పుతిన్ భారత యాత్ర: భారత్ విదేశాంగ స్వతంత్రతకు నిదర్శనం ?
నేటి నుండి రష్యా అధినేత వడ్లిమిర్ పుతిన్ భారత పర్యటన
2030 నాటికి $100 బిలియన్ ట్రేడ్ లక్ష్యం – ఆర్థికవేత్తలు ఏమంటున్నారు?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చేసిన భారత యాత్రతో, భారత్-రష్యా సంబంధాలు మరింత బలంగా మారాయి. ఈ పర్యటనలో భారత్ ఏ దేశానికీ “లొంగదు”, పశ్చిమ దేశాల ఒత్తిడికి లోబడదు, తాను స్వతంత్రంగా విదేశీ నిర్ణయాలు తీసుకుంటుంది అన్న సందేశాన్ని ప్రపంచానికి క్లియర్‌గా ఇచ్చింది.
ఇరు దేశాలు కలిసి 2030 నాటికి $100 బిలియన్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకోవడం ఈ సంబంధాల బలం ఎంత పెరిగిందో చూపుతోంది.
భారత్ — రష్యా: కొత్త ఒప్పందాలు అమెరికాకు నచ్చకపోవచ్చు
పుతిన్-మోదీ భేటీలో ఎనర్జీ, డిఫెన్స్, కెమికల్స్, ఫార్మా, మెషినరీ, ఐటీ, వ్యవసాయ ఉత్పత్తులు వంటి కీలక రంగాల్లో భారీగా ఒప్పందాలు కుదిరాయి.
ప్రత్యేకంగా —
✔ రష్యా నుండి చౌక ధరల నూనె కొనుగోలు, రక్షణ రంగ ఒప్పందాలు
✔ రత్నాలు, ఎరువులు, ఆయిల్ & గ్యాస్ ట్రాన్స్‌పోర్ట్
✔ కొత్త రవాణా మార్గాలు (INSTC, Vladivostok-Chennai Route)
✔ రూబుల్-రూపాయి చెల్లింపు వ్యవస్థ
ఇవి అమెరికా, యూరోప్‌కు నచ్చకపోవచ్చు. ఎందుకంటే పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు పెట్టిన తర్వాత కూడా ఇండియా రష్యాతో ట్రేడ్ పెంచుతుంది.
🌍 ప్రపంచ ఆర్థికవేత్తలు ఏమంటున్నారు?
1. డా. రియాద్ అబ్దులిన్ (International Trade Economist, Central Asia Institute)
“భారత్ పూర్తిగా స్వతంత్ర విదేశీ విధానంతో ముందుకు సాగుతోంది. INSTC వంటి రవాణా మార్గాలు పూర్తిగా పనిచేస్తే, $100 బిలియన్ ట్రేడ్ లక్ష్యం చాలా సాధ్యమే.”
2. ఎరిబాకోవా (Chief Economist, Institute of International Finance – IIF)
“భారత్-రష్యా వ్యాపారం వేగంగా పెరుగుతోంది. ఇది ఇరు దేశాలకు దీర్ఘకాల ప్రయోజనం ఉంది కాబట్టి. అయితే భారత్ పశ్చిమ దేశాలతో ఉన్న సంబంధాలను కూడా సమంగా కొనసాగించాలి.”
3. ప్రొఫెసర్ మైకేల్ కుగెల్మన్ (South Asia Economist, Wilson Center)
“పుతిన్ పర్యటన అమెరికాకు ఇచ్చిన స్పష్టమైన సందేశం — భారత్ ఎవరినీ పట్టించుకోదు, తన ప్రయోజనం కోసం పనిచేస్తుంది.”
4. మారియా స్లోటోవా (Russian Academy of Economics)
“భారత్-EAEU మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదిరితే, 2030కి ముందే $120 బిలియన్ వ్యాపారం దాటుతుంది.”
5. డా. జేమ్స్ క్రామర్ (Global Oil & Energy Economist)
“రష్యా చౌక నూనె కొనడం భారత ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద ప్లస్. దాంతో దేశంలో ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది.”
ఈ పర్యటనతో భారత్‌కు రంగాలలో లాభాలు కలగవచ్చు
✔ S 400,S 500 రక్షణ వ్యవస్థ కొనుగోలు
✔ యుద్దవిమానల తయారీలో సంయుక్త ప్రాజెక్ట్
✔ చౌక నూనె – ఇంధన ఖర్చులు తగ్గుతాయి
✔ ఎరువుల సరఫరా నిరంతరం
✔ మెషినరీ, ఫార్మా, ఐటీ రంగాలకు పెద్ద మార్కెట్
✔ రష్యా పెట్టుబడులు పెరిగే అవకాశం
✔ యువ భారత ఇంజినీర్లకు రష్యాలో ఉద్యోగ అవకాశాలు
కానీ ప్రమాదాలూ ఉన్నాయి…
❗ అమెరికా & యూరోప్ అసహనం
❗ బ్యాంకింగ్, చెల్లింపుల్లో రూబుల్-రూపాయి సమస్యలు
❗ రష్యా మార్కెట్‌లో డిమాండ్ స్థిరంగా ఉండకపోవడం
❗ పశ్చిమ ఆంక్షల కారణంగా కొన్ని రంగాలు ప్రభావితం కావచ్చు
ఆర్థికవేత్త ఎలెన్ షోర్ (European Trade Council) మాటల్లో భారత్ సమతుల్యత పాటించకపోతే, అమెరికా, యూరోప్ లలో అసహన పెరగడం, భారత్ కు మంచిదికాద్.
పుతిన్ పర్యటనతో
👉 భారత్ స్పష్టంగా ప్రపంచానికి చెప్పింది — “మేము ఎవరి చంకన పడము.”
👉 రష్యాతో వాణిజ్యం భారీగా పెరుగుతోంది
👉 $100 బిలియన్ లక్ష్యం సాధ్యమే
👉 ప్రపంచ ఆర్థికవేత్తలు—సానుకూలంగా చూస్తూనే, జాగ్రత్తలు అవసరం అంటున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల, మార్చి 2(. ప్రజా మంటలు)
వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ ను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ అన్నారు. వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, కంప్యూటర్ శిక్షణ కేంద్రం లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి... పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు
జగిత్యాల మార్చి 2 ( ప్రజా మంటలు)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతిని జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాద రావు చిత్రపటానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మరియు పోలీస్ అదికారులు పూలమాలవేసి నివాళులర్పించారు.
నైతిక విలువలు, ప్రజల పట్ల... పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ మార్చ్ 02 (ప్రజా మంటలు):
హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో వెల్లడైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.
సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి... ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు
కరీంనగర్, మార్చి 02 (ప్రజా మంటలు):
మాజీ శాసనసభ స్పీకర్, అజాతశత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు.ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు... మస్కట్ ద్వారా రోడ్డు మార్గంలో భారత్‌కు వచ్చే అవకాశం – కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్ / న్యూఢిల్లీ మార్చ్ 02 (ప్రజా మంటలు):
అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఆందోళనకు గురవుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇకపై భయపడాల్సిన అవసరం లేదని, స్వదేశానికి తిరిగి రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం... తెలంగాణ విద్యా కమిషన్‌పై వివాదం: అర్హతలే ప్రశ్నార్థకమా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రయోగాలా?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ సమర్పించిన “తెలంగాణ విద్యా విధానం–2026” నివేదిక రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కమిటీకి పరిపాలనా అనుభవం ఉన్నవారు ఉన్నప్పటికీ, స్కూల్ లేదా యూనివర్సిటీ స్థాయిలో బోధన అనుభవం ఉన్న అసలైన విద్యావేత్తలు లేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రేవంత్ రెడ్డి... కుమ్మెర గ్రామం చిన్నారి మృతికి రజక సంఘం నిరసన కొవ్వొత్తులతో నివాళి
జగిత్యాల మార్చి 1(ప్రజా మంటలు)కుమ్మెర గ్రామంలో చిన్నారి మృతికి రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చింతకుంట వద్ద గల ఐలమ్మ విగ్రహం ముందునిరసన వ్యక్తం చేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కుమ్మెర గ్రామంలో జాతరలో జరిగిన సంఘటనను నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం చేసినట్లు తెలిపారు ఇలాంటి... అర్హత లేమి, పారదర్శకత లోపం, విద్యా భవిష్యత్తుపై ముప్పు
కరీంనగర్ మార్చ్ 01 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక రాష్ట్ర విద్యావ్యవస్థ భవిష్యత్తుపై తీవ్రమైన సందేహాలు రేకెత్తిస్తోందని, TRSMA రాష్ట్ర గౌరవాధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు విమర్శించారు.
కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా, విద్యా విధాన రూపకల్పనలోని మౌలిక లోపాలను ఎత్తిచూపుతున్న గంభీర హెచ్చరికగా
ఆయన... ఘనంగా ముగిసిన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలు
జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం లో అంగరంగ వైభవంగా జరుగుతున్న 11వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 6 వ రోజు, చివరి రోజు అయిన ఆదివారం ఉదయం సుప్రభాతం, సేవ కాలం,పంచహారతి, అష్టోత్తర శత కలశాభిషేకం, మహా పూర్ణాహుతి, విమానోపరి కుంభాభిషేకం, చక్ర... మహిళా పోలీస్ సిబ్బందికి ఫ్రీ హెల్త్ క్యాంప్, క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు
జగిత్యాల మార్చ్ 1(ప్రజా మంటలు)మహిళలలో వచ్చే రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్‌ను ముందస్తుగా ఏవిదంగా గుర్తించడం మరియు ఈ యొక్క క్యాన్సర్ లు రావడానికి గల కారణాలు, ఈ యొక్క క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన హెచ్ పి వి వ్యాక్సినేషన్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి సహకారంతో స్థానిక ఐ... జగిత్యాల వీరశైవ సమాజం నూతన కార్యవర్గ ఎన్నిక
జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జగిత్యాల నూతన వీర శైవ సమాజం అధ్యక్షుడుగా కంది కైలాసం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా హద్దునూరి నాగేంద్రం ఎన్నికయ్యారు.
గౌరవ అధ్యక్షులుగా ములస్తం శివకుమార్ ఉపాధ్యక్షులుగా సూరం వీరయ్య గుంటిమట్టం నిరంజన్ కోశాధికారిగా సిద్ధాంతి శ్రీనివాస్ మరియు సంయుక్త కార్యదర్శిగా వూడే అవంతిక అంగడి మఠంవీర... ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు
జగిత్యాల మార్చ్ 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో పద్మశాలి కిట్టి పార్టీ వేడుకలలో భాగంగా ఆదివారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. జ్యోతి ప్రజలన గావించి, కార్యక్రమాలు ప్రారంభించారు.
మహిళలు ఆటపాటలతో అల రించారు. రోజంతా సందడి నెలకొందని సామాజిక కార్యకర్త తవుటు... 