త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి

హుస్నాబాద్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన : మొత్తం రూ. 262.78 కోట్ల అభివృద్ధి పనుల – శంకుస్థాపన చేసిన

On
త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి

హుస్నాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):
ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థితాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

జిల్లా RTC ఎక్స్‌ప్రెస్ బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్‌ను ప్రారంభించారు. అనంతరం 70 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.IMG_20251204_001123

సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన వ్యాఖ్యలు
ఉద్యోగాలు
  • త్వరలో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి సిద్ధం.
  • రెండున్నర ఏళ్లలో మొత్తం 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ.
  • గత ఏడాదిలోపు 60 వేల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేశామని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు
  • పంచాయతీ ఎన్నికలు గ్రామాల అభివృద్ధికి కీలకం.
  • “సర్పంచ్‌గా మంచి ఆలోచనలు ఉన్న వారిని ఎంచుకోండి.
  • మీ ప్రాంతానికి నిధులు తెచ్చే సామర్థ్యం ఉన్న వారిని వార్డు సభ్యులు, సర్పంచ్‌లుగా గెలిపించండి” అని ప్రజలను కోరారు.
ప్రాజెక్టులపై విమర్శలు
  • కాళేశ్వరం ప్రాజెక్టును “కూలేశ్వరం”గా పేర్కొంటూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.
  • కాంగ్రెస్ హయాంలో నిర్మించిన SRS, ఎల్లంపల్లి, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు చక్కగా నిలిచాయని అన్నారు.
  • మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ పూర్తి చేసినా, గౌరెల్లి – గండిపల్లి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
  • ఈ రెండు ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించి పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు.IMG_20251204_001020
తెలంగాణ ఉద్యమ ప్రస్తావన
  • డిసెంబర్ 3న తెలంగాణ కోసం శ్రీకాంత చారి చేసిన బలిదానాన్ని గుర్తుచేశారు.
  • కరీంనగర్ జిల్లా మలిదశ ఉద్యమానికి అండగా నిలిచిన పాత్రను వివరించారు.
మొత్తం రూ. 262.78 కోట్ల అభివృద్ధి పనుల –
శంకుస్థాపన చేసిన
  • ₹44.12 కోట్లు – హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం
  • ₹45.15 కోట్లు – ATC ఏర్పాటు
  • ₹20 కోట్లు – హుస్నాబాద్ మునిసిపాలిటీ అభివృద్ధి పనులు
  • ₹8.60 కోట్లు – RTA యూనిట్ కార్యాలయం నిర్మాణం
  • ₹86 కోట్లు – హుస్నాబాద్ అర్బన్–కొత్తపల్లి ప్యాకేజీ–1 లో 4 లైన్ల రహదారి
  • ₹58.91 కోట్లు – హుస్నాబాద్–అక్కన్నపేట 4 లైన్ల రహదారి
సంక్షేమ కార్యక్రమాల వివరాలు

సీఎం పేర్కొన్న ముఖ్యమైన అమలు చేసిన పథకాలు:

  • రైతుల రుణమాఫీ, రైతు భరోసా కోసం 1.04 లక్ష కోట్లు వ్యయం
  • మహిళలకు RTCలో ఉచిత ప్రయాణం
  • 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
  • సోలార్ పవర్ అందించడం
  • సన్నబియ్యం పంపిణీ
  • 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం
Join WhatsApp

More News...

Local News 

ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి.  జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ 

ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి.    జగిత్యాల ఆర్డీవో మధుసూదన్     జగిత్యాల, మార్చి 2(. ప్రజా మంటలు) వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ ను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ అన్నారు. వాల్మీకి ఆవాసం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం, కంప్యూటర్ శిక్షణ కేంద్రం  లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి...
Read More...
Local News 

పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు

పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు జగిత్యాల మార్చి 2 ( ప్రజా మంటలు)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్  స్వర్గీయ శ్రీ దుద్దిల్ల  శ్రీపాద రావు  జయంతిని  జిల్లా పోలీస్ ప్రదాన  కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా శ్రీపాద రావు చిత్రపటానికి జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  మరియు పోలీస్ అదికారులు పూలమాలవేసి నివాళులర్పించారు. నైతిక విలువలు, ప్రజల పట్ల...
Read More...
State News 

పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత

పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణగా రిజర్చావేషన్లు :అసెంబ్లీలో తీర్మానం చేయాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ మార్చ్ 02 (ప్రజా మంటలు): హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 శాతం నుంచి 18 శాతానికి పెరిగినట్టు గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల గణనలో వెల్లడైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి...
Read More...
Local News  State News 

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు కరీంనగర్, మార్చి 02 (ప్రజా మంటలు): మాజీ శాసనసభ స్పీకర్, అజాతశత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు.ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు...
Read More...
National  International   State News 

మస్కట్ ద్వారా రోడ్డు మార్గంలో భారత్‌కు వచ్చే అవకాశం – కేంద్ర మంత్రి బండి సంజయ్

మస్కట్ ద్వారా రోడ్డు మార్గంలో భారత్‌కు వచ్చే అవకాశం – కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ / న్యూఢిల్లీ  మార్చ్ 02 (ప్రజా మంటలు): అమెరికా–ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ ఆందోళనకు గురవుతున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇకపై భయపడాల్సిన అవసరం లేదని, స్వదేశానికి తిరిగి రావడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం...
Read More...
State News 

తెలంగాణ విద్యా కమిషన్‌పై వివాదం: అర్హతలే ప్రశ్నార్థకమా?

తెలంగాణ విద్యా కమిషన్‌పై వివాదం: అర్హతలే ప్రశ్నార్థకమా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రయోగాలా? తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ సమర్పించిన “తెలంగాణ విద్యా విధానం–2026” నివేదిక రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కమిటీకి పరిపాలనా అనుభవం ఉన్నవారు ఉన్నప్పటికీ, స్కూల్ లేదా యూనివర్సిటీ స్థాయిలో బోధన అనుభవం ఉన్న అసలైన విద్యావేత్తలు లేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి...
Read More...
Local News 

కుమ్మెర గ్రామం చిన్నారి మృతికి రజక సంఘం నిరసన కొవ్వొత్తులతో నివాళి

కుమ్మెర గ్రామం చిన్నారి మృతికి రజక సంఘం నిరసన కొవ్వొత్తులతో నివాళి జగిత్యాల మార్చి 1(ప్రజా మంటలు)కుమ్మెర గ్రామంలో చిన్నారి మృతికి రజక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చింతకుంట వద్ద గల ఐలమ్మ విగ్రహం ముందునిరసన వ్యక్తం చేసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కుమ్మెర గ్రామంలో జాతరలో జరిగిన సంఘటనను నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం చేసినట్లు తెలిపారు ఇలాంటి...
Read More...
Local News  Social  State News 

అర్హత లేమి, పారదర్శకత లోపం, విద్యా భవిష్యత్తుపై ముప్పు

అర్హత లేమి, పారదర్శకత లోపం, విద్యా భవిష్యత్తుపై ముప్పు కరీంనగర్ మార్చ్ 01 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక రాష్ట్ర విద్యావ్యవస్థ భవిష్యత్తుపై తీవ్రమైన సందేహాలు రేకెత్తిస్తోందని, TRSMA రాష్ట్ర గౌరవాధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు విమర్శించారు.   కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా, విద్యా విధాన రూపకల్పనలోని మౌలిక లోపాలను ఎత్తిచూపుతున్న గంభీర హెచ్చరికగా ఆయన...
Read More...
Local News 

ఘనంగా ముగిసిన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలు

ఘనంగా ముగిసిన శ్రీ అష్టలక్ష్మి దేవాలయం బ్రహ్మోత్సవ వేడుకలు   జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం లో అంగరంగ వైభవంగా జరుగుతున్న 11వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 6 వ రోజు, చివరి రోజు అయిన ఆదివారం ఉదయం సుప్రభాతం, సేవ కాలం,పంచహారతి, అష్టోత్తర శత కలశాభిషేకం, మహా పూర్ణాహుతి, విమానోపరి కుంభాభిషేకం, చక్ర...
Read More...
Local News 

మహిళా పోలీస్ సిబ్బందికి  ఫ్రీ హెల్త్ క్యాంప్,  క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు

మహిళా పోలీస్ సిబ్బందికి  ఫ్రీ హెల్త్ క్యాంప్,  క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు జగిత్యాల మార్చ్ 1(ప్రజా మంటలు)మహిళలలో వచ్చే  రొమ్ము, సర్వైకల్  క్యాన్సర్‌ను ముందస్తుగా ఏవిదంగా  గుర్తించడం మరియు ఈ యొక్క క్యాన్సర్‌ లు రావడానికి గల కారణాలు, ఈ యొక్క క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన  హెచ్ పి వి వ్యాక్సినేషన్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి సహకారంతో  స్థానిక  ఐ...
Read More...
Local News 

జగిత్యాల వీరశైవ సమాజం  నూతన కార్యవర్గ ఎన్నిక 

జగిత్యాల వీరశైవ సమాజం  నూతన కార్యవర్గ ఎన్నిక  జగిత్యాల మార్చి 1( ప్రజా మంటలు)జగిత్యాల నూతన వీర శైవ సమాజం అధ్యక్షుడుగా కంది కైలాసం  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా హద్దునూరి  నాగేంద్రం  ఎన్నికయ్యారు.     గౌరవ అధ్యక్షులుగా ములస్తం శివకుమార్   ఉపాధ్యక్షులుగా సూరం వీరయ్య గుంటిమట్టం నిరంజన్  కోశాధికారిగా సిద్ధాంతి శ్రీనివాస్ మరియు సంయుక్త కార్యదర్శిగా  వూడే అవంతిక అంగడి మఠంవీర...
Read More...
Local News 

ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు

ఘనంగా ముందస్తు మహిళ దినోత్సవ వేడుకలు జగిత్యాల మార్చ్ 1( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం లోని ఉమా శంకర్ గార్డెన్స్ లో పద్మశాలి కిట్టి పార్టీ వేడుకలలో భాగంగా  ఆదివారం ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. జ్యోతి ప్రజలన           గావించి,  కార్యక్రమాలు ప్రారంభించారు.   మహిళలు ఆటపాటలతో  అల రించారు. రోజంతా సందడి నెలకొందని సామాజిక కార్యకర్త తవుటు...
Read More...