మహిళల భద్రత మరియు రక్షణకి షీ టీమ్స్ తో మరింత భరోసా.
మహిళలు,విద్యార్థినులు ఆపద సమయంలో జిల్లా షీ టీమ్ నెంబర్ 8712670783 ద్వారా పిర్యాదు చేయవచ్చు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల రూరల్ జూన్ 19 (ప్రజా మంటలు)
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం కండ్లపల్లి మోడల్ స్కూల్ లో షీ టీం, ఏ హెచ్ టి యు టీమ్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
మహిళలు, బాలికల, విద్యార్థిని విద్యార్థుల రక్షణకు పోలీస్ శాఖ తరఫున షీ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు షీ టీం ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తునట్లు తెలిపారు.
షీ టీమ్ సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని లేదా 8712670783 వాట్సప్ ద్వారా కూడా పిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. మహిళలు, బాలికలపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టే సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్, షీ టీమ్ సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు.
జిల్లా పరిధిలో పాఠశాలలు/కళాశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు ఇద్దరి చొప్పున విద్యార్థినులకు సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్,ఆకతాయిల వేధింపులను అరికట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.
ఆపదలో ఉన్న మహిళలు బాలికలు విద్యార్థిని విద్యార్థులు వెంటనే జిల్లా షీ టీం ఫోన్ నెంబర్ 8712670783 కి కాల్ చేసిన కాని, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి వెంటనే షీ టీమ్స్ సహాయం పొదలని తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమంలో ఏ ఎస్ఐ ఉమెన్ కానిస్టేబుల్ లు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
