక్సల్స్ లొంగిపోవడం — రాజ్యాంగ ప్రతిని పట్టుకొని “హింసకు గుడ్‌బై” చెప్పారు

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

శ్రీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట - పాల్గొన్న -మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్

జస్టిస్ ఫర్ బీసీస్" బంద్ — నిజంగా న్యాయమా, లేక కొత్త రాజకీయ యజ్ఞమా?
.jpg)
బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు
