గవర్నర్ కేటీఆర్ ను ఈ ఫార్ములా కేసులో విచారించడానికి అనుమతించడం బిజెపి, కాంగ్రెస్ ల రాజకీయ కుట్ర
రాయికల్ నవంబర్ 21(ప్రజా మంటలు)
ఈ ఫార్ములా కేసులో గవర్నర్ కేటీఆర్ ని విచారించడానికి అనుమతించడం అంటే కాంగ్రెస్ బిజెపి పార్టీల రాజకీయ కుట్ర అన్నారు దావ వసంత సురేష్
రాయికల్ పట్టణంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో కేటీఆర్ పై పెట్టిన ఫార్ములా ఈ రేస్ కేసుపై స్పందించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
మూడు నాలుగు నెలలకు ఒకసారి లేదా ఎన్నికల ముందో, ఇంకేదైనా ఇంపార్టెంట్ అంశాన్ని కనుమరుగు చేయడం కోసమో మీడియాలో ఫార్ములా-ఈ అంటూ హడావిడి చేయడం ప్రజల దృష్టి మళ్లించడం రేవంత్‌కు అలవాటైన స్క్రిప్ట్.
ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గొంతును ఏ విధంగానైనా నొక్కాలని కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు.
* ఫార్ములా ఈ నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగలేదని మీడియాతో చాలాసార్లు కేటీఆర్ చెప్పారు,
డబ్బులు అత్యంత పారదర్శకంగా ఆన్లైన్లోనే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాక అవినీతికి తావు ఎక్కడ ఉందని అన్నారు.
* ఫార్ములా ఈ రేస్ వల్ల పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ప్రోత్సహించేందుకు నిర్వహించబడతాయని అన్నారు.
పెట్టుబడుల ఆకర్షణకు అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతగా భావించి ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రిక్ మహనాల తయారీలో తెలంగాణ రాష్ట్రాలను హబ్ గా మార్చాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ముబిలిటీ వీక్ నిర్వహించింది ఈ వారోత్సవాల్లో భాగంగానే ఫార్ములా ఈరేస్ నిర్వహించింది.
ఒకవేళ ఎలక్టోరల్ బాండ్స్ అంశాన్ని కనుక రేవంత్ సర్కార్ అవినీతి కింద చూపించాలనుకుంటే అందరికంటే ఎలక్టోరల్ బాండ్స్ పొందినందుకు ఆయన బిగ్ బాస్ మోడీ స్మాల్ బాస్ రాహుల్ గాంధీ ఇద్దరిని అరెస్టు చేయవలసి ఉంటుందని అన్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పరిస్థితి వల్ల రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలన్న కూడా పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని అన్నారు.
* బిఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాదులోకి అనేక పట్టుబడులు వచ్చాయని మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ కు వరుసగా ఐదుసార్లు అవార్డు అందుకున్న ఘనత కేటీఆర్కి చెందిందని ఈ సందర్భంగా అన్నారు.
ఫార్ములా ఈ రేస్ హైదరాబాదులో నిర్వహించడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అని అన్నారు.
కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని అనడానికి ఫార్ములా ఈ రేస్ కేసు ఒక ఉదాహరణ అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
రేవంత్ రెడ్డికి అభివృద్ధి చేతగాక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మారాల్చి ఈ ఫార్ములా కేసు విచారించడానికి గవర్నర్ ఆమోదించడం అంటే కాంగ్రెస్ బిజెపి ఇద్దరు కలిసి కెసిఆర్ ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టే కెసిఆర్ ని కేటీఆర్ ని బద్నాం చేయాలని బిజెపి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి కుట్ర పన్నుతున్నాయని అన్నారు.
నాయకుడు అంటే కక్ష సాధింపు చర్యలు కాదని ఇచ్చిన హామీలు ప్రజలకు అమలు చేయాలని అన్నారు.
* మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా కేటీఆర్ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు గా ఉంటారని ప్రజల పక్షాన పోరాడుతారని ఇలాంటి కేసులకు భయపడే లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఏలేటి అనిల్ కుమార్ మండల అధ్యక్షుడు బర్కాం మల్లేష్ కో ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరంపెల్లి రాణి సాయి కుమార్ రాయికల్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్ మాజీ కౌన్సిలర్ లు సాయి కుమార్ సువర్ణ నాయకులు శ్రీరాముల సత్య నారాయణ రాజేందర్ గౌడ్ లింగం గౌడ్ రాం చంద్రం వినోద్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ
గొల్లపల్లి, నవంబర్ 21 (ప్రజా మంటలు):
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రాఘవపట్నంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గతంలో కట్టుకున్న ముడుపును ఈరోజు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన దేవాలయ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహాయం... ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్?
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ సమర్పించనున్న నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణల ప్రకారం, గత ఎన్నికలలో... తెలంగాణలో 32 మంది IPS అధికారుల – సంచలన రీషఫుల్
హైదరాబాద్ నవంబర్ 20 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రభుత్వం ఈరోజు భారీ స్థాయిలో పోలీస్ శాఖలో మార్పులు చేపట్టింది. మొత్తం 32 మంది IPS అధికారుల బదిలీలు, కొత్త పోస్టింగులను ప్రకటిస్తూ జి.ఓ. 1632ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కీలక కమిషనరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాలు, స్పెషల్ బ్రాంచ్‌లలో ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి.... హైదరాబాద్‌లో రూ.5 లక్షల కోట్లు భూ కుంభకోణం
హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాలను మరోసారి కుదిపేసేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారీ భూ కుంభకోణ ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని 9,500 ఎకరాల పారిశ్రామిక వాడల భూములు రేవంత్ రెడ్డి తన బంధువులు, స్నేహితులకు కట్టబెడుతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
"₹4... సందేశాత్మక చిత్రాలను ప్రజలు అదరించాలి తెలంగాణ సినీ నిర్మాత లు భరత్ కుమార్ అంకతి,పుల్లురి నవిన్
మెట్ పెల్లి నవంబర్ 21(ప్రజా మంటలు)సందేశాత్మక చిత్రాలను ప్రజలు ఆదరించాలని తెలంగాణ సినీ నిర్మాతలు భరత్ కుమార్ అంకతి పుల్లూరి నవీన్ లు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని లక్ష్మీ థియేటర్ లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన దర్శకుడు రాజ్ నరేంద్ర... ఏరోస్పేస్ పార్క్ నిర్వాసితులతో కవిత సమావేశం – సమస్యలకు న్యాయం చేస్తామని హామీ
ఇబ్రహీంపట్నం–ఎలిమినేడు, నవంబర్ 21 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లాలో జనం బాట పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎలిమినేడు గ్రామాన్ని సందర్శించారు. ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన రైతులతో ఆమె సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కవిత మాట్లాడుతూ—“మనకు సమస్య వచ్చినప్పుడు మనమే చెప్పుకుంటేనే పరిష్కారం... గవర్నర్ కేటీఆర్ ను ఈ ఫార్ములా కేసులో విచారించడానికి అనుమతించడం బిజెపి, కాంగ్రెస్ ల రాజకీయ కుట్ర
రాయికల్ నవంబర్ 21(ప్రజా మంటలు)ఈ ఫార్ములా కేసులో గవర్నర్ కేటీఆర్ ని విచారించడానికి అనుమతించడం అంటే కాంగ్రెస్ బిజెపి పార్టీల రాజకీయ కుట్ర అన్నారు దావ వసంత సురేష్
రాయికల్ పట్టణంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో కేటీఆర్ పై పెట్టిన ఫార్ములా ఈ రేస్ కేసుపై స్పందించిన జిల్లా తొలి జడ్పీ... బహుముఖ ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ
కవిగా, సంపాదకుడిగా, సినిమా పాటల రచయితగా, వ్యంగ్య కవిగా, ‘రన్నింగ్ కామెంటరీ’ లాంటి వినూత్న ప్రక్రియల సృష్టికర్తగా, వ్యాపార ప్రకటనల సృజనకారుడిగా, బహుముఖమైన ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ (ఖ్వాజా హుస్సేన్ ) గారి వర్ధంతి జ్ఞాపకం !
- బండ్ల మాధవరావు
(మహమ్మద్ గౌస్ FB నుండి)
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
దేవిప్రియ గారు 1949 ఆగష్టు 15న గుంటూరులో... ప్రపంచ బాక్సింగ్ కప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్: సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్, నవంబర్ XX (ప్రజా మంటలు):
ప్రపంచ బాక్సింగ్ కప్ తుది పోరులో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు.
గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ మరోసారి... ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు కల్పించిన మంత్రికి ధన్యవాదాలు
కాగజ్‌నగర్, నవంబర్ 20 (ప్రజా మంటలు):
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు తప్పనిసరిగా అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కఠిన ఆదేశాలు జారీ చేసిన విషయం సీనియర్ సిటిజెన్స్‌లో హర్షాన్ని కలిగించింది.
సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్త... న్యూ అశోక్ నగర్‌లో కార్తీక దీపోత్సవం
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ పార్సిగుట్టలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం కార్తీక మాసం చివరి రోజున బీజేపీ సీనియర్ మహిళా నేత మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె,... చిలకలగూడ పోలీసులకు శిక్షణ :ముగిసిన రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్
సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) :
రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి, సిటీ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు చిలకలగూడ డివిజన్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు గురువారం రెండో రోజూ కొనసాగాయి. పోలీస్ సిబ్బందికి ఫైనాన్షియల్, సెల్ఫ్ డిసిప్లిన్, తదితర అంశాలపై ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ టీ.టీ. లిజేశ్, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడంపై న్యూ... 