కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

On
కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం
జిల్లా పంచాయతీలో అడ్డగోలుగా అధికార దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన
పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు

నిఘా విభాగం అధికారులతో పునర్విచారణ జరిపించాలని కోరిన చుక్క గంగారెడ్డి 

బుగ్గారం జిపి పాలక వర్గంపై చర్యలు తీసుకోవాలని విన్నపం


బుగ్గారం/ జగిత్యాల జిల్లా: 

 ప్రజా పిర్యాదులపై జిల్లా కలెక్టర్ లు సకాలంలో సరైన చర్యలు చేపట్టక, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే గ్రామ పంచాయతీలలో నిధుల దుర్వినియోగం భారీగా జరిగిపోయిందని ప్రముఖ ఉద్యమకారుడు, ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి ఆరోపించారు. ఆయన చేసిన పిర్యాదులపై 
 హైదారాబాద్ లోని లోకాయుక్త (కోర్టు) లో గురువారం విచారణ జరిగింది. బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగంలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, వారి బాధ్యతలను, అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసి, చట్టాలను కూడా ఉల్లంఘించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, కఠినంగా శిక్షించాలని చుక్క గంగారెడ్డి లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.
దుర్వినియోగం నుండి రికవరీ అయిన సొమ్మును కూడా అధికారులు లెక్కల్లో సరిగా చూపెట్టలేదన్నారు. లక్షల్లో రికవరీ సొమ్మును రికార్డులలో నమోదు చేయకుండా దాచి ఉంచారని ఆయన ఆరోపించారు.
అనేక పిర్యాదులతో పాటు 2022 సెప్టెంబర్ 21న లోకాయుక్త కు కూడా పిర్యాదులు చేయగా జిల్లా పంచాయతీ అధికారి నామ మాత్రంగా గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా ను, సర్పంచ్ మూల సుమలత ను చివరి దశలో అనగా గత 2024 జనవరి మాసంలో సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆయన తెలిపారు. తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఆధారాలతో సహా మేము చేసిన పిర్యాదులపై కూడా సరైన విధంగా విచారణ చేపట్టక పోవడం చాలా బాధాకరంగా, చాలా అనుమానాస్పదంగా ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి – అక్రమాల వల్లే ఇలా జరిగి ఉంటుందని గ్రామ ప్రజలు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


1)    మేము ఎన్ని పిర్యాదులు చేసినా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు సరైన విధంగా స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా నిర్లక్యంగా వ్యవహరించారని, మా పిర్యాదులు సరిగా పట్టించుకోలేదన్నారు. అందుకే లోకాయుక్త ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

2)    జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారులుగా పనిచేసిన వేముల శేఖర్, ప్రభాకర్, హరి కిషన్, నరేష్ లతో పాటు ప్రస్తుత డిపిఓ దేవరాజ్ కూడా అన్నీ విషయాలు తెలిసినా, నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయని ఆధారాలు లభించినా…  కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా, విధుల్లో, వారి బాధ్యతల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. నిధుల దుర్వినియోగం ఋజువు అయినప్పటికీ వీరంతా వారి - వారి పాలనా సమయంలో చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అధికారులంతా చట్టాలను ఉల్లంఘించారని, వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.

3)    జగిత్యాల, మెట్ పల్లి - డీఎల్ పీవోలు కనక దుర్గ, శ్రీనివాస్ లు వేర్వేరు గా నిధుల దుర్వినియోగం పై ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు సార్లు తూ.. తూ… మంత్రంగా విచారణ చేపట్టారని అన్నారు. పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో.. ప్రజల్లో… సరైన విచారణ జరుపలేదన్నారు. దుర్వినియోగానికి పాల్పడ్డ పాలకులతో కుమ్మక్కై వారికే కొమ్ము కాశారని,  వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పటికీనీ… నిధుల దుర్వినియోగాన్ని, వాస్తవాలను పూర్తిగా కప్పి పుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ విచారణకు భిన్నంగా తప్పుడు విచారణ నివేదికలు అందజేసి ఉన్నతాధికారులను నమ్మించి, తప్పు దోవ పట్టించారని పేర్కొన్నారు. వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారన్నారు.

4)    మిషన్ భగీరథ లో పని చేస్తున్న ఆర్ డబ్లూ ఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ వివేక్ అలియాస్ వివేకానంద కూడా బుగ్గారంలో చేయని పనులకు కూడా పనులు చేసినట్లు, బిల్లులు చెల్లించిన పురాతన పనులనే మళ్ళీ రికార్డులలో చూపెట్టి కొత్తగా పనులు చేసినట్లు తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు సృష్టించారని ఆరోపించారు. పంచాయతీ పాలక వర్గానికి అనుకూలంగా ఇష్టమొచ్చినట్లు రికార్డులను
తయారు చేసి అందజేస్తూ నిధుల దుర్వినియోగానికి, దోపిడీకి సహకరించారని వివరించారు. బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ధర్మపురి నియోజక వర్గంలోని అనేక గ్రామాలలో కూడా తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు అందజేసి భారీగా నిధుల దుర్వినియోగానికి సహకరించారనే ఆరోపణలు కూడా వివేక్ అలియాస్ వివేకానంద పై కో – కొల్లలుగా ఉన్నాయన్నారు. సరైన విచారణ జరిపిస్తే కోట్లాది రూపాయల దుర్వినియోగం బయటపడే అవకాశం ఉందన్నారు.

5)    జిపిపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాల్సిన బుగ్గారం మండల పంచాయతీ అధికారి అఫ్జల్ తన విధులను, అత్యంత విలువైన తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, చట్టాలను ఉల్లంఘించి, ఈ – పంచాయతీ ఆపరేటర్ జీతం పేరును సాకుగా వాడుకొని  బుగ్గారం జిపితో పాటు మండలంలోని మరో పది గ్రామ పంచాయతీల నుండి సుమారు రూ.22 లక్షలకు పైగా నిధులు తన ఖాతాల్లోకి మల్లించుకొని భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.

6)    జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా జిల్లా పంచాయతీ అధికారి, మండల పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్  అధికారులు సమాచార హక్కు చట్టం -2005 ను కూడా ఉల్లంఘించారని వివరించారు. సమాచార కమీషన్ జారీ చేసిన 18 ఫిర్యాదులపై ఆర్డర్లను, మరో 60 వరకు ఆర్టీఐ దరఖాస్తులను, అప్పీల్లను కూడా బే-ఖాతరు చేశారన్నారు. ఏండ్లు గడుస్తున్నా నేటికీ కోరిన సమాచారం ఇవ్వడం లేదన్నారు.

7)     గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా బుగ్గారం జి.పి.లో భారీగా నిధుల దుర్వినియోగం చేయడమే కాకుండా, జి.పి.లో రికార్డులు కూడా దొరుకకుండా మాయం చేసి ఏండ్లు గడుస్తున్నా అధికారులు, ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అనేక పిర్యాదుల మేరకు కేవలం నామ మాత్రంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు తప్పా…. మహబూబ్ పాషా నుండి నేటికీ రికార్డులు స్వాధీనం చేసుకోలేదన్నారు. లక్షల్లో ఉన్న దుర్వినియోగం సొమ్ము కూడా నేటికీ రికవరీ చేయలేదన్నారు.

8)    రెండో పంచాయతీ కార్యదర్శి నరేందర్ కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడి సుమారు రూ.70 వేల వరకు రికవరీ కూడా చెల్లించాడన్నారు. మరిన్ని నిధులు కూడా ఆయన నుండి రికవరీ కావలసి ఉందని తెలిసిందన్నారు. బుగ్గారం జి.పి.లో ఆయన అనేక అవినీతి -అక్రమాలకు పాల్పడ్డారని,  పాలక వర్గం చేసిన భారీ నిధుల దుర్వినియోగం లో కూడా ఆయన పాత్ర  అత్యంత కీలకంగా ఉందన్నారు. అయినా అధికారులు కార్యదర్శి నరేందర్ పై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోషనీయం అన్నారు.

9)    బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత, ఆమె భర్త మూల శ్రీనివాస్ గౌడ్ లతో పాటు ఉప సర్పంచ్, పాలక వర్గంలోని కొందరు వార్డ్ సభ్యులు కుమ్మక్కై మూకుమ్మడిగా భారీ గా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సుమారు కోటి రూపాయలకు పైగానే నిధులు దుర్వినియోగం జరిగి ఉంటాయని గ్రామ ప్రజలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

10)     ఇలాంటి అనేక సందర్భాలను బట్టి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు మేము లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా పిర్యాదులు చేసి, పత్రికా ప్రకటనలు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. అయినా అధికారులు, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని తెలిపారు .

11)     వీటన్నిటికీ కారణం రాజకీయ ఒత్తిళ్లతో పాటు భారీ మొత్తంలో అవినీతి – అక్రమాలు కూడా జరిగి ఉండొచ్చని మాకు అనుమానంగా ఉందన్నారు.


 నేటితో నాలుగు పర్యాయాలు తమరి సన్నిధికి అందజేసిన మా పిర్యాదు లను, ఆధారాలను పరిగణనలోకి తీసుకొని వీటన్నింటిపై ప్రత్యేక నిఘా విభాగం ఉన్నతాధికారులచే తగు విచారణ జరిపించాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త ను కోరారు. 

జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఐదుగురు జిల్లా పంచాయతీ అధికారులు, ఇద్దరు డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టరేట్, జిల్లా పంచాయతీ ఆపీస్, మండల పంచాయతీ కార్యాలయాల పౌర సమాచార అధికారులపై, అప్పిలేట్ అధికారులపై, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎ.ఇ. వివేక్, ఎంపీఓ అఫ్జల్, పంచాయతీ కార్యదర్శులు మహబూబ్ పాషా, నరేందర్ లపై, సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గంలోని వార్డు సభ్యుల పై, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన ఇతర వ్యక్తు లంద రిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శిక్షించాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
 
అలాగే దుర్వినియోగం అయిన బుగ్గారం గ్రామపంచాయతీ నిధులన్నీ రికవరీ చేయించి ప్రజా సొమ్మును కాపాడాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

TG EAPCET – 2026 ఫలితాలలో జ్యోతి పూర్వ విద్యార్థుల ఘన విజయం

TG EAPCET – 2026 ఫలితాలలో జ్యోతి పూర్వ విద్యార్థుల ఘన విజయం జగిత్యాల మే 17 (ప్రజా మంటలు)ఆదివారం విడుదల అయిన TG EAPCET – 2026 ఫలితాలలో JYOTHI HIGH SCHOOL IIT ACADEMY పూర్వ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి సంస్థ ఖ్యాతిని మరింత పెంచారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను సంస్థ...
Read More...
State News 

నీతి, నిజాయితీకి మారుపేరు డాక్టర్ జస్టిస్ జి. చంద్రయ్యకు నివాళులు: మాజీ మంత్రి రాజేశం గౌడ్

నీతి, నిజాయితీకి మారుపేరు డాక్టర్ జస్టిస్ జి. చంద్రయ్యకు నివాళులు: మాజీ మంత్రి రాజేశం గౌడ్ హైదరాబాద్, మే 16 (ప్రజా మంటలు): విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ జస్టిస్ జి. చంద్రయ్య అకాల మరణం బాధాకరమని మాజీ సీనియర్ మంత్రి గొడిశెల రాజేశం గౌడ్, మాజీ న్యాయమూర్తి నవ మోహన్ రావు, పాత్రికేయులు ప్రభాకర్ రావు, ఎల్జేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మినేని వికాస్...
Read More...
Local News  State News 

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల మే 15 ( ప్రజా మంటలు) :  ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో విద్యాశాఖ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ – జగిత్యాల ఆధ్వర్యంలో ఓల్డ్ బస్ స్టాండ్ జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
Read More...
State News 

తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం పైలాన్ వేరే చోటుకు మార్చాలని బ్రాహ్మణ సంఘం చే నిరసన.

తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం పైలాన్ వేరే చోటుకు మార్చాలని బ్రాహ్మణ సంఘం చే నిరసన. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). ఖమ్మం మే 15 (ప్రజా మంటలు) :  నగరంలో లకారం ట్యాంక్ బండ్ సెంటర్లో భారత మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భముగా ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహము. ప్రాంతంలో తుమ్మల నాగేశ్వరరావు 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో చేసినటువంటి కార్యక్రమాల...
Read More...
Local News 

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణులు సద్వినియోగపరచుకోవాలి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణులు సద్వినియోగపరచుకోవాలి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బండ్లగూడ, నాగోల్ మే 14(ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పథకాలను బ్రాహ్మణ సద్వినియోగపరచుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవి బాధ్యతల స్వీకరణ ఉత్సవం గురువారం బండ్లగూడ, నాగోల్...
Read More...
Comment  State News 

“తెలంగాణ దళిత సాహిత్య చరిత్రను విస్మరించొద్దు” :బి.ఎస్. రాములు బహిరంగ లేఖ..

 “తెలంగాణ దళిత సాహిత్య చరిత్రను విస్మరించొద్దు” :బి.ఎస్. రాములు బహిరంగ లేఖ.. హైదరాబాద్ మే 14 (ప్రజా మంటలు):తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురిస్తున్న పునాస ఎప్రిల్-జూన్ 2026 సంచికలో ప్రచురితమైన “తెలుగు సాహిత్యంలో అంబేద్కర్ ప్రభావం” వ్యాసంపై ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత, బీసీ కమీషన్ తొలి చైర్మన్  బి.ఎస్. రాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కోయి కోటేశ్వరరావుకు బహిరంగ లేఖ రాశారు....
Read More...
State News 

బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలి: కవిత

బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలి: కవిత హైదరాబాద్ మే 13 (ప్రజా మంటలు):     కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని, ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.బుధవారం...
Read More...
Local News 

కొండగట్టు అంజన్న భక్తులకు ఎం ఎస్ ఆర్ డి ఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

కొండగట్టు అంజన్న భక్తులకు ఎం ఎస్ ఆర్ డి ఎఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కొండగట్టు మే 12 ( ప్రజా మంటలు)హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకుని కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తుల సౌకర్యార్థం మ స్పోర్ట్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్* ( ఎం ఎస్ ఆర్ డి ఎఫ్) ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ సేవా కార్యక్రమం నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు అరటి...
Read More...
Spiritual   State News 

కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొండగట్టు, మే 11 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్న మంత్రి, అంజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి...
Read More...
Local News 

ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డి ఎస్పీ పురుషోత్తం రెడ్డి 

ట్రై సైకిల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, డి ఎస్పీ పురుషోత్తం రెడ్డి  జగిత్యాల మే 10 (ప్రజా మంటలు) రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో, ఆపి ప్రైవేంటివ్ హెల్త్ క్లినిక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్ ను అందజేసే కార్యక్రమం జరిగింది.    జిల్లా కేంద్రంలోని పావని కంటి హాస్పిటల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జగిత్యాల పూర్వ అధ్యక్షుడు,  శాసన...
Read More...
Local News 

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు కొండగట్టు మే 10 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో  హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. విశేష సంఖ్యలో భక్తుల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.   హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వైదిక...
Read More...
Local News 

విద్యార్థులకు  బాల్యం నుండే సంస్కారాన్ని అందించాలి. ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ

విద్యార్థులకు  బాల్యం నుండే సంస్కారాన్ని అందించాలి.  ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ    జగిత్యాల మే 10 (ప్రజా మంటలు  ) విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని కూడా బాల్యం నుండే అలవాటు చేయాలని ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక్ ప్రముఖ కొంగరి సాయి కృష్ణ అన్నారు. సేవా భారతి, గీతా విద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల ఒకటి నుండి పది రోజులపాటు నిర్వహించిన సంస్కార సాధన వర్గ ముగింపు సమావేశం ఆదివారం గీతా...
Read More...