అమెరికాలోని 90 వేల మంది విద్యార్థులను భారత కేంద్ర ప్రభుత్వం కాపాడాలి - సీక్ చాంద్ పాషా
అమెరికాలోని 90 వేల మంది విద్యార్థులను భారత కేంద్ర ప్రభుత్వం కాపాడాలి - సీక్ చాంద్ పాషా
హైదరాబాద్ ఫిబ్రవరి 08:
మారిన అమెరికాలోని పరిస్థితులలో, నరకయాతన అనుభవిస్తున్న బారతీయ విద్యార్థులను స్వయంగా కేంద్రమే విమాన సర్వీసులు ఏర్పాటు చేసి స్వదేశానికి తీసుకురావాలని, స్వదేశానికి విద్యార్థులు వచ్చేలా కృషి చేయకుంటే ఆందోళనలను కొనసాగిస్తామని
ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్. టిపిసిసి ప్రతినిధి డాక్టర్ షేక్ చాంద్ పాషా డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ తొ కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు
అమెరికాలోనే 90 వేల మంది భారతీయులు విద్యాభ్యాసం, విద్యతోపాటు ఉద్యోగం కోసం వెళ్లిన విద్యార్థిని, విద్యార్థులు గత ఎనిమిది నెలలుగా అక్కడి ప్రభుత్వం చేతిలో ఉగ్రవాదుల కంటే హీనంగా చేతులకు కాళ్లకు బెడీలు వేసి నరకయాతన చూపించి, ఒక తొమ్మిది మందిని మన దేశానికి పంపించిందని, ఇంకా 90 వేల మంది విద్యార్థులను, నెలలుగా అక్కడ నాన నరకయాతన పడుతున్న విద్యార్థులను విడిపించుకు రావడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ విఫలమయ్యారని ఎన్నారై సెల్ కన్వీనర్, టీపీసీసీ ప్రతినిధి డాక్టర్ షేక్ చాంద్ పాషా విలేకరుల సమావేశంలో విమర్శించారు.
అక్కడి ట్రంప్, అమెరికా ప్రభుత్వం, అక్కడి ఎంబసీ అధికారులు, అక్కడ ఉన్నవి అక్రమ విద్యాలయాలు అయితే, అమెరికా ప్రభుత్వం తోపాటు, అక్కడి రాయబార, ఎంబసీ, అధికారులనిర్లక్ష్యం చేసిన వారిపై అమెరికా ప్రభుత్వం, అక్కడి అధికారుల విద్యాలయాల పై చర్యలు చేపట్టాలి కానీ, భారతీయ విద్యార్థులపై చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసం అని, కేంద్ర ప్రభుత్వం 8 నెలలుగా మన కేంద్ర ప్రభుత్వం ఇంత జరుగుతున్న నిద్రవస్థలో ఉందా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ప్రణ ముఖర్జీ హాయo లో దుబాయిలో ఇలాంటి సంఘటనలు తలెత్తినప్పుడు, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గా ఉమ్మడి ఏపీ తెలంగాణ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్, అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ సింగ్ కు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కి లేఖలు రాస్తే, వెంటనే వారు స్పందించి ఎన్నారై హై కమిషన్ వెల్ఫేర్ పాండ్ ఏర్పాటు చేసి దుబాయిలో నుండి తిరిగి భారతీయులను అక్కడి నుండి స్వదేశానికి తీసుకొచ్చారని డాక్టర్ షేక్ చాంద్ పాషా అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో కొంచెం తర్వాత ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ వెల్ఫేర్ పాండు ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ పాండులో వేలకోట్ల డబ్బు ఉందని, అప్పటి కేంద్ర మంత్రి దివంగత నేత సుష్మ స్వరాజ్ స్వయంగా పార్లమెంటులో ఈ విషయం తెలియజేశారని ఆయన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ ఫండ్ ఏమైందని, రద్దు చేశారా, లేదా కొనసాగుతుందా, ఒకవేళ కొనసాగితే, అమెరికాలో నరకయాతన అనుభవిస్తున్న 90 వేల విద్యార్థులను కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ పండు వెల్ఫేర్ వెల్ఫేర్ పండు నుంచి వెల్పేర్ ఫాండ్ లోవేల కోట్ల రూపాయలతో, స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసి, ప్రత్యేక విమానాల ఏర్పాటు చేసి, ఒక విద్యార్థి మిస్ కాకుండా చూసి స్వదేశానికి తీసుకురావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అమెరికాలో 8 నెలలుగా విద్యార్థులకు అనుభవిస్తున్న, జాతీయ పత్రికలు కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజలకు తెలియజేసిన ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయడం ఏమిటని ఎన్నారై సెల్ కన్వీనర్, టీపీసీసీ ప్రతినిధి డాక్టర్ షేక్ చాంద్ పాషా కేంద్ర ప్రభుత్వ తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురుబిజెపి ఎంపీలు అమెరికాలో నరకయాతన అనుభవిస్తున్న విద్యార్థుల ఎందుకు నోరు మెదపడం లేదు అర్థం కావడం లేదని ఆయన ఆరోపించారు.
కేంద్ర మంత్రి కిసాన్ రెడ్డి సైతం ఎన్నికల్లో కరీంనగర్ కు వచ్చినప్పుడు ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ పాండ్ ఏర్పాటు చేస్తామని హామీని ఇచ్చి మర్చిపోయారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి, అక్కడి ప్రభుత్వంతో చర్చించి, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా విద్యార్థులను స్వదేశానికి తీసుకురావాలని, అక్కడి ఎంబసీ, అక్కడి ఇమిగ్రేషన్, అక్కడి అక్రమ కాలేజీల ఏర్పాటుపై, అమెరికా ట్రంప్ ప్రభుత్వం అక్కడి అధికారులపై చర్యలు చేపట్టాలి కానీ, భారతీయుల విద్యార్థులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, అక్రమంగా నరకయాతన చూపించడం సరైంది కాదని ఆయన అన్నారు.
ఇప్పటికైనా ప్రధాని మోడీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకుని అమెరికాలో నరకయాతన అనుభవిస్తున్న విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి కేంద్ర ప్రభుత్వమే తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు,ఎంపీలు సైతం 90 వేల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం క్షేమంగా అమెరికాలో ఉన్న 90 వేల విద్యార్థులను కేంద్ర ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పించి స్వదేశానికితీసుకురావాలని ఆయన కోరారు. లేనియెడల పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా, విద్యార్థుల తల్లిదండ్రులను, పలు వివిధ పార్టీల, కమ్యూనిస్టు పార్టీల, అన్ని పార్టీల సహకారంతో ఉద్యమాన్ని 90 వేల మంది విద్యార్థులు క్షేమంగా వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్, టీపీసీసీ డాక్టర్ షేక్ చాంద్ పాషా హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
