గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.
జూన్ 8 ( ప్రజా మంటలు)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ , గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష చీఫ్ సూపరిండెంట్ అరిగెల అశోక్ తెలిపారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
పరీక్షకు సంబంధించి ఇన్విజిలేటర్లకు శిక్షణ తరగతులు శనివారం నిర్వహించారు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఏవైనా సమస్యలు తలెత్తితే చర్యలు తప్పవని ఆదేశించారు. అభ్యర్థులు కూడా ఉదయం 10 గంటలకు గంట ముందుగానే సెంటర్ కి చేరుకోవాలని నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని పేర్కొన్నారు.
ఎటువంటి ఎలక్ట్రానిక్ మరియు నిషేధిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని, అభ్యర్థులు హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నులతో మాత్రమే పరీక్షకు హాజరవ్వాలని చీఫ్ సూపరిండెంట్ , కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరిగెల అశోక్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అబ్జర్వర్ డాక్టర్ పడాల తిరుపతి, డిపార్ట్మెంట్ ఆఫీసర్ డాక్టర్ బోనగిరి నరేష్, ఇన్విజిలేటర్లు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్‌లో కాల్పులతో దోపిడీ – 5 మంది నిందితుల కోసం 12 బృందాల గాలింపు
కరీంనగర్ మే 03 (ప్రజా మంటలు):
కరీంనగర్ జ్యోతినగర్‌లోని PMJ జ్యువెలరీ షాప్‌లో పట్టపగలే సంచలన దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు తుపాకులతో షాప్‌లోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి, భారీగా బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి... కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక
హైదరాబాద్, మే 03 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.కవిత గారిపై కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను... డీసీపీవో హరీష్‌పై కఠిన చర్య – సేవల నుంచి తొలగింపు
జగిత్యాల, మే 02 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా డీసీపీవో ఎం. హరీష్‌ను సేవల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగం, మహిళా ఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు వంటి ఆరోపణలు ఆయనపై నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ అంశాలపై గతంలోనే హరీష్‌కు... సురభి గోశాల, తాటిపల్లిలో భక్తిశ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు
జగిత్యాల మే1(ప్రజా మంటలు)సురభి గోశాలలో నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం విజయవంతంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ముగిసింది. 11 మంది దంపతులు కలసి, ఒకే సంకల్పంతో, ఒకే భక్తితో వ్రతం నిర్వహించడం చూడటం నిజంగా హృదయానికి హత్తుకునే అనుభూతనీ నిర్వాహకులు అన్నారు.
మొదట గోమాతకు పూజలు చేసి, అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముని... సర్వోదయ తెలంగాణ” – ఉచిత విద్య, వైద్యం, 4 లక్షల ఉద్యోగాల హామీ!
హైదరాబాద్ మే 02 (ప్రజా మంటలు):
తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా “తెలంగాణ రక్షణ సేన”ను ప్రారంభించిన కల్వకుంట్ల కవిత, సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై పోరాటం చేస్తామని మీట్ ది ప్రెస్ లో
తెలిపారు.
“సర్వోదయ తెలంగాణ కోసం పాంచజన్యం మార్గంలో... ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవగ్రహ పూజా అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో... కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం
కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్... సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.రఘురాం జగిత్యాలకు చెందిన బండి... ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత... ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)
పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థలు మరోసారి తమ ప్రతిభను చాటుకుంటూ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించాయి.
ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి లో 591, 590 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా... పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి ఏప్రిల్ 28 (ప్రజా మంటలు)
రానున్న 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై టెంపుల్ మాస్టర్... 