సంత్ సేవాలాల్ 287వ జయంతి పోస్టర్ ఆవిష్కరణ
భోగ్ బండార్ కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిర్వహిస్తాం: తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్
హైదరాబాద్ – ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
ఈ నెల 15న నిర్వహించనున్న బంజారా జాతి ఆరాధ్యదైవం, మూలపురుషుడు సంత్ శ్రీ సేవాలాల్ మాహారాజ్ 287వ జయంతి వేడుకల పోస్టర్‌ను తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మాహారాజ్ జయంతిని జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి బంజారా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో ఎవరూ చేయని విధంగా ఈసారి భోగ్ బండార్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బంజారా గురువులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.
బంజారా జాతి సమస్యలపై ఇప్పటివరకు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం గణనీయమైన శ్రద్ధ చూపలేదని రూప్ సింగ్ విమర్శించారు. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బంజారాల అంశంపై లోతైన అధ్యయనం చేసి, బంజారాలు–ఆదివాసీలను ఏకం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
తెలంగాణ చరిత్రలో తొలిసారిగా బంజారా పూజారులను పిలిచి గౌరవించిన ఘనత కవిత గారిదేనని పేర్కొన్నారు. ఆమె స్వయంగా బంజారా పూజారులను ఇంటికి ఆహ్వానించి, వారికి నమస్కరించి గౌరవించిన సందర్భాలు ప్రజలకు గుర్తుండిపోయాయని అన్నారు.
అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లోని హథిరాం మఠాన్ని కూలగొట్టే ప్రయత్నం జరిగిన సమయంలో, అక్కడి ముఖ్యమంత్రి, టీటీడీ ఛైర్మన్, అధికారులతో మాట్లాడి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని తెలిపారు. ఇది బంజారా, ఆదివాసీ సంప్రదాయాల పట్ల కవిత గారి నిబద్ధతకు నిదర్శనమని రూప్ సింగ్ పేర్కొన్నారు.
ఈ నెల 15న నిర్వహించే భోగ్ బండార్ కార్యక్రమంలో కవిత స్వయంగా పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాగృతి బంజారా నాయకులుబి. కిషన్ నాయక్, బి. సంజీవ్ నాయక్, బానోత్ వెంకట్ నాయక్, దేవి బాయి, పున్ని బాయి, రాంజి నాయక్, గుగులోత్ శ్రీనివాస్ నాయక్, బాలు నాయక్, కుమార్ నాయక్, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ నాయక్, కృష్ణ నాయక్, జీవన్ నాయక్, రామ చావలి బాయి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –
అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం... జగిత్యాలలో నవోదయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యే నిర్లక్ష్యం – ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు
జగిత్యాల మార్చ్ 05, (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం “కమల నిలయం”లో జరిగిన మీడియా సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నాగ శ్రావణితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ జగిత్యాలలో నవోదయ విద్యాలయం స్థాపనకు అవసరమైన భూమి కేటాయింపు అంశంపై రాష్ట్ర... జగిత్యాలలో బీజేపీ నేత బోగా శ్రావణి ఇంటిపై దాడి
జగిత్యాల, మార్చి 05 (ప్రజా మంటలు):
జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు దాడి చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. బీజేపీ నుండి సస్పెండ్ అయిన కొంతమంది నాయకులు ఆమె ఇంటి వద్దకు చేరుకుని హంగామా చేశారు.ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్‌ను ధ్వంసం చేయడంతో పాటు... జగిత్యాల సూర్య గ్లోబల్ స్కూల్లో అట్టహాసంగా విద్యార్థుల స్పోర్ట్స్ మీట్
జగిత్యాల మార్చి 5 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ స్కూల్ లో “చాంపియన్స్ చాలెంజ్” పేరిట స్పోర్ట్స్ మీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
క్రీడలు శారీరక దృఢమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి
ఈ కార్యక్రమానికి ముఖ్య... సిలిగురి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రతిపాదన?
న్యూఢిల్లీ మార్చ్ 05:
భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ ప్రాంతాన్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా (Union Territory) మార్చే ప్రతిపాదనపై రాజకీయ, వ్యూహాత్మక వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిహార్ సరిహద్దు ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటన నిర్వహించడం ఈ చర్చలకు మరింత... సైకత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలంలో, గత నెల 5వ తేదీన స్థాపించిన 21 అడుగుల ఎత్తైన సైకత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, నిర్వాహకులు వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి,గార్లు బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పులుము మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత
మల్యాల మార్చి 4 ( ప్రజా మంటలు)ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా బుధవారం మల్యాల మండలంలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పరిశీలించారు.
పరీక్షా కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల భద్రత, హాల్ టికెట్ల పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్... కల్వకుంట్ల కవిత అరెస్ట్ : నర్సింగిలో అక్రమ కట్టడాలకు వ్యతిరేక ఆందోళన
హైదరాబాద్ మార్చ్ 03 (ప్రజా మంటలు):నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ధర్నాకు దిగారు.
హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించబోమని కవిత బైఠాయించారు.... నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):
హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల... ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ హోలీ సంబరాల్లో పాల్గొన్న తొలి జెడ్పి చైర్ పర్సన్ వసంత
జగిత్యాల మార్చి 3(ప్రజా మంటలు) పట్టణ ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ సంబరాల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ .
శాంతికి, సౌభ్రాతృత్వానికి ప్రతీక హోలీ అని,అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసే వేడుక,ఈ రంగుల పండుగ... జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు
జగిత్యాల మార్చి 3 (ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.
హోళీ సందర్భంగా... దుబాయ్ నుంచి తొలి ప్రత్యేక విమానం – 149 మంది ఢిల్లీకి చేరిక
న్యూ ఢిల్లీ మార్చి 03 (ప్రజా మంటలు):
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో Air India దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి ప్రత్యేక విమానాన్ని నడిపింది. ఇందులో షేటిల్ బాడ్మెంటను క్రీడాకారిణి పీవీ సింధు తో పాటు ప్రముఖులు ఉన్నారు.
AI916D ఫ్లైట్ ద్వారా 149 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీ Indira Gandhi International... 