పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 30 (ప్రజా మంటలు) :
జగిత్యాల పట్టణంలోని చైతన్య పబ్లిక్ స్కూల్ 1996 - 97 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించుకున్నారు.
జగిత్యాల పట్టణానికి చెందిన పాఠశాల పూర్వ విద్యార్థి గడ్డం సుశాంత్ రెడ్డి ఇటీవల అమెరికా నుండి తిరిగి వచ్చి 28 సంవత్సరాల తర్వాత 2024 డిసెంబర్ 30న చైతన్య హైస్కూల్ 1996 బ్యాచ్ పాఠశాల మిత్రులందరితో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
దీనితో పాఠశాలనే వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆ పాఠశాల వ్యవస్థాపకులు, కరస్పాండెంట్ గంగారెడ్డి ని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు.
వారితో పాటు కేరళ ఉపాధ్యాయులు రవికుమార్, కరుణాకర్, వర లక్ష్మి, ప్రభాకరన్,మధుసూధన్, పాఠశాల స్థానిక ఉపాధ్యాయులు 28 ఏళ్ల తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
పాల్గొన్న విద్యార్థులు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సత్కరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

మే 3 నుండి ధర్మపురి నరసింహ నవరాత్రి ఉత్సవాలు

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎస్ఐ.సిహెచ్ సతీష్

జియాగూడ గోశాలలో గోసేవ, గోపూజ

బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

గొల్లపెల్లిలో ప్రారంభమైన ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరం

పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అభినందనలు

శ్రీ సీతారామా ఆలయంలో ఘనంగా వికాస తరంగిణిచే విష్ణు సహస్రనామ పారాయణం

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
