లాయర్ స్వప్న హత్య ఘటనపై సీఎం స్పందించాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత, లాయర్ స్వప్న ఉదంతం సమాజాన్ని కలచివేసే విధంగా ఉందన్నారు. త్వరలో వివాహం చేసుకోవాలనే ఆశతో ఉన్న యువ న్యాయవాదిని, కుటుంబ సభ్యులే హత్య చేయడం జీర్ణించుకోలేని విషయం అని వ్యాఖ్యానించారు.
స్వప్న ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఫిర్యాదులపై అప్పుడే స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు పోలీసులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోనే ఇలాంటి ఘటన జరగడం పోలీసుల పట్ల నేరస్థులకు భయం లేకుండా పోయిందని సూచిస్తోందన్నారు. హైదరాబాద్ నగరంలో మహిళలపై నేరాలు తీవ్రంగా పెరిగిపోయాయని, గన్‌తో బెదిరించి డబ్బులు దోచుకునే పరిస్థితి కూడా వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితులపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టి, పోలీసులకు కఠిన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.
హత్యకు గురైన స్వప్న న్యాయవాదిగా పనిచేస్తున్నారని గుర్తు చేసిన కవిత, లాయర్ల రక్షణ కోసం రూపొందించిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లుకు గతంలో సవరణలు చేసినప్పటికీ, రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంచారని విమర్శించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ బిల్లును పాస్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి మూడు నెలల్లోపు నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. నలుగురు నిందితుల్లో ఒకరిపై గతంలోనే హత్యాయత్నం కేసు ఉన్నట్లు తెలిపారు. నిందితులకు త్వరితగతిన శిక్ష పడకపోతే నేరస్థులకు భయం ఉండదన్నారు.
స్వప్న కుటుంబంలో ఇద్దరు పెద్దవాళ్లు ఉన్నారని, వారి కుటుంబానికి తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అలాగే గతేడాది హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదాల్లో 22 మంది మృతి చెందినప్పటికీ, ముఖ్యమంత్రి ఒక్కరి కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని విమర్శించారు. మున్సిపల్, హోం, విద్య శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉండటంతో వాటిపై సరైన దృష్టి పడటం లేదని అన్నారు. అందుకే నగరంలో నేరాలు పెరిగాయని ఆరోపించారు.
గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని, పాము కాట్లకు విద్యార్థులు బలవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న శాఖలపై దృష్టి పెట్టి, నేరాల నియంత్రణకు కృషి చేయాలని కవిత డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాయికల్ పలు వార్డులలో అభ్యర్థులకు మద్దతుగా డా బోగ శ్రావణి ఇంటింట ప్రచారం
రాయికల్ ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మున్సిపల్ 8వ వార్డ్ అభ్యర్థి మచ్చ నారాయణ మరియు 12వ వార్డ్ అభ్యర్థి కల్లెడ చిన్న ధర్మపురి కి మద్దతుగా అదేవిధంగా రాయికల్ పదవ వార్డు అభ్యర్థి ఆడెపు ప్రశాంతి మరియు 11వ వార్డు అభ్యర్థి పుర్రె శ్రీధర్... ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా.
జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ 40వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి
స్థానికంగా ఉంటూ ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటా.. జగిత్యాల పట్టణ 40వ వార్డు తన కుటుంబంగా భావిస్తాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా తక్షణమే స్పదింస్తా.. మరోమారు ఆశీర్వదించండి.... జగిత్యాల పట్టణం 3వ వార్డులో కారు అభ్యర్థికి జోరుగా ప్రచారం
జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)పట్టణం 3వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుమ్మడి సత్యం గౌడ్ కి మద్దతుగా ఇంటింటా తిరిగి ప్రచారం చేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ . ఏ ఇంటి గడప తట్టిన కూడా కేసీఆర్ పై అభిమానం తగ్గలేదని పేద ప్రజల... అనిల్ అంబానీ–ఇప్స్టీన్ ఫైల్ విశ్లేషణ: మోదీ, హార్దీప్ సింగ్ పూరి సంబంధాలు
అనిల్ అంబాని–జెఫ్రీ ఇప్స్టీన్ ఫైల్: మోదీ, హార్దీప్ సింగ్ పూరి సంబంధాలపై సంక్షిప్తంగా, సమగ్ర విశ్లేషణ
గత రెండు మూడు నెలలుగా, అమెరికాకు చెందిన నేరస్తుడు, దళారీ జాఫ్రీ ఎప్స్టీన్ మరియు అనెక మంది దేశాధినేతలతో, పారిశ్రామికవేత్తలతో, ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉన్నాడని, అనేక అరాచకాలు చేశాడని నేరారోపణలు ప్రచారంలో ఉన్నాయి.
.ఇతనికి శిక్ష... న్యాయవాది స్వప్న హత్య నిందితులకు వెంటనే శిక్ష విధించాలి: మెట్‌పల్లి బార్ అసోసియేషన్
మెట్‌పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు న్యాయవాది స్వప్న హత్యకు పాల్పడిన నిందితులకు వెంటనే కఠిన శిక్ష విధించాలని మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
స్వప్న హత్యను నిరసిస్తూ గురువారం మెట్‌పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. అనంతరం... ల్యాండ్‌మార్క్ తీర్పుకు కారణమైన న్యాయమూర్తికి మెట్‌పల్లి బార్ సన్మానం
మెట్‌పల్లి, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):
మంథని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా ఉన్న సమయంలో పోలీసుల ఫర్దార్ ఇన్వెస్టిగేషన్‌పై డి. నాగేశ్వరావు రచించిన ఆర్టికల్‌ను ఉదాహరణగా తీసుకుని అలహాబాద్ హైకోర్టుతో పాటు భారత సుప్రీంకోర్టు ల్యాండ్‌మార్క్ తీర్పు వెలువరించిన సందర్భంగా, ప్రస్తుతం మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి. నాగేశ్వరావును మెట్‌పల్లి బార్ అసోసియేషన్... మెట్‌పల్లి వరుస దొంగతనాల కేసులు ఛేదింపు : 7 మంది నిందితుల అరెస్ట్
మెట్‌పల్లిలో వరుస దొంగతనాల కేసులు ఛేదింపు
7 మంది నిందితుల అరెస్ట్ – 15 తులాల బంగారం, 32 తులాల వెండి స్వాధీనం
మెట్‌పల్లి, ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు):మెట్‌పల్లి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో జరిగిన వరుస దొంగతనాల కేసులను మెట్‌పల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ఏడుగురు నిందితులను... నాలుగు వారాల్లో తెలంగాణకు డీజీపీ నియమించాలి: సుప్రీంకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):
నాలుగు వారాల్లోగా తెలంగాణ రాష్ట్రానికి పూర్తిస్థాయి డీజీపీని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డీజీపీ నియామకానికి యూపీఎస్సీ అత్యవసరంగా సిఫార్సులు చేయాలని స్పష్టం చేసింది.
అర్హత కలిగిన అధికారుల జోన్ ఆఫ్ కన్సిడరేషన్ నుంచి వారి పరస్పర ప్రతిభ (ఇంటర్-సే మెరిట్) ఆధారంగా ఎంపిక జరగాలని పేర్కొంది. ఈ ప్రక్రియను... ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కులాల పేరిట దుర్భాషలాడరాదు
జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించవచ్చు కానీ తమ జాతి పేరిట ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెలమజాతి పేరిట కెసిఆర్ ను విమర్శించడం సరికాదని జగిత్యాల వెలమ సంక్షేమ మండలి అధ్యక్షులు ఐల్నేని సాగర్ రావు అన్నారు. గురువారం వెలమ సంఘ భవనంలో నిర్వహించిన... లాయర్ స్వప్న హత్య ఘటనపై సీఎం స్పందించాలి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత, లాయర్ స్వప్న ఉదంతం సమాజాన్ని... ప్రభుత్వ డిగ్రీ విద్యార్థుల క్షేత్ర పర్యటన
హుస్నాబాద్,ఫిబ్రవరి5,(ప్రజా మంటలు):
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపకులు కలిసి హుస్నాబాద్ లోని గోమాత జిన్నింగ్ మరియు ప్రెస్సింగ్ కాటన్ మిల్లును సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా రైతులు సేకరించిన పత్తిని ఏ విధంగా మిల్లులో శుభ్రం చేసి పత్తి గింజలను వేరు చేసి తెల్లని పత్తిని మిల్లులోని వివిధ యంత్రాల... యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
మిర్యాలగూడ, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
కార్యక్రమంలో నీలగిరి జిల్లా మహిళా సమాఖ్యకు రూ.1138 కోట్ల... 