పదవి విరమణ పొందిన దేవాదాయ అధికారికి ఆత్మీయ సత్కారం

On
పదవి విరమణ పొందిన దేవాదాయ అధికారికి ఆత్మీయ సత్కారం

పదవి విరమణ పొందిన దేవాదాయ అధికారికి ఆత్మీయ సత్కారం

జగిత్యాల జులై 6 (ప్రజా మంటలు) :
ఇటీవల దేవాదాయ ధర్మదాయ శాఖలో ఈవోగా పనిచేసి పదవి విరమణ పొందిన ధర్మపురి వాస్తవ్యులు పణతుల వేణుగోపాల్ ను శనివారం బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రమ దంపతులను స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ పెద్దలు, హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం పాల్గొన్నారు. తన విధి నిర్వహణలో సహకరించిన అందరికీ వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బ్రాహ్మణ ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు.
Tags