దేశమే ప్రథమం – విభజన భాషకు చోటు లేదు: అండమాన్‌లో మోహన్ భాగవత్ కీలక సందేశం
పోర్ట్ బ్లెయిర్ డిసెంబర్ 13:
జాతీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ దేశభక్తి, జాతీయ ఏకత్వంపై గట్టి సందేశం ఇచ్చారు. దేశాన్ని అన్ని విషయాల కంటే ముందుగా ఉంచాలని, ఇది భారత్ కోసం జీవించే సమయం కానీ చనిపోయే సమయం కాదని స్పష్టం చేశారు. “మన దేశంలో మన దేశ భక్తి మాత్రమే ఉండాలి. ‘తుమ్హారే టుక్డే-టుక్డే హోంగే’ వంటి విభజనాత్మక భాషకు ఇక్కడ చోటు లేదు” అని అన్నారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో వీరసావర్కర్ రచించిన ప్రసిద్ధ గీతం ‘సాగర్ ప్రాణ తలమాలా’ 115వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేటి సమాజంలో చిన్నచిన్న విషయాలపై ఆలోచనా విధానాల తేడాలతో టकरార్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక గొప్ప దేశాన్ని నిర్మించాలంటే సావర్కర్ సందేశాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సావర్కర్ ఎప్పుడూ తాను మహారాష్ట్రవాడినని గానీ, ఏదైనా కులానికి చెందినవాడినని గానీ చెప్పలేదని, ఆయన ఎల్లప్పుడూ ‘ఒకే జాతి – ఒకే దేశం’ అనే ఆలోచనను బోధించారని భాగవత్ తెలిపారు. మనమంతా భారతీయులమనే భావనతో, దేశాన్ని అన్ని రకాల అంతర్గత విభేదాలకు మించి ఉంచాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దీవుల సమూహంలోని బియోదనాబాద్‌లో వినాయక్ దామోదర్ సావర్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మోహన్ భాగవత్‌తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ఆశిష్ శేలార్, పద్మశ్రీ హృదయనాథ్ మంగేశ్కర్, నటుడు రణదీప్ హుడా, శరద్ పొంక్షే, చరిత్రకారుడు డా. విక్రమ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
భాగవత్ శనివారం శ్రీ విజయపురంలో ఉన్న నేతాజీ స్టేడియంలో నిర్వహించనున్న విరాట్ హిందూ సమ్మేళనం సందర్భంగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
సావర్కర్ ఆశయాలను నెరవేర్చాలంటే స్వార్థాన్ని పక్కనపెట్టి దేశం కోసం పని చేయాలని, ప్రొఫెషనల్‌గా ఎదగండి, సంపాదించండి కానీ దేశాన్ని మర్చిపోవద్దని భాగవత్ పిలుపునిచ్చారు. దేశ నిర్మాణానికి సాధువులవ్వాల్సిన అవసరం లేదని, కానీ దేశాన్ని ఎప్పుడూ ముందుగా ఉంచాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే...గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం..- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
గొల్లపల్లి డిసెంబర్ 15 (ప్రజా మంటలు :అంకం భూమయ్య)
గొల్లపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆవుల జమున సత్యం (ఉంగరం గుర్తు) ఓటు వేసి గెలిపించాలని కోరారు.సత్యం వెనుక బిఆర్ఎస్ పార్టీ, కొప్పుల ఈశ్వర్, కెటిఆర్,... సామాజిక తెలంగాణయే నా ధ్యేయం.. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: X "ఆస్క్ కవిత"లో కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
సామాజిక తెలంగాణ సాధననే తన ప్రధాన లక్ష్యంగా తీసుకున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో జాగృతి పోటీలో ఉంటుందని వెల్లడించారు. సోమవారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నిర్వహించిన #AskKavitha కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఈ ఇంటరాక్షన్... వావ్...దంపతులిద్దరూ గెలిచారు... ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి..
సికింద్రాబాద్, డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోచమ్మల ప్రవీణ్(8వ వార్డు) మంజుల (10వ వార్డు) దంపతులు ఇద్దరు వేర్వేరు వార్డుల్లో పోటీ చేశారు. చిత్రం ఏమిటంటే ఇద్దరికి 98-98 ఓట్లు చొప్పున వచ్చాయి.
కాగా ప్రవీణ్ రామన్నపేట---... పాషం భాస్కర్ మృతిపై జి. రాజేశం గౌడ్ సంతాపం
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 15 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్, మండల అధ్యక్షుడిగా సేవలందించిన పాషం భాస్కర్ గారు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మారింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జి. రాజేశం గౌడ్ తన భార్య శ్యామలాదేవితో కలిసి పాషం... కవితమ్మపై తప్పుడు ప్రచారం ఆపాలి.. నిరాధార ఆరోపణలకు తీవ్ర పరిణామాలు: తెలంగాణ జాగృతి నేతలు
హైదరాబాద్ డిసెంబర్ 15. (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మపై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం జరుగుతోందని జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ ఆరోపించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
వి. ప్రకాష్ అనే వ్యక్తి... మోతే గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులను అభినందించి సత్కరించిన డా .భోగ శ్రావణి ప్రవీణ్
జగిత్యాల డిసెంబర్ 15 (ప్రజా మంటలు)మోతే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్లుగా గెలుపొందిన పల్లెకొండ రాజేశ్వరి-ప్రశాంత్ , ధనపనేని నరేష్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ మండల అధ్యక్షులు రాంరెడ్డి, సునీల్,ప్రశాంత్ మరియు... పొలాస గ్రామపంచాయతీ నూతన ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులను సత్కరించిన డా భోగ శ్రావణి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 15(ప్రజా మంటలు) మండలం పొలాస గ్రామం నూతన ఉపసర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ గెలుపొందగా ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలువగా గెలుపొందిన ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మిల్కూరి... భారత మార్కెట్‌లో బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ – ఢిల్లీకి మూడో డైలీ ఫ్లైట్
న్యూఢిల్లీ డిసెంబర్ 14:భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు బ్రిటిష్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్–యూకే మధ్య పెరుగుతున్న ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైట్ ఫ్రీక్వెన్సీలు పెంచడంతో పాటు సేవలను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
2026 నుంచి (అనుమతులకు లోబడి) లండన్ హీత్రో – న్యూఢిల్లీ మార్గంలో మూడో డైలీ... మెహదీపట్నం రైతు బజార్‌ను సందర్శించిన కవిత – మోడ్రన్ మల్టీ లెవల్ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలని డిమాండ్
మెహందీపట్నం డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
మెహదీపట్నం రైతు బజార్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు కనీస సదుపాయాలు కూడా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు లేకపోవటంతో చాలా మందికి ఇది రైతు... ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటే ఆయుధం: మాజీ మంత్రి రాజేశం గౌడ్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ గారు సతీమణి శ్యామలాదేవితో కలిసి ఓటు హక్కును వినియోగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు... సీసీ కెమెరాల నూతన నైపుణ్యాలపై భారత్ భవన్లో ముగిసిన మూడు రోజుల ప్రదర్శనలు
ఢిల్లీ డిసెంబర్ 14 (ప్రజా మంటలు)ఢిల్లీలో ప్రతి ఏటా సీసీ కెమెరాలపై ఎప్పటికప్పుడు వస్తున్న నూతన పోకడలు వాడే ఉపకరణాలపై ప్రదర్శనలు నిర్వహిస్తారు ఇదిలా ఉండగా ఈనెల 11 12 13 తేదీలలోభారత్ భవన్ మంటపం లో ప్రదర్శనలు నిర్వహించారు.
దీనిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ద్వారా రోబోలు సెక్యూరిటీగా వ్యవహరించడం... ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి : ప్రజా కళాకారులు, గ్రంథాలయాలు
నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా,.. నిజమైన ప్రజా ప్రతినిధులతో....
ఈనెల 13న రంగవల్లి విజ్ఞాన కేంద్రం( గ్రంథాలయం) వార్షికోత్సవం వేములవాడ దగ్గర మరియు ఆమె 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఒక సమావేశం రంగవల్లి విజ్ఞాన కేంద్రం కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నన్ను "ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకత" ' విమల మిగతా ముఖ్యులు
సభ... 