కాంగ్రెస్‌లో తలపడే రెండు సామ్రాజ్యాలు: ఒక పక్క రెడ్డి… మరో పక్క రావు
కానీ గద్దె మీద కూర్చున్నది మాత్రం సంజయ్!
డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి జగిత్యాలలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జీవన్ రెడ్డి ఆధిపత్యానికి సవాల్ విసిరిన సంజయ్ వర్గంగా నిలుస్తుంది.
జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏ పేరు సరిపోతుంది అంటే…
“వర్గాల వేటగాళ్ల లీగ్”
లేదా
“జగిత్యాల అడవి — రెండు పులులు, ఒక కుర్చీ”
ఎందుకంటే బయటకు కాంగ్రెస్ అంటే ఒకే పార్టీలా కనిపించినా…అసలు లోపల చూస్తే — అంతా గందరగోళమే.
కాంగ్రెస్ లో ముందు నుండి ఉన్న గిరి నాగభూషణం, అడువల లక్ష్మణ్ లాంటి వారి పరిస్థితి అయోమయంగా మారిపోయింది.
దళిత నాయకునిగా ఎదగాలని ఆశించే బండ శంకర్ పరిస్థితి మరి ఘోరం. వీరంతా పట్టిక సమావేశాల్లో కుర్చీలు ఖాళీగా లేకుండా, నింపే వారేనేమో!.jpg)
ఒక పక్క జీవన్ రెడ్డి “సీనియారిటీ సామ్రాజ్యం”
మరో పక్క MLA సంజయ్ “క్యాడర్ ఖండాంతర శక్తి”
మరి ఈ మధ్యలో అనేవారు…
తమ తమ వర్గాలకు పదవుల పులిహోర కలుపుకునే శ్రేణులు.అంతా మాయ.
సంజయ్ కాంగ్రెస్‌లో చేరిన రోజు…
జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కు గ్రహణం పట్టింది.అంతా తారుమారైందట!
సంజయ్ BRS నుండి గెలిచి కాంగ్రెస్‌లోకి వచ్చాక—
అతడే కాకుండా అతడి BRS క్యాడర్ కూడా ప్యాకేజీగా కాంగ్రెస్‌లో ల్యాండ్ అయ్యింది.
ఇప్పుడు ఆ క్యాడర్‌కు ఒకే మాట:
“మా MLA → మేం గెలిపించాం → కాబట్టి పార్టీ ఏదైనా, బాస్ మా MLA!”ఇక జీవన్ రెడ్డికి అప్పటి నుండి పరిస్థితి ఏమిటంటే…
“నేను జీవితాంతం కాంగ్రెస్ కోసం పని చేశాను…
కానీ MLA కోసం కొత్తగా, కొత్త క్యాడర్ రెడీ అయిపోయాడు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ ను నమ్ముకొన్న మా గతేమిటని ప్రశ్నిస్తే, తాత్కాలికంగా శ్రీధర్ బాబు, అది శ్రీనివాస్ ఓదార్చారు. ఇక అంతే, ఇటు వైపు చూసేవారు లేరు.!”
అందుకే ఆయన ఇప్పుడు ప్రయత్నిస్తున్నది —
తన ఉనికి, తన ప్రభావం, తన క్యాడర్‌ను బతికించుకోవడమేనాని స్థానికులు ప్రశ్నించుకొంటున్నారు.
సంజయ్ మౌనం కూడా రాజకీయ ఆయుధమే!
జగిత్యాలలో ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉందేమిటి?
- సంజయ్ మాట్లాడడు
- మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు
- మాట్లాడకపోవడమే ఆయన శక్తి
మరి జీవన్ రెడ్డి పరిస్థితేమిటంటే…
మాట్లాడకుండా ఉండే పరిస్థితి లేదు.
ఎందుకంటే ఆయన మాట్లాడకపోతే—
తన క్యాడర్ మరింత జారిపోతుందనే భయం! అందుకే రోజుకో ప్రెస్ మీట్, గంటకో ఆరోపణ, నిమిషానికో విమర్శ.
అయినా ఎదుటి వర్గం నుండి కానీ, పార్టీ అధిష్టానం నుండి కానీ స్పందన లేదు.
మాజీ చైర్మన్ల పరుగు – ఎవరి వైపు?
పాత రెడ్డి గారి దగ్గరా?
లేక కొత్త శక్తివంతమైన సంజయ్ గారి దగ్గరా?**
ఒకప్పుడు జీవన్ వద్దే పట్టు వేసి తిరిగే మాజీ మున్సిపల్ చైర్మన్లు…
ఇప్పుడు MLA సంజయ్‌ను పట్టుకుని నేరుగా ముఖ్యమంత్రివద్దకు వెళ్లడం —
ఇది నిజానికి RGV సినిమా ట్విస్ట్‌లా క్యారెక్టర్ రివర్స్.
40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని, జీవన్ రెడ్డి కొరకు ఖర్చుచేసిన గిరి నాగభూషణం, జీవన్ రెడ్డి దగ్గర భవిష్యత్ లేదని, కొత్తగా చేతిని MLA సంజయ్ తో చేరి, ముఖ్యమంత్రిని కలిశాడు.పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటుందని, మీకు తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. యాడది గడిచిపోయింది. మళ్ళీ పట్టించుకున్న కారు లేరు.
జిల్లా స్థాయిలోపడవి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి అడిగినా, అదే ఏదో ఒక "రావు" కి అంటూ తప్పించుకుంటున్నారట.
ఇక మున్సిపల్ చైర్మన్ గా చేసిన గిరి నాగభూషణం కు మిగిలింది ఏమిటి? జీవన్ రెడ్డిని విడిచి, MLA వైపు వచ్చిన మొదటి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఈయన. ఇక్కడా ఆయనకు దక్కింది ఏమి లేదు.
ఇన్నాళ్లు జీవన్ రెడ్డితో ఉన్న నాయకులు:
“సర్వజ్యోతిష్యానుకూలంగా” సంజయ్ వైపు జంప్.
ఆ జంప్ చూసి జీవన్ చెబుతున్నారట:
“ఇదంతా తెరవెనుక ఒక మంత్రి ప్లాన్!” అంటే, గతంలో ఉన్న మనస్పర్థల వల్ల, శ్రీధర్ బాబు, జగిత్యాలలో, జీవన్ రెడ్డి కథ ముగించే పనిలో ఉన్నాడని.
అయినా…
ముఖ్యమంత్రిని కలిసి ఫోటోలు దిగినప్పుడు ముఖాల్లో కనిపించిన సంతోషం చూస్తే —ఇప్పుడు ఎవరి ముఖంలో కనపడడం లేదు.
అది ప్లాన్ కాదు…పదవుల పరిమళం!
నామినేటెడ్ పోస్టుల్లో సంజయ్ వర్గం దూసుకెళ్తే…
జీవన్ రెడ్డి మీడియా ముందు మంటలు! ఇటీవల నియమించిన కొన్ని ఆలయ పాలకవర్గాల పోస్టులు
సంజయ్ వర్గానికే దక్కాయి.
దీంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ముఖం మీద
“నో కామెంట్” అన్నట్టుండే వ్యంగ్య చిరునవ్వు కాకుండా
ప్రత్యక్షంగానే మీడియా ముందు మండిపడే ప్రసంగాలు మొదలయ్యాయి. ఒకనాటి అనుంగ శిష్యుడు, నేటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందు ఆవేశంగా, తన అక్కసు వెళ్లగక్కారు. అయినా, ఆయన చేయగలిగింది, చేసింది, ఏమీ లేదు.
“ఎవరి పూర్వపరాలు ఏమిటో తెలుసుకోవాలి!” అంటూ ఆరోపణలు.అంటే సింపుల్‌గా:
సంజయ్ వర్గం గెలుపు = జీవన్ గారి అక్రోషం.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి జీవన్ వద్దకు వచ్చిందని…
వర్గపోరు ముగిసిందా? హాహా… ఇంకా మొదలైంది!**
జీవన్ రెడ్డి తన వర్గానికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి తెచ్చుకుని,కొంచెం పుంజుకున్నట్టు కనిపించినా—
అది రాజకీయంగా “ఓ చిన్న విశ్రాంతి కుర్చీ” మాత్రమే.
ఎందుకంటే, సంజయ్ వర్గంలో అంతా వ్యాపారస్తులు. వారు పార్టీ పదవి తీసుకొని, పార్టీకే డబ్బులు ఖర్చుపెట్టగలిగి, రాజకీయంగా ఎదగాలనే, తపన,ఆశలు ఉన్నవారు ఎవరు లేరు. అంతా, స్థానిక ఆధిపత్యం చాలు అనే అల్ప సంతోషులు.
అందుకే, బిసి వర్గానికి చెందిన జీవన్ రెడ్డిని ఒకరోజు తీవ్రంగా విమర్శించిన వ్యక్తికే ఆ పదవి వచ్చింది. నిజానికి, అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోమని పార్టీ కోరినా, చెప్పుకో దగ్గ వారెవరు దరఖాస్తు చేసుకోలేదట.
ఇక్కడ అసలు ప్రశ్న:
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?అని కాదు. నామినేటెడ్ పదవులు ఎవరి వర్గానికే వస్తాయి? క్యాడర్ గుసగుసలాడుతుంది.
ఈ విషయాలేవీ ప్రజలు పట్టించుకోరు.
కానీ కేడర్ మాత్రం అడుగుతున్నది:
“గ్రంథాలయ సంస్థ ఎవరికో?
మార్కెట్ కమిటీలు ఎవరికో?
నీటి సంఘాలు ఎవరికి వెళ్తాయో?”
అన్నీ ఒకే దిశగా చూపుతున్నాయి:
సంజయ్ దగ్గరే రిమోట్ కంట్రోల్.
ముగింపు:
జగిత్యాల కాంగ్రెస్ —
ఒకే పార్టీ కాదు…
రెండు నాయకులు, రెండు వర్గాలు, రెండు రాజ్యాలు!**
- జీవన్ రెడ్డికి అనుభవం
- సంజయ్‌కు క్యాడర్ + శక్తి + ఆర్థిక బలం
- వర్గాలకు పదవుల ఆకలి
- అధిష్టానానికి సైలెన్స్
మరి జగిత్యాలలో ప్రధాన ప్రశ్న:
రెడ్డి వర్గమే గెలుస్తుందా?
రావు వర్గమే పైచేయి సాధిస్తుందా?
లేక సంజయ్ ఒక్కరే కొత్తగా, జగిత్యాలను ఏలుతారా?
ప్రస్తుత పరిస్థితి చూస్తే —
“జగిత్యాలలో చక్రం సంజయ్ వైపే తిరుగుతోంది”
అనే మాటను కేడర్ బహిరంగంగానే అంటోంది.కాంగ్రెస్ అధిష్టానం, ఇక తాంబూలాలు ఇచ్చాం... కొట్టుక....అన్న కన్యాశుల్కంలోని నానుడిగా ఉంది పరిస్థితి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరు ఎంత మందిని గెలిపించుకొని, ఆధిపత్యం నిలుపుకొంటారా అని ప్రజలు వింత పరిస్థితిని, ఆశ్చర్యంగా చూస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీసీలకు దక్కింది 17.087% గ్రామ పంచాయతీలే: గతం కంటే 8% తక్కువ
ప్రభుత్వం ప్రకటించిన బిసి రిజర్వేషన్ల జాబితా బీసి నాయకుల నుండి విమర్శలను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 42% రిజర్వేషన్లు ఇవ్వకపోగా, గత ఎన్నికల్లో ఇచ్చిన 25 % కూడా కేటాయించలేకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఈ విషయంలో బిసి నాయకులు కోర్టుకు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
✔ప్రభుత్వం హామీ (42%)
✘ అమలైన... చైనా–అరుణాచల్ పాస్‌పోర్ట్ వివాదం: భారత మహిళను 18 గంటలు నిర్బంధించిన ఘటన
న్యూఢిల్లీ/బీజింగ్ నవంబర్ 25 (మా ప్రత్యేక ప్రతినిధి):
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారతీయ మహిళను శాంఘై పుడోంగ్ విమానాశ్రయంలో చైనా అధికారులు “మీ పాస్‌పోర్ట్ చెల్లదు, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం” అంటూ 18 గంటలపాటు నిర్బంధించిన ఘటన భారత్–చైనా మధ్య మరల ఉద్రిక్తతలకు దారి తీసింది.
లండన్ నుంచి జపాన్‌కు ట్రాన్సిట్ ప్రయాణం... నల్లగొండ కాంగ్రెస్‌లో డీసీసీ రగడ: కోమటిరెడ్డి ఆగ్రహంతో రాజకీయాల కుదుపు
నల్లగొండ నవంబర్ 25 (ప్రజా మంటలు):
నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో డీసీసీ నియామకం పెద్ద అంతర్గత కలహాలకు దారితీసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్‌ను నియమించడం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.
తనపై, తన కుటుంబంపై కైలాష్ అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాడని ఆరోపించిన కోమటిరెడ్డి, అలాంటి... “ఇందిరమ్మ చీరలు – ఎన్నికల కోసమే కాంగ్రెస్ తొందర”: జగిత్యాల BRS నేతల విమర్శలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 25 (ప్రజా మంటలు):
జిల్లా BRS పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం హుటాహుటిన ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’ ప్రారంభించిందని, ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే సంబంధించిన కార్యక్రమమని... ఏపీకే ఫైళ్లు ఓపెన్ చేస్తే హ్యాకింగ్ ప్రమాదం
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు) : తెలియని మూలాల నుంచి వచ్చే APK ఫైళ్లను ఓపెన్ చేయకూడదని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఇలాంటి ఫైళ్లు ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాకింగ్‌కు గురై వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలు దొంగిలించే అవకాశం ఉందని తెలిపారు.
RTO Challan.apk, Aadhar.apk, SBI.apk, PM... చాచా నెహ్రూ నగర్‌లో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు):
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు మంగళవారం చాచా నెహ్రూ నగర్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానికులు, దుకాణదారులకు సైబర్ మోసాల గురించి వివరించి, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1930 వినియోగంపై సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా పాంప్లెట్లు కూడా... గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లపై నుండి వెళ్లిన విద్యుత్తు లైన్లు మరమత్తు కొరకు శంకుస్థాపన
(అంకం భూమయ్య(
గొల్లపల్లి నవంబర్ 25 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని శ్రీరాములపల్లె లో విద్యుత్ వైర్లు, విద్యుత్ పనులకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
ధర్మపురి నియోజకవర్గంలోశ్రీరాములపల్లె,... భక్తి శ్రద్దలతో 350వ శహీద్ దినోత్సవం : నగర్ కీర్తన్ లో భక్తుల రద్దీ
ఆకట్టుకున్న యోధ కళాకారుల కత్తి ప్రదర్శనలు...
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు) :
సిక్కుల తొమ్మిదవ మత గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ సాహెబ్‌జీ 350వ శహీద్ దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన నగర్ కీర్తన్ ఘనంగా జరిగింది. శబద్ కీర్తనాలు, సాహాస కృత్యాలైన సిక్కు కళ గట్కా యోధ కళ ప్రదర్శనలు... పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ – మూడు విడతల్లో పోలింగ్
ఈ క్షణం నుంచే ఎలెక్షన్ కోడ్ అమల్లోకి
హైదరాబాద్ నవంబర్ 25 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు కమిషనర్ ప్రకటించారు.
🗳️పోలింగ్ షెడ్యూల్
1️⃣ తొలి విడత – డిసెంబర్ 11
2️⃣ రెండో విడత –... కాంగ్రెస్‌లో తలపడే రెండు సామ్రాజ్యాలు: ఒక పక్క రెడ్డి… మరో పక్క రావు
డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి జగిత్యాలలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జీవన్ రెడ్డి ఆధిపత్యానికి సవాల్ విసిరిన సంజయ్ వర్గంగా నిలుస్తుంది.
జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏ పేరు సరిపోతుంది అంటే…“వర్గాల వేటగాళ్ల లీగ్”లేదా“జగిత్యాల అడవి — రెండు పులులు, ఒక కుర్చీ”
ఎందుకంటే బయటకు కాంగ్రెస్... కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చెయ్యడమే ప్రభుత్వం లక్ష్యం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 25 (ప్రజా మంటలు) సామ సత్యనారాయణ
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో ఏర్పడ్డ ప్రజపాలన ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేసే దిశగా అడుగులు వేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన వడ్డీలేని రుణాల పంపిని కార్యక్రమం... రెండేళ్ళ బాబుకు అరుదైన ‘బబుల్- హెడ్ డాల్ సిండ్రోమ్ వ్యాధి.
మెడికవర్ హాస్పిటల్స్ లో క్లిష్టమైన శస్త్రచికిత్స సక్సెస్
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు):
అత్యంత అరుదైన బబుల్-హెడ్ డాల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న రెండేళ్ళ చిన్నారికి సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు న్యూరో-ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి, పున:ర్జన్మ ప్రసాదించారు. ఈమేరకు మంగళవారం సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్యులు ఇందుకు సంబందించిన... 