తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు

సౌకర్యాలు కల్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. - ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు

On
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల జిల్లా, జూన్ 02 (ప్రజా మంటలు): 

రాష్ట్ర రాజధాని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు 

జగిత్యాల జిల్లా నుండి ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమయ స్ఫూర్తితో స్పందించి జిల్లాలోని ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను గుర్తించి హైదారాబాద్ లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. వారికి తగిన ఏర్పాట్లు, వసతులు కల్పించారు.

జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజక వర్గాలకు వేర్వేరుగా బస్సులను, కార్లను, ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చులతోనే రవాణా సౌకర్యం కల్పించారు. అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, పరిపాలనాధికారి పుప్పాల హన్మంతరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు లు ఎప్పటి కప్పుడు ఏర్పాట్లను, రవాణా విషయాలను సందాన కర్తల ద్వారా తెలుసుంకుంటూ ఎలాంటి లోటు - పాట్లు జరుగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ప్రతి బస్సులో సందాన కర్తలను, సహాయకులను, ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించి సేవలు అందించారు. ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు అల్పాహారం, భోజన సౌకర్యాలు, త్రాగు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఉద్యమ కారులు సి.హెచ్.వి.ప్రభాకర్ రావు, చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మ, కంతి మోహన్ రెడ్డి ల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాలతో పాటు పట్టణాల, గ్రామాల నుండి సుమారు రెండు వందల మందికి పైగా ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను

రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలించారు.

కొందరు ఉద్యమకారులు వారంతట వారే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలి వెళ్లారు. ధర్మపురి లోని తహశీల్దార్ కార్యాలయం నుండి, జగిత్యాల లోని ఆర్డీవో కార్యాలయం నుండి, మెట్ పల్లి ఆర్డీవో కార్యాలయాల నుండి ఆదివారం ఉదయత్ పూర్వం 3-00 గంటలకు వాహనాల్లో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లారు.

ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు

ఆరు దశాబ్దాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనంతరం ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలన తర్వాత నూతన ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం రావడం ఆనందంగా ఉందని ఉద్యమ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ కారులను గుర్తించి వేడుకలకు ఆహ్వానం పలికిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కు, అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర కు, ఇతర అధికారులకు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ కారులకు ఇచ్చిన ఇదే గుర్తింపును ఎప్పటికీ కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ ఆకాంక్షలను, అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజక వర్గాల తో పాటు వివిధ మండలాల నుండి, పట్టణాల నుండి సుమారు 200 మందికి పైగా ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లినట్లు వారు వివరించారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం

హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు): ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్...
Read More...
Local News 

లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం

లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం గొల్లపల్లి, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో సోమవారం లయన్స్ క్లబ్ గొల్లపల్లి, లీడ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోటివేటివ్ స్పీకర్ కెప్టెన్ డా. లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డి విద్యార్థుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపారు....
Read More...
Local News  Spiritual  

అంగరంగ వైభవంగా బుగ్గారం పోచమ్మల జాతర – రథోత్సవం

అంగరంగ వైభవంగా బుగ్గారం పోచమ్మల జాతర – రథోత్సవం బుగ్గారం / గొల్లపల్లి ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం శ్రీ ముత్యాల పోచమ్మ – నల్ల పోచమ్మల జాతర, రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ జిల్లాలతో పాటు అంతర్‌రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తజనం తండోప తండాలుగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్...
Read More...

మొదటిరోజు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం 

మొదటిరోజు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం     జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)జిల్లాలో  సోమవారం 17 (జనరల్ మరియు ఒకేషనల్) పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో భాగంగా ఈరోజు జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు జరిగిన ప్రాక్టికల్ పరీక్షలలో ఉదయం 1409 మంది విద్యార్థులకు గాను 1312 మంది విద్యార్థులు హాజరైనారు. జనరల్ విభాగంలో...
Read More...

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు   ఫిర్యాదులను పరిశీలించిన  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం   ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 7గురు  అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్...
Read More...
State News 

పెట్టుబడుల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

పెట్టుబడుల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది పెట్టుబడులపై Fact Check (వివరాలు కింది టేబుల్ లో) కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం ఫోన్ ట్యాపింగ్ కేసు – పారదర్శక విచారణ జరగాలి హైదరాబాద్, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న వేల కోట్ల పెట్టుబడులు కట్టుకథలేనని తెలంగాణ జాగృతి...
Read More...
Local News  State News 

అభ్యర్థి మంచోడా చెడ్డోడా కాదు – ప్రజలకు ఉపయోగపడేవాడే ముఖ్యం : కవిత

అభ్యర్థి మంచోడా చెడ్డోడా కాదు – ప్రజలకు ఉపయోగపడేవాడే ముఖ్యం : కవిత మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు): మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి మంచోడైనా చెడ్డోడైనా కేసీఆర్ ను చూసి ఓటు వేయాలని కేటీఆర్ కోరుతున్నారని కవిత విమర్శించారు.ఇది బీఆర్ఎస్‌లోని రాజరిక, నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. ఈరోజు జాగృతి ఆఫీస్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ, కులం, మతం,...
Read More...

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-XII విజయవంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-XII విజయవంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జిల్లా లో 37 మoది బాల కార్మికులకు విముక్తి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 1 ప్రజా (మంటలు)బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి  సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా  ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం...
Read More...

44 వ వార్డులో బిజెపి అభ్యర్థికి మద్దతుగా డా. భోగ శ్రావణీ ప్రచారం 

44 వ వార్డులో బిజెపి అభ్యర్థికి మద్దతుగా డా. భోగ శ్రావణీ ప్రచారం  జగిత్యాల ఫిబ్రవరి 1 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికలలో భాగంగ జగిత్యాల పట్టణంలోని 44వ వార్డ్ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆర్మూర్ పద్మ-శ్రీకాంత్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు  డా .బోగ శ్రావణి  ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, బీజేవైఎం...
Read More...
Local News  State News 

కంటోన్మెంట్ బోర్డు విలీన పోరాటానికి JAC సన్నాహక సమావేశం

కంటోన్మెంట్ బోర్డు విలీన పోరాటానికి JAC సన్నాహక సమావేశం సికింద్రాబాద్,  ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):  కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌తో ఆదివారం బాలంరాయిలోని లీ ప్యాలెస్‌లో జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నియోజకవర్గంలోని కాలనీ అసోసియేషన్ సభ్యులు, బస్తీల...
Read More...
Local News  Spiritual  

స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ లో పాల కావడి ఉత్సవాలు l ll

స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ లో పాల కావడి ఉత్సవాలు l ll సికింద్రాబాద్, ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని శ్రీ స్కందగిరి సుబ్రమణ్య స్వామి దేవాలయంలో ఆదివారం  ఉదయం నుంచి పాల కావడి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేకువ జాము నుంచే వేలాదిమంది భక్తులు పాలకావడిని భుజాన ధరించి ఆలయం చుట్టూ గిరి ప్రదర్శన చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం...
Read More...

బ్రాహ్మణ సమగ్ర సర్వే దరఖాస్తు పత్రంలు బాధ్యులకు అందజేత 

బ్రాహ్మణ సమగ్ర సర్వే దరఖాస్తు పత్రంలు బాధ్యులకు అందజేత  జగిత్యాల ఫిబ్రవరి 1 (ప్రజా మంటలు) ఉమ్మడి కరీంనగర్ జిల్లా (బాస్ )బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ జనగామ నాగరాజు జగిత్యాల జిల్లా కేంద్రానికి ఆదివారం చేరుకొని అఖిల బ్రాహ్మణ  అర్చక సేవా సంఘము అధ్యక్షులు సిరిసిల్ల పార్థసారథి శర్మను జిల్లా కేంద్రంలోని శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయం లో కలిసి బ్రాహ్మణ...
Read More...