తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు. జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి
తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు. జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
జానపద సాహిత్య రంగంలో ఆచార్య రామరాజు పేరు తెలియని వారుండరు. తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రప్రథమంగా డాక్టరేటు పట్టాకోసం పరిశోధన చేసి, దేశ విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం పై పరిశోధన లకు ప్రవేశం కలిపించడానికి ప్రేరణ అయినారు రామరాజు. ఆయన పరిశోధన భూమికగా ఇతర విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం గూర్చి పరిశోధన ప్రారంభమయింది. తెలుగునాట విశ్వ విద్యాలయాల్లో జానపద సాహిత్య శాఖలను రూపొందించి, వాటిలో తమ పరిశోధనాత్మక రచనలతో, బోధనతో, మార్గ నిర్దేశనంతో ఒకతరం జానపద సాహిత్య పరిశోధకులను, అధ్యాపకులను తయారు చేసిన మార్గదర్శకులు ఆయన. భారతీయ విశ్వ విద్యాలయాల్లోని ఆదర్శ ప్రాయమైన, అరుదైన మౌలిక పరిశోధకుల్లో ఆయన అగ్రగణ్యులు. 1955లో ప్రచురించ బడిన ఆయన పరిశోధనా గ్రంథం... 'జానపద గేయ సాహిత్యము' తెలుగు జానపద అధ్యయనాలకు విజ్ఞాన సర్వస్వంగా అందుబాటులో ఉంది.
బిరుదురాజు రామరాజు 1925 ఏప్రిల్ 16 వ తేదీ దేవనూరు గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదు రాజు నారాయణరాజు దంపతు లకు జన్మించాడు. ప్రాథమిక విద్యను హన్మకొండ శివార్లలోని దేవనూరు, మడికొండలలో పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం ఎనిమిదేళ్లపాటు హన్మకొండకు 14 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. 3వ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. మెట్రిక్ చదివేటప్పుడు 11వ ఆంధ్ర మహాసభల సందర్భంగా మహాత్మా గాంధీ వరంగల్ వచ్చినప్పుడు ఆనాటి సభలలో స్వచ్ఛంద సేవలకు అందించాడు. గాంధీజీతో కలిసి పాదయాత్ర చేశాడు. 1947లో కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు. చదువు కునే రోజుల్లో ఆర్యసమాజం ప్రభావానికి లోనైనాడు. నిజాం వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. నిజాం కళాశాలలో బి.ఎ. చదువుతున్న సమయంలో దాశరథి కృష్ణమా చార్యతో పరిచయం ఏర్పడింది. కాళోజీ నారాయణరావు, టి.హయగ్రీవా చారి, ముదిగొండ సిద్ద రాజలింగం, జమలాపురం కేశవరావు తదితర యువ నాయకులతో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలలపాటు కారాగార శిక్ష అనుభవించాడు. 1947-50ల మధ్యకాలంలో నిజాం కళాశాలలో తెలంగాణా విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పని చేశాడు. బి.ఎ.పూర్తయ్యాక న్యాయ శాస్త్రంలో పట్టా పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. చదివే రోజులలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఆ సమయం లో సి.నారాయణ రెడ్డితో కలిసి కొంతకాలం రామనారాయణ కవులు పేరుతో జంట కవులుగా కవిత్వం చెప్పారు. మాడపాటి హనుమంతరావు ఆంధ్రసంఘం నెలకొల్పి దానికి బిరుదురాజు రామరాజును అధ్యక్షుడిగా నియమించాడు. తెలంగాణ రచయితల సంఘానికి తొలి కార్యదర్శిగా ఉన్నాడు. కాగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్ర రచయితల సంఘంగా మారింది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మార్గ దర్శకత్వంలో తెలుగు జానపద గేయసాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి దక్షిణ భారత దేశంలోనే జానపద సాహిత్యంపై మొట్టమొదటి పి.హెచ్.డి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి సంపాదిం చాడు. సంస్కృతంలో ఎం.ఎ. చేసి అందులో కూడా డాక్టరేట్ పొందా డు.
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో 1951లో ఉపన్యాసకుడిగా చేరి క్రమంగా పదోన్నతుల ద్వారా తెలుగుశాఖకు డీన్‌గా, అధ్యక్షు డిగా విధులు నిర్వర్తించాడు. ఆయన మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందా రు. రామరాజు పర్యవేక్షణలో కేతవరపు రామకోటిశాస్త్రి, కోవెల సుప్రసన్నాచార్య, ముదిగొండ వీరభద్ర శాస్త్రి, అక్కిరాజు రమాపతి రావు, అనంతలక్ష్మి, కాళిదాసు పురుషోత్తం, రవ్వా శ్రీహరి వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందడం గమనార్హం. 1983లో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశాడు.
1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 1995లో భారత ప్రభుత్వం నుండి నేషనల్ ప్రొఫెషనల్‌షిప్, 2001లో సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డ్, 2003లో శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం,2006/2007లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి 'విశిష్ట పురస్కారం', 2009లో సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి తెలుగు భారతి పురస్కారం అందుకున్నాడు.
ప్రాచీన సంస్కృతాంధ్ర గ్రంథాల్ని పరిశీలించి, పరిష్కరించి మొదటి సారిగా వెలుగులోకి తేవడానికి విశేష కృషి చేశాడు. సంస్కృతంలో పీహెచ్‌డీ చేసి 'సంస్కృత సాహిత్యానికి ఆంధ్రుల సహకారం' అనే గ్రంథంగా తన వ్యాసాన్ని ప్రచురించాడు. తాళపత్ర గ్రంథాల్ని సేకరించి పలు వ్యాసాల ద్వారా వాటిని పరిచయం చేశాడు. సంస్కృత భాషా సాహిత్యాలకు ఆంధ్రులు చేసిన సేవను గూర్చి విడిగా ఒక పెద్ద పరిశోధన గ్రంధ రచనే చేశాడు. శరత్ చంద్ర ఛటర్జీ, మున్షీ ప్రేమ్‌చంద్ వంటి అగ్ర రచయితల రచనలను తొలిసారిగా తెలుగులోకి అనువదించి సాహిత్యాభి మానులకు పరిచయం చేశాడు. ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న పండితుడు రామరాజు గురు గోవింద్ సింగ్ చరిత్ర, జాతక కథలను హిందీ నుండి తెలుగులోకి అనువదించాడు. ఉర్దూ-తెలుగు నిఘంటువును కూడా రూపొందిం చాడు. ఆంగ్లంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక ఉపన్యాసాలు ఇస్తూ, అనేక పుస్తకాలు వ్రాసాడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యాభైకి పైగా విశ్వ విద్యాలయాలతో అనుబంధం కలిగి ఉండి, పలు యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. తెలుగు జానపద అధ్యయనాల గాడ్‌ఫాదర్ గా కీర్తించబడే ఆచార్య రామరాజు, 2010, ఫిబ్రవరి 8 న హైదరాబాదులో మరణించాడు.
More News...
<%- node_title %>
<%- node_title %>
చౌలామద్దిలో ఓటు హక్కు వినియోగించిన తుల ఉమ, డా. తుల రాజేందర్
చౌలామద్ది డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
ఈరోజు జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌలామద్ది గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, తుల గంగవ్వ స్మారక ట్రస్ట్ చైర్మన్ డా. తుల రాజేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని... గాంధీ మెడికల్ కాలేజీ మాజీ హెచ్ఓడి డా.రత్నకుమారి కన్నుమూత
సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ బయోకెమిస్ట్రీ విభాగం మాజీ హెచ్‌ఓడీ డా. జి. రత్నకుమారి సోమవారం కన్నుమూశారు. గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థినిగా, అదే కళాశాలలో సేవలందించి పదవీ విరమణ పొందారు.
నిబద్ధత గల అధ్యాపకురాలిగా పేరు పొందారు ఆమె గతంలో ఇచ్చిన డిక్లరేషన్ మేరకు ఆమె డెడ్... తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, పాలకవర్గంను సన్మానించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)తుంగూర్ సర్పంచ్ గా గెలుపొందిన అర్షకోట రాజగోపాల్ రావును, ఉపసర్పంచ్ మరియు పాలకవర్గంను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు.
జగిత్యాల నియోజకవర్గంలోని సుమారు 70 గ్రామాల్లో తనపై ఎంతో నమ్మకముంచి, ప్రజల అభిమానంతో గెలుపొందిన సర్పంచ్ లకు అభినందనలు తెలియజేసి సన్మానించారు.... ఎమ్మెల్యే సంజయ్ బలపరిచిన సర్పంచులు ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులను అభినందించి సత్కరించిన ఎమ్మెల్యే
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బలపరిచిన 70 మంది సర్పంచులు మరియు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందగా 65 మంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ,ఉప సర్పంచ్ పాలకవర్గ సభ్యులను... రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే...గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
గొల్లపల్లి డిసెంబర్ 15 (ప్రజా మంటలు :అంకం భూమయ్య)
గొల్లపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆవుల జమున సత్యం (ఉంగరం గుర్తు) ఓటు వేసి గెలిపించాలని కోరారు.సత్యం వెనుక బిఆర్ఎస్ పార్టీ, కొప్పుల ఈశ్వర్, కెటిఆర్,... సామాజిక తెలంగాణయే నా ధ్యేయం.. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: X "ఆస్క్ కవిత"లో కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
సామాజిక తెలంగాణ సాధననే తన ప్రధాన లక్ష్యంగా తీసుకున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో జాగృతి పోటీలో ఉంటుందని వెల్లడించారు. సోమవారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిర్వహించిన #AskKavitha కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఈ ఇంటరాక్షన్... వావ్...దంపతులిద్దరూ గెలిచారు... ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి..
సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోచమ్మల ప్రవీణ్(8వ వార్డు) మంజుల (10వ వార్డు) దంపతులు ఇద్దరు వేర్వేరు వార్డుల్లో పోటీ చేశారు. చిత్రం ఏమిటంటే ఇద్దరికి 98-98 ఓట్లు చొప్పున వచ్చాయి.
కాగా ప్రవీణ్ రామన్నపేట---... పాషం భాస్కర్ మృతిపై జి. రాజేశం గౌడ్ సంతాపం
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్, మండల అధ్యక్షుడిగా సేవలందించిన పాషం భాస్కర్ గారు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మారింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్ తన భార్య శ్యామలాదేవితో కలిసి పాషం... కవితమ్మపై తప్పుడు ప్రచారం ఆపాలి.. నిరాధార ఆరోపణలకు తీవ్ర పరిణామాలు: తెలంగాణ జాగృతి నేతలు
హైదరాబాద్ డిసెంబర్ 15. (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మపై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం జరుగుతోందని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ ఆరోపించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
వి. ప్రకాష్ అనే వ్యక్తి... మోతే గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులను అభినందించి సత్కరించిన డా .భోగ శ్రావణి ప్రవీణ్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)మోతే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్లుగా గెలుపొందిన పల్లెకొండ రాజేశ్వరి-ప్రశాంత్ , ధనపనేని నరేష్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రాంరెడ్డి, సునీల్,ప్రశాంత్ మరియు... పొలాస గ్రామపంచాయతీ నూతన ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులను సత్కరించిన డా భోగ శ్రావణి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 15(ప్రజా మంటలు) మండలం పొలాస గ్రామం నూతన ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ గెలుపొందగా ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలువగా గెలుపొందిన ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మిల్కూరి... భారత మార్కెట్‌లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్
న్యూఢిల్లీ డిసెంబర్ 14:భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్–యూకే మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు పెంచడంతో పాటు సేవలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
2026 నుంచి (అనుమతులకు లోబడి) లండన్ హీత్రో – న్యూఢిల్లీ మార్గంలో మూడో డైలీ... 