జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులు గ్రామ పంచాయతీకి వచ్చి నోటీసులు పొందండి - ప్రశ్నించిన రైతు ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ ?
జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులు గ్రామ పంచాయతీకి వచ్చి నోటీసులు పొందండి - ప్రశ్నించిన రైతు ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ ?
జగిత్యాల రూరల్ /కల్లెడ జూలై 27 (ప్రజా మంటలు)
జగిత్యాల మండలం కల్లెడ గ్రామానికి చెందిన రైతుల భూములు నేషనల్ హైవే లో కోల్పోతుండగా సదరు రైతులకు తగిన సమాచారం ఇచ్చి, వారితో సంప్రదింపులు జరపాల్సిన అధికారులునిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు కల్లెడ గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు.
జాతీయ రహదారి కొరకు భూములను సేకరించడానికి గుర్తించిన భూమి యజమాని రైతుకు నేరుగా నోటీసులు ఇవ్వకుండా, నోటీసులను స్థానికంగా ఉండే వాట్సాప్ గ్రూపులో సమాచారం ఇచ్చి, గ్రామ పంచాయతీకి వచ్చి భూములు కోల్పోయే రైతులు తమ నోటీసులు పొందాలని మెసేజ్ ను పంపి అధికారులు చేతులు దులుపుకున్నారని ట్విట్టర్ (X) lo ప్రశ్నించిన రైతు తిరుపతిరెడ్డి, తన అకౌంట్ నే అధికారులు మూయించినట్లు ఆయన తెలిపారు.
కల్లేడ గ్రామానికి చెందిన రైతు సామ తిరుపతిరెడ్డి నోటీసుల విషయంపై రూరల్ తాసిల్దార్ ను ఫోన్లో సంప్రదించగా సిబ్బంది లేకపోవడంతో వాట్సాప్ లో సమాచారం ఇవ్వడం జరిగిందని తహసిల్దార్ జవాబు ఇచ్చినట్లు తిరుపతిరెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి భూములు కోల్పోతున్న రైతులను ప్రత్యక్షంగా కలిసి, వారిని సంప్రదించి, భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ రైతులను అవమానించే విధంగా వ్యవహరించడం సరికాదని తిరుపతి రెడ్డి అన్నారు.
గతంలో సైతం తమ గ్రామానికి సంబంధించిన సమస్యలను ట్విట్టర్ ద్వారా అప్పటి కలెక్టర్కు పలుమార్లు సమస్యలను ఏకరువు పెట్టడం జరిగిందని, దాని పర్యవసానం తన ట్విట్టర్ అకౌంట్ ని అధికారులు బ్లాక్ చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా రెవెన్యూ సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో భూములు కోల్పోతున్న రైతులను స్వయంగా కలిసి సంప్రదింపుల ప్రక్రియ జరిపి నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శబరిమల పర్యటనలో చారిత్రాత్మక ప్రతిధ్వని:- రెండవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమలసన్నిధాన
.jpg)
కేరళలో రాష్ట్రపతి హెలికాప్టర్ ఇబ్బందుల్లో – శబరిమల పర్యటన సురక్షితంగా ముగిసింది

కొద్దిగా తగ్గిన బంగారం ధర - బలపడ్డ డాలర్

పారిస్ లూావ్రే మ్యూజియం లో 900 కోట్ల రూపాయల దొంగతనం
.jpeg)
సదర్ ఉత్సవ్ మేళా - ట్రాఫిక్ మళ్లింపు
.jpg)
ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని
.jpg)
ఏపీకి వాయుగుండం ముప్పు! - ఆరెంజ్ హెచ్చరిక
.jpeg)
అమెరికా వ్యవసాయ రంగంలో కూలీల కొరత సమస్య

సిటీలో కన్నుల పండువగా దీపావళి సెలబ్రేషన్స్

సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో దీపావళి సమ్మేళనం, వస్త్రాల పంపిణీ.

మహిళా అభ్యర్థికి మాల వేసిన నితీశ్ కుమార్ – మానసిక స్థితిపై చర్చ మళ్లీ మొదలు

భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బండి సంజయ్
