44% సిట్టింగ్ లోక్‌సభ ఎంపీ లపై క్రిమినల్ కేసులు..!

On
44% సిట్టింగ్ లోక్‌సభ ఎంపీ లపై క్రిమినల్ కేసులు..!

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

 

న్యూ ఢిల్లీ మార్చి 29 (ప్రజా మంటలు) : 

514 మంది సిట్టింగ్ లోక్‌సభ ఎంపీ లలో 225 మంది (44%) పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమ అఫిడవిట్‌‌లో ధృవీకరించినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది.

5% ఎంపీలు బిలియనీర్లు ఉన్నారని, వీరి ఆస్తుల విలువ రూ. 100 కోట్ల కంటే పైనే ఉంటుందని పేర్కొంది.

యూపీ, మహారాష్ట్ర, బీహార్, ఏపీ, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌ లకు చెందిన ఎంపీ లపై అత్యధికంగా కేసులున్నాయని తెలిపింది..

Tags