ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం వల్ల లక్షల ఎకరాల పంట రాష్ట్రంలో ఎండిపోయాయి.

- మాజీ మంత్రి కొప్పుల, శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్.

On
ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం వల్ల లక్షల ఎకరాల పంట రాష్ట్రంలో ఎండిపోయాయి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల మే 29( ప్రజా మంటలు) : 

 ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం వల్ల లక్షల ఎకరాల పంట ఎండిపోయిన పరిస్థితి అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ అన్నారు.

బుధవారం బి అర్ ఎస్ పార్టీ కార్యలయం మోతే రోడ్డు లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,జగిత్యాల శాసన సభ్యులు డా సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..... గత ప్రభుత్వంలో ఎలాంటి జాప్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు. వడ్లలో కటింగ్ పేరుతో గత ప్రభుత్వము పై ఆరోపణలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతుల ధాన్యానికి కటింగ్ ఎందుకు విధిస్తున్నారో తెలుపాలని డిమాండ్ చేశారు.

దీనిలో రైస్ మిల్లర్లతో మీ వాటా ఎంతో చెప్పాలి అని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇస్తామన్న పదివేల నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు.

మధ్యాహ్నం భోజనం పథకంలో రెండు లక్షల 20 వేల టన్నుల బియ్యం 45 రూపాయల చొప్పున కాకుండా 57 రూపాయలకు టెండర్ ఖరారు చేసి కొనుగోలు చేయడం పెద్ద స్కాం అన్నారు.

ఈ విషయంపై విప్ అడ్లూరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రజలకు రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ జెడ్ పి టి సి సభ్యులు జలంధర్,నాయకులు అల్లాల దామోదర్ రావు,నక్కల రవీందర్ రెడ్డి,బాల ముకుందం,పాలేపు రాజేంద్ర ప్రసాద్,అల్లాల ఆనంద్ రావు, వొల్లెం మల్లేశం,కృష్ణ రెడ్డి,కథ్రోజ్ గిరి,అలిశెట్టి వేణు,యం ఏ ఆరిఫ్,జంగిలి శశి, ప్రవీణ్ రావు,సంజీవ్,సంగెం శ్రీనివాస్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags