గురుపూజోత్సవం - గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమఃour Title

On
గురుపూజోత్సవం - గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమఃour Title

(శ్రీధర గణపతి శర్మ - 9849386786).

జగిత్యాల 05 సెప్టెంబర్ (ప్రజా మంటలు) : 

మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ అతను ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే వుంటాడు.

సమాజ నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండడం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమై పోయింది. ఇది ఎంతైనా గర్వించదగ్గ విషయం. ఇది సర్వత్రా వాంఛనీయం.

ఈ సందర్భంలో ఉపాధ్యాయవృత్తికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కాస్తంత తెలుసుకుందాం..! రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888వ సంవత్సరం సెప్టెంబర్ ఐదో తేదీన జన్మించారు. పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా ఎమ్.ఎ. విద్యాభ్యాసంలో థీసిస్‌గా "ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత"ను తన 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి రాధాకృష్ణన్. 

 అనంతరకాలంలో ఆయన అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే పలు మతాల తత్వసారాన్ని ఆకళింపు చేసుకున్నారు. రాధాకృష్ణన్ రచనల్లో ఒకటైన "ఇండియన్ ఫిలాసఫీ" భారతీయ తత్వశాస్త్ర వినీలాకశంలో ధృవతారగా నిలిచిపోయింది. విదేశాలలో తాను చేసిన తత్వ శాస్త్ర సంబంధిత ప్రసంగాలలో భారతదేశానికి స్వాతంత్ర్యం రావల్సిన ఆవశ్యకతను ప్రస్తావించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌ పదవిని చేపట్టిన ఆయన విశ్వవిద్యాలయాన్ని సంక్షోభంలోంచి బయటపడేశారు.

 దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలను నిర్వహించిన రాధాకృష్ణన్... విద్యా రంగంలో పలు నిర్ణయాత్మక సంస్కరణలకు మార్గదర్శకులయ్యారు. తన అనిర్వచనీయమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారత రత్న పురస్కారం ఆయనను వరించింది. 1962వ సంవత్సరంలో దేశంలో అత్యుత్తమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. పదవిలో ఉన్న ఐదు సంవత్సరాలలో తలెత్తిన సంక్షోభాలకు తనదైన శైలిలో పరిష్కారం చూపారు.

ఇదే సందర్భంలో కొంతమంది శిష్యులు మరియు మిత్రులు... రాధాకృష్ణన్ పుట్టిన రోజును జరిపేందుకు ఆయన వద్దకు వచ్చారట. అప్పుడు ఆయన మాట్లాడుతూ.. "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే తానెంతగానో గర్విస్తాన"ని చెప్పారట. ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తిపై తన ప్రేమను చాటుకున్న రాధాకృష్ణన్ కోరిక మేరకే ఆనాటి నుంచి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో "ఉపాధ్యాయ దినోత్సవం"గా జరుపుకుంటున్నాం.

విద్యార్ధి సంఘానికి "దేహం" వంటివాడైతే ఉపాధ్యాయుడు "ఆత్మ". అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి యేటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్ధుల మీదే కాదు, సమాజం మీద కూడ ఉంది.

Tags
Join WhatsApp

More News...

Local News 

చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్

చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్ చౌలామద్ది డిసెంబర్ 15 (ప్రజా మంటలు): ఈరోజు జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌలామద్ది గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, తుల గంగవ్వ స్మారక ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని...
Read More...
State News 

గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత 

గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత  సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ మెడికల్‌ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్‌ఓడీ డా. జి. రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. గాంధీ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థినిగా, అదే కళాశాలలో సేవలందించి పదవీ విరమణ పొందారు. నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్...
Read More...

తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.  జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై  ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు....
Read More...

ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బలపరిచిన 70 మంది సర్పంచులు మరియు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందగా 65 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులను...
Read More...
Local News 

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే...గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే...గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  గొల్లపల్లి డిసెంబర్ 15 (ప్రజా మంటలు :అంకం భూమయ్య) గొల్లపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ  ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆవుల జమున సత్యం (ఉంగరం గుర్తు) ఓటు వేసి గెలిపించాలని కోరారు.సత్యం వెనుక బిఆర్ఎస్ పార్టీ, కొప్పుల ఈశ్వర్, కెటిఆర్,...
Read More...
Local News  State News 

సామాజిక తెలంగాణయే నా ధ్యేయం.. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: X "ఆస్క్ కవిత"లో కల్వకుంట్ల కవిత

సామాజిక తెలంగాణయే నా ధ్యేయం.. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: X హైదరాబాద్, డిసెంబర్ 15 (ప్రజా మంటలు): సామాజిక తెలంగాణ సాధననే తన ప్రధాన లక్ష్యంగా తీసుకున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో జాగృతి పోటీలో ఉంటుందని వెల్లడించారు. సోమవారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిర్వహించిన #AskKavitha కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఈ ఇంటరాక్షన్...
Read More...
State News 

వావ్...దంపతులిద్దరూ గెలిచారు... ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి..

వావ్...దంపతులిద్దరూ గెలిచారు... ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి.. సికింద్రాబాద్,  డిసెంబర్ 15 (ప్రజా మంటలు):  పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోచమ్మల ప్రవీణ్(8వ వార్డు) మంజుల (10వ వార్డు) దంపతులు ఇద్దరు వేర్వేరు వార్డుల్లో పోటీ చేశారు. చిత్రం ఏమిటంటే ఇద్దరికి 98-98 ఓట్లు చొప్పున  వచ్చాయి.   కాగా ప్రవీణ్ రామన్నపేట---...
Read More...
Local News 

పాషం భాస్కర్ మృతిపై జి. రాజేశం గౌడ్ సంతాపం

పాషం భాస్కర్ మృతిపై జి. రాజేశం గౌడ్ సంతాపం ఇబ్రహీంపట్నం డిసెంబర్ 15 (ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్‌, మండల అధ్యక్షుడిగా సేవలందించిన పాషం భాస్కర్ గారు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మారింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్  తన భార్య  శ్యామలాదేవితో కలిసి పాషం...
Read More...
State News 

కవితమ్మపై తప్పుడు ప్రచారం ఆపాలి.. నిరాధార ఆరోపణలకు తీవ్ర పరిణామాలు: తెలంగాణ జాగృతి నేతలు

కవితమ్మపై తప్పుడు ప్రచారం ఆపాలి.. నిరాధార ఆరోపణలకు తీవ్ర పరిణామాలు: తెలంగాణ జాగృతి నేతలు హైదరాబాద్ డిసెంబర్ 15. (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మపై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం జరుగుతోందని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ ఆరోపించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. వి. ప్రకాష్ అనే వ్యక్తి...
Read More...

మోతే గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులను అభినందించి సత్కరించిన డా .భోగ శ్రావణి ప్రవీణ్

మోతే గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులను అభినందించి సత్కరించిన డా .భోగ శ్రావణి ప్రవీణ్ జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)మోతే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్లుగా గెలుపొందిన పల్లెకొండ రాజేశ్వరి-ప్రశాంత్ , ధనపనేని నరేష్  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రాంరెడ్డి, సునీల్,ప్రశాంత్ మరియు...
Read More...

పొలాస గ్రామపంచాయతీ నూతన ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులను సత్కరించిన డా భోగ శ్రావణి

పొలాస గ్రామపంచాయతీ నూతన ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులను సత్కరించిన డా భోగ శ్రావణి    జగిత్యాల రూరల్ డిసెంబర్ 15(ప్రజా మంటలు)  మండలం పొలాస గ్రామం నూతన ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ గెలుపొందగా ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలువగా గెలుపొందిన ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిల్కూరి...
Read More...
National  State News  International  

భారత మార్కెట్‌లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్

భారత మార్కెట్‌లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్ న్యూఢిల్లీ డిసెంబర్ 14:భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్–యూకే మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు పెంచడంతో పాటు సేవలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. 2026 నుంచి (అనుమతులకు లోబడి) లండన్ హీత్రో – న్యూఢిల్లీ మార్గంలో మూడో డైలీ...
Read More...