రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు యూరియా కొరత లేకుండా చూస్తాం - ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
బోనస్ డబ్బులు కూడా సాధ్యమైనంత త్వరగా రైతులకు అందేలా చర్యలు తీసుకుంటాం
ధర్మపురి ఫిబ్రవరి 20:
ధర్మపురి మండలం జైన గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని గురువారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండల నాయకులతో కలిసి సందర్శించి,రైతులతో మాట్లాడారు.
*ధర్మపురి మండలం జైన గ్రామంలో యూరియా నిల్వలు సరిపడ లేక పంట సాగుకు కొంత ఇబ్బందికి జరుగుతుందని రైతులు నా దృష్టికి తీసుకురావడం జరిగిందని,వెంటనే సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ,మరియు డైరెక్టర్,జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ధర్మపురి నియోజక వర్గంలోని 12 సహకార సంఘాలకు సరిపడ యూరియాను పంపించాలని కోరడం జరిగిందని,వారు కూడా వెంటనే స్పందించి ఈ రోజు రాత్రి వరకు యూరియాను పంపించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని,రైతులు ఎలాంటి అందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
గత ఏడాది కంటే ఈ సారి కొంత రైతులు ఎక్కువ యూరియాను వాడటం జరుగుతుందని,ఇతర పంటల వైపు కూడా రైతులు మొగ్గు చూపడంతో కొత్త యూరియా వాడకం ఎక్కువగా అవ్వడం జరిగిందని,అయినప్పటికీ రైతులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులతో మాట్లాడి యూరియాను పంపిస్తామని,వడ్ల కొనుగోలు కూడా ఎక్కడ కట్టింగ్ లేకుండా పూర్తి చేయడం జరిగిందని,కానీ గత పాలకులు మాత్రం రైతులను మిలర్లతో మాట్లాడుకోండి అని వ్యగంగా సమాధానం చెప్పడం జరిగిందని,కానీ మేము అలా కాకుండా సమస్య ఉంది అని తెలిసిన వెంటనే సొసైటి వద్దకు వచ్చి రైతులతో మాట్లాడటం జరిగిందని తెలిపారు.
అదే విధంగా బొనస్ డబ్బులు కూడా కొంత మంది రైతులకు రాలేదు అని చెప్పడం జరిగిందని,రైతులకు పూర్తిగా మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని,బోనస్ కూడా సాధ్యమంత త్వరలో రైతులకు అందేలా చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)