ముగిసిన ఇంటర్ సప్లమెంటరీ ప్రధాన పరీక్షలు.
- జూన్ 4 నుండి మార్చిలో హాజరుకాని విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 31 (ప్రజా మంటలు)
జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ ప్రధాన పరీక్షలు ముగిసినాయి.
శుక్రవారం ఉదయం పూట జరిగిన పరీక్ష లో ప్రథమ సంవత్సర విద్యార్థులు 2005 మంది విద్యార్థులకు గాను 1907 మంది విద్యార్థులు హాజరైనారు 98 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు.
మధ్యాహ్నం పూట జరిగిన పరీక్షలు విద్యార్థులు 939 మందికి గాను 877 మంది విద్యార్థులు హాజరైనారు 42 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు.
మార్చిలో హాజరు కాని విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు :
- తేదీ :04-06-2024 ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు
- మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు
గత మార్చి పరీక్షలలో హాజరు కాని విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తారు.
- ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలుతేదీ: 08-06-2024 ఉదయము 10 గంటల నుంచి 12 గంటల మధ్యన నిర్వహిస్తారు.
అలాగే,
- పర్యావరణ పరీక్ష తేదీ: 11-06-2024
- నైతిక మానవ విలువలు పరీక్ష తేదీ: 12-06-2024 ఉదయము 10 గంటల నుండి 01:00 మధ్య నిర్వహిస్తారు
పైన వివరించిన ఇంగ్లీష్ ప్రాక్టికల్ మరియు పర్యావరణ విద్య , ఎథిక్స్ అండ్ ఉమెన్ వాల్యూస్ పరీక్షలు గత మార్చిలో లేదా అంతకు ముందటి పరీక్షలలో హాజరు కాని వారు హాజరు కావలసి ఉంటుందని పరీక్షలు కన్వీనర్ బి. నారాయణ తెలియజేశారు.