జమ్మికుంటాలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాల నిర్వహణ
నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాల నిర్వహణ
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అమలు కాని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు
సామాజిక కార్యకర్త, షేక్ సాబిర్ అలి విమర్శ
జమ్మికుంట (ప్రజామంటలు): జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని తెలంగాణ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ ఆక్ట్ ను అనుసరించి ఏ4 క్యాటగిరికి సంబంధించిన 8 మద్యం ఉన్నాయి.
నిబంధనల మేరకు వీటిని ఉదయం 10 గం. నుండి సాయంత్రం 10 గం. వరకు మాత్రమే నిర్వహించాలి. ఇదేవిధంగా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ మరియు బియర్స్ ఎం.ఆర్.పి. ధరలకే విక్రయించాలి. మరియు రోజువారి లావాదేవీల మరియు సరుకు వివరాల అప్డేట్స్ ను ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ కు అందించాలి. ఇదేవిధంగా వైన్స్ లలో అక్రమాలు జరగకుండా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఎక్సైజ్ కంట్రోల్ రూం కి లింక్ చేయాలి. ఇదేవిధంగా వైన్స్ లలో వాక్ ఇన్ స్టోర్స్ (సిట్టింగ్) నిర్వహించాలి అంటే 5లక్షల అదనపు రుసుము చెల్లించాలి. కానీ ఈ ఎన్నికల సమయంలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మద్యం వ్యాపారులు మాత్రం అధికారుల తనిఖీలకు తావు లేకుండా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్న కూడా అధికారులు చర్యలు చేపట్టకపోవడం మూలంగా జీరో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి అనే విషయం పై అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదేవిధంగా పట్టణంలోని వివిధ హోటల్స్ అండ్ లాడ్జ్ లు మద్యం సిట్టింగ్ లకు కేరాఫ్ అడ్రస్ మారాయి. కావున ఇకనైనా అధికారులు స్పందించి రోజు వారి తనిఖీలను ముమ్మరం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి
