తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు - 23.05.2026
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 23 మే (ప్రజా మంటలు) :
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు మరియు హైలైట్స్.
1. రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది.
- ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు, శ్లాబు దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
- పునాదులు పూర్తయి గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తయి శ్లాబు నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షలు చొప్పున అందిస్తాం.
- అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజకవర్గానికి 500 ఇళ్లకు చొప్పున నిధులు కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానించింది.
- తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ రెండు నాటికి దాదాపు లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు జరుగుతాయి.
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించాం.
- జూన్ 1వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులందరం అక్కడికి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం.
- హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం (LIG) లక్ష ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.
- తెలంగాణ రాష్ట్రంలో వివిధ దఫాలుగా చేసిన సర్వేల ప్రకారం 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
- వెంటనే ఆ కుటుంబాలన్నింటికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించాలని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని క్యాబినెట్ నిర్ణయించింది.
2. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనులు చేపట్టేందుకు రూ.1000 కోట్ల నిధులకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తొలి విడతగా రూ.300 కోట్లు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
3. విద్యుత్ పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న RDSSలో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
4. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
5. ప్రభుత్వం పాఠశాలలతో పాటు అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకూ ఉదయం అల్పాహారంతో పాటు పాలు అందించాలని నిర్ణయించింది.
6. రాష్ట్రంలోని DCMSలను మార్క్ ఫెడ్లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. TGRICని (తెలంగాణ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) హాకాలో విలినం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
7. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ సేకరణ, పునరావాసం, మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు రూ.587 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
8. తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకే నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దావోస్లో ఈ పాలసీని లాంఛనంగా ఆవిష్కరించాం. ఈ పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలతో పాటు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం.
9. లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తాం. యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్ హెల్త్, గ్లోబల్ ఇన్నోవేషన్ రంగాల్లో మంచి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటివరకు ఎక్కువగా తయారీ మీద దృష్టి ఉంటే, ఇక నుంచి విలువైన ఇన్నోవేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ (R&D) యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించే విధంగా ఈ పాలసీలో మార్పు తీసుకొస్తున్నాం. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్లు తెలంగాణకు రావడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు - 23.05.2026
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 23 మే (ప్రజా మంటలు) :
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు మరియు హైలైట్స్.
1. రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి... గొల్లపల్లి మండల కేంద్రంలో ట్రెయిన్డ్ డాగ్స్ నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల ప్రత్యేక తనిఖీలు
గొల్లపల్లి మే 22 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ తో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. మాదక... ఘనంగా ప్రారంభమైన శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం
జగిత్యాల మే 21 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో పండిత శిరోమణి బ్రహ్మశ్రీ ఖండవల్లి ఆదిత్య శర్మ చే శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞము గురువారం ప్రారంభమైంది. ఉదయము 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 3_30 నుండి 6_30 వరకు కొనసాగుచున్నది.
ఈనెల 27వ... ధర్మపురి పట్టణ లో ట్రెయిన్డ్ డాగ్స్ సహాయంతో నారకోటిక్ నిషేధిత గంజాయి మధిక ద్రవ్యాల ప్రత్యేక తనిఖీలు
గొల్లపల్లి మే 21 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో, ధర్మపురి సర్కిల్ రామ్ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేష్ పోలీస్ సిబ్బంది ట్రెయిన్డ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి నిషేధిత మాదక ద్రవ్యాల కోసం విస్తృత తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా... కుత్బుల్లాపూర్‌లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ: ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత అల్టిమేటం
కుత్బుల్లాపూర్, హైదరాబాద్ | మే 21 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటైందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పలు రాజకీయ, సామాజిక అంశాలపై ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు.
జూన్ 2లోగా హామీలు... అనుమానాస్పద వ్యక్తులకు లాడ్జ్ గదులు ఇవ్వొద్దు, గుర్తింపు పత్రాలు తప్పనిసరి: టౌన్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్
జగిత్యాల మే 20(ప్రజా మంటలు)
చుక్క గంగారెడ్డి ప్రతినిధి
పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పట్టణ పోలీస్ స్టేషన్ పరిదిలోని లాడ్జ్ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్వాహకులు తప్పనిసరిగా పాటించవలసిన భద్రత నిబంధనలు మరియు మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ,... పదేళ్లలో పాలమూరు ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా… ఇప్పుడు పాదయాత్ర డ్రామాలా?
:హైదరాబాద్, మే 19 (ప్రజా మంటలు):
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ వచ్చే నెలలో బీఆర్ఎస్ చేపట్టనున్న పాదయాత్రపై తెలంగాణ రక్షణ సేన నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకుండా ఇప్పుడు పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.బంజారాహిల్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో... ఎన్నికల వాగ్దానాలు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్కు బీసీ నాయకులు వినతి
జగిత్యాల మే 7(ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం లో అదనపు కలెక్టర్ జి. రాజగౌడ్ కి వినతి పత్రం అందజేసిన బీసీ నాయకులు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానములో ఇచ్చిన హామీ ప్రకారము 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. పెండింగ్ స్కాలర్ షిప్లను విడుదల చేయాలి.
బీసీ రాష్ట్ర కార్యదర్శి... సైబర్ నేరాల డ్రగ్స్ వినియోగంపై పోలీస్ కళా బృందం అవగాహన సదస్సు
గొల్లపల్లి మే 18 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం ఎండపల్లి మండలంలోని చర్లపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు .
ఈ సందర్భంగా వెల్గటూర్ ఎస్ఐ,ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలు,... TG EAPCET – 2026 ఫలితాలలో జ్యోతి పూర్వ విద్యార్థుల ఘన విజయం
జగిత్యాల మే 17 (ప్రజా మంటలు)ఆదివారం విడుదల అయిన TG EAPCET – 2026 ఫలితాలలో JYOTHI HIGH SCHOOL IIT ACADEMY పూర్వ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి సంస్థ ఖ్యాతిని మరింత పెంచారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను సంస్థ... నీతి, నిజాయితీకి మారుపేరు డాక్టర్ జస్టిస్ జి. చంద్రయ్యకు నివాళులు: మాజీ మంత్రి రాజేశం గౌడ్
హైదరాబాద్, మే 16 (ప్రజా మంటలు):
విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ జస్టిస్ జి. చంద్రయ్య అకాల మరణం బాధాకరమని మాజీ సీనియర్ మంత్రి గొడిశెల రాజేశం గౌడ్, మాజీ న్యాయమూర్తి నవ మోహన్ రావు, పాత్రికేయులు ప్రభాకర్ రావు, ఎల్జేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మినేని వికాస్... ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 15 ( ప్రజా మంటలు) :
ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో విద్యాశాఖ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ – జగిత్యాల ఆధ్వర్యంలో ఓల్డ్ బస్ స్టాండ్ జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి... 