నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరోసారి సారి కమలవికాసం...

On
నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరోసారి సారి కమలవికాసం...

నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మరోసారి సారి కమల వికాసం...

కార్యకర్తలు శ్రమ వెలకట్టలేనిది..డాక్టర్ బోగ శ్రావణి
జగిత్యాల జూన్ 5 (ప్రజా మంటలు) :
భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులుగా రెండోసారి ధర్మపురి అరవింద్ ఎన్నికైన సందర్భంగా మరియు  భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 8 సీట్లు సాధించిన సందర్భంగా బుధవారం జగిత్యాల నియోజకవర్గం ఆధ్వర్యంలో జగిత్యాల్ పట్టణంలో స్థానిక తాసిల్ చౌరస్తా వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి మరియు జగిత్యాల జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు

ఈ సందర్భంగా డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ....

నరేంద్రమోదీ ని ఆశీర్వదిస్తూ ధర్మపురి అరవింద ని  మరోసారి భారీ మెజారిటీతో ఎంపీగా గెలిపించిన పార్లమెంట్ ప్రజలకు మరియు ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలన్నారు

పార్లమెంట్ మొత్తంగా జగిత్యాల నియోజకవర్గంలో కూడా ఈసారి మహిళలు ఎక్కువగా ఓటింగ్ పక్రియలో పాల్గొన్నారు,
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన "నారీ శక్తి వందన్" బిల్లుకి అభినందన గా వారు పెద్ద ఎత్తున ఆశీర్వదించారని పేర్కొన్నారు.

వారికి యువత కూడా పెద్ద ఎత్తున బిజెపి వైపు మొగ్గు చూపడం జరిగిందిన్నారు.

అరవింద్ అన్న మాట ప్రకారం పసుపు బోర్డు తీసుకొని వచ్చారు వారి కృతజ్ఞతని ఓట్ల రూపంలో అందించి ఆశీర్వదించారు, పార్లమెంట్ మొత్తంలో పెద్ద ఎత్తున రైతులు అరవింద్ అన్నకి మద్దతు ఇచ్చారు

జగిత్యాల నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే ఎలక్షన్లో 43,000 వేల ఓట్లు అందించారు ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 75 వేల ఓట్లకు చేరింది అంటే బిజెపి జగిత్యాల నియోజకవర్గంలో బలపడుతూ ప్రజల ఆమోదాన్ని నమ్మకాన్ని కూడగట్టుకుంటుంది, మీ బిడ్డ భోగ శ్రావణి కి మీరు ఇచ్చిన ఈ మద్దతుకి బిజెపికి అందించిన ఆశీర్వాదాన్ని ఎప్పుడు మరువము అరవిందన్నతో తప్పకుండా జగిత్యాల అభివృద్ధి చేయించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు.

మీకు సదా రుణపడి ఉంటాం మీకు సేవ చేసుకుంటామన్నారు.

బూత్ సాయి కార్యకర్తల నుండి పదాధికారుల వరకు ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పార్టీకి అరవింద్ అన్నకి ఘన విజయాన్ని అందించారు వారందరికీ కృతజ్ఞతాభివందనాలు అన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల్ పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, రైతు నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిళ్ల సత్యనారాయణ,సారంగపూర్ మండల్ అధ్యక్షులు ఎండబెట్ల వరుణ్ కుమార్, జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, మహిళ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి,జిల్లా కార్యదర్శి బొడ్డు పెద్ద గంగన్న, జిల్లా కోశాధికారి సుంకేట దశరథ రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న,మహిళ మోర్చా పట్టణ అధ్యక్షులు మమత, మరియు పట్టణ మండల పదాధికారులు కార్యకర్తలు నాయకులు మహిళా మోర్చా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Tags