కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి మృతి
కాకినాడ అక్టోబర్ 23:
కాకినాడ జిల్లా తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికపై జరిగిన లైంగిక దాడి యత్నం కేసు విషాదంగా మారింది. నిందితుడు నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువులోకి దూకి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే— నిన్న మధ్యాహ్నం సమయంలో నారాయణరావు అనే వ్యక్తి, తాను బాలికకు తాతయ్యనని చెప్పి గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్లాడు. అనంతరం సమీపంలోని తోటలోకి తీసుకెళ్లి లైంగిక దాడి ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, స్థానికుడు అనుమానం వ్యక్తం చేసి నిలదీయడంతో ఈ విషయం బయటపడింది.
బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు వెళ్తున్న సమయంలో, టాయిలెట్‌కు వెళ్తానని చెప్పి నారాయణరావు చెరువులోకి దూకాడు. రాత్రంతా వెతికినా మృతదేహం దొరకలేదు.
ఉదయం ఫైర్ సిబ్బంది, పోలీసుల సహాయంతో గజ ఈతగాళ్లు చెరువులో శోధించగా మృతదేహం బయటపడింది.
“నారాయణరావు చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని లేదా ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నాం,” అని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలి బంధువులు,“తాతయ్యనని చెబితే పాఠశాల నుంచి ఎలా పంపించారో?”అని గురుకుల నిర్వాహకులను ప్రశ్నించారు.
ఇక, పోలీసులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ను కూడా విచారిస్తున్నారు.ఈ ఘటనతో తుని పరిసరాల్లో ఆందోళన నెలకొంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
1.jpeg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా

మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.

మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు

మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

తెలంగాణ IAS అధికారి రిజ్వీ స్వచ్ఛంద విరమణ – మద్యం టెండర్ వివాదం నేపథ్యంగా
.jpeg)
భోపాల్‌లో దీపావళి విషాదం: కార్బైడ్ గన్స్ పేలుళ్లతో 60 మందికి పైగా గాయాలు, పిల్లలు చూపు కోల్పోయిన ఘటనలు
