జగిత్యాలలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
పట్టణ టౌన్ సీఐ వేణుగోపాల్ ప్రకటన
జగిత్యాలలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టు
పట్టణ టౌన్ సీఐ వేణుగోపాల్ ప్రకటన
జగిత్యాల/గొల్లపల్లి నవంబర్ 03:
జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి తరలిస్తున్నారని పక్కా సమాచారంతో ఆదివారం పట్టణంలోని బైపాస్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ముగ్గురు యువకులు ఓ స్కూటీలో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారని తెలిపారు.
నిందితులైన బాలెపల్లి గ్రామానికి జక్కుల మధు, వెంగళాయిపేటకు చెందిన రాచర్ల వంశీ, కుక్కలగూడురు గ్రామానికి చెందిన నలిమెల వినోద్లను అదుపులోకి తీసుకొని విచారించామని తెలిపారు. తక్కువ ధరకు ఇతర ప్రాంతాల నుండి గంజాయిని తీసుకవచ్చి పట్టణం, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు,రాచర్ల వంశీపై గతంలో రెండు గంజాయి కేసులు నమోదు అయ్యాయని, నలిమెల వినోదపై గతంలో ఏడు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. గంజాయి తరలించినా, విక్రయించినా, సేవిస్తూ పట్టుబడిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, గంజాయి విక్రయిస్తున్న వారి వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
