తల్లిదండ్రులను విస్మరించేవారు శిక్షార్హులే. - ఆర్డీవో ఎన్.శ్రీనివాస్.

On
తల్లిదండ్రులను విస్మరించేవారు శిక్షార్హులే. - ఆర్డీవో ఎన్.శ్రీనివాస్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

మెట్ పల్లి మే 30 (ప్రజా మంటలు ) : 

వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని,వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని మెట్ పల్లి ఆర్డీవో ఎన్.శ్రీనివాస్ అన్నారు.గురువారం ఆర్డీవో కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన సీనియర్ సిటీజేన్స్ పిలుపు,వయోధికుల రక్షణ చట్టం అవగాహన పుస్తకాలను మెట్ పల్లి ఆర్డీవో ఎన్.శ్రీనివాస్ ఆవిష్కరించారు.

అనంతరం వయోధికుల చట్టం కింద తల్లిదండ్రులు దాఖలు చేసిన కేసులను విచారించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ..... తల్లిదండ్రులైన వయో వృద్ధులను పోషించక నిరాదరిస్తున్న,వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు.వేధింపులకు గురి చేసిన వారికి వయో వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారం 3 నెలల వరకు జైలు శిక్ష ,జరిమాన విధించే వీలుందన్నారు.

జిల్లాలో వయోధికుల రక్షణ,నిరాదరణ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న సీనియర్ సిటీజన్స్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను, మెట్ పల్లి డివిజన్ పరిథి లో సేవలను అందిస్తున్న సీనియర్ సిటీజన్స్ డివిజన్ అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి,కార్యదర్శి సౌడాల కమలాకర్ లను ఆర్డీవో అభినందించారు.

కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,,మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు ఒజ్జెల బుచ్చిరెడ్డి,కార్యదర్శి సౌడాల కమలాకర్, జిల్లా,డివిజన్, మండలాల ,గ్రామాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags