ఎమ్మెల్సీ జీవనరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా యోచన? ఎమ్మెల్యే సంజయ్ చేరిక పట్ల కినుకు
ఎమ్మెల్సీ జీవనరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా యోచన? ఎమ్మెల్యే సంజయ్ చేరిక పట్ల కినుకు
జగిత్యాల జూన్ 24:
జగిత్యాల రాజకీయాలలో అనుకోని మలుపులు తిరిగి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
జగిత్యాల శాసనసభ్యుడిగా గత ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి ముందు తనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో కొత్తవారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల జీవన్ రెడ్డి మనస్థాపం చెందినట్లు తెలుస్తుంది.
ఈరోజు ఉదయం నుండి కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నాయకులతో ఫోన్లో సంప్రదించిన జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆయన అనుచర వర్గం తెలిపింది.హైదారాబాద్ లోని సీనియర్ నాయకులు కొంత కాలం ఓపిక పట్టమని సలహా ఇచ్చినట్లు, ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల ఒనగూరే లాభం ఏమి లేదని చెప్పినట్లు తెలుస్తుంది.
ఈరోజు ఉదయం నుండి జగిత్యాల లోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చిస్తున్న జీవన్ రెడ్డి తన భవిష్యత్తు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రకటిస్తారని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను హఠాత్తుగా పార్టీలోకి ఆహ్వానించడానికి ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు.
గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న జీవన్ రెడ్డి. గతంలో మంత్రిగా కొనసాగారు. జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన జీవన్ రెడ్డి ని కాదని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించడం స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో జీవన్ రెడ్డి పై పోటీ చేసి గెలిచిన సంజయ్ కుమార్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం వల్ల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎటు తోచని దుస్థితిలో ఉన్నారు.
అలాగే టిఆర్ఎస్ పార్టీలోని చిన్న నాయకులు కార్యకర్తలు పార్టీలో తమ భవిష్యత్తు ఏమిటా అని జిల్లాలో జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో తమకు నాయకత్వం కొరబడిందని, రాజకీయ భవిష్యత్తు అంధకారం అయిపోతుందేమోనని దిగులు పడుతున్నారు.
జీవన్ రెడ్డి ప్రకటించబోయే నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని, ఇన్నాళ్లుగా బిజెపి, బీఆర్ఎస్ పార్టీలతో పోటీపడి జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ఆయన రాబోయే రోజులలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని అన్ని వర్గాల వారు చర్చించుకుంటున్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
